శివం- 122 - అచ్చంగా తెలుగు

శివం - 122

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్ 




(నేను అనగా శివుడు. వరద గా విష్ణువు ..నేను ..నంది బ్రింగి తో పాటు కార్తికేయ ను గణ మీద పచ్చిక ల గుండ తీసుకు వెళ్తూ బ్రహ్మః దేవుల కి ..మీ త్రి మాతల కి ఏమి చెయ్యాలో తెలియ జేశాం)


ఎన్నో క్రోసులు ఉన్న పచ్ఛిక బయల నుండి దూసుకు వెళ్తున్నాము.

భూమి నుండి  మేము ఉండే ఆ స్థలానికి మేము కార్తికేయను తీసుకు వెళ్తున్నాం 
అది ఎవరు చేరలేని స్థలం మా సమ్మతి ఉంటే తప్ప 
ఈ స్థలం తదుపరి గమ్యమే బ్రహ్మా లోకం వైకుంఠం కైలాసం ..ఎన్నో జగన్నాథ క్రీడలు ప్రపంచం కోసం ఇక్కడ సిద్ధం చేశాం..ఏ పురాణాలు లో ప్రస్తావింపబడని ప్రదేశానికి మా కళాతృష్ణ కోసం వెళ్తున్నాం 


రై రై అని పరిగెడుతున్న కార్తికేయునికి నన్ను విష్ణువుని చూసి "గురువుల్లారా మీ ఇద్దరిని చూస్తే మనసు ఎంతో ఆనందంగా ఉంది. సాక్షాత్తు శివుని విష్ణువుని చూసినట్టు ఉంది..."

నేను "పద. బ్రహ్మదేవుడు కూడా నీకు కనపడతాడులే!"

వరద రాజా "అదే లేవయ్యా నాటకంలో పాత్రలే  ఆ  బ్రహ్మ దేవుడి పాత్ర కూడా సరిపడా మనిషి కనపడతాడు లేనని మా బావ ఉద్దేశం"

కా "బావా బామ్మర్దుల అంతరంగం ఒకటే ఒకరి మనసు ఒకరు భలే కనిపేడతారు" 

కార్తికేయుడు మనసులో మా హరసిద్ధ మహారాజు కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నాడు 

....
తన రాజ్యంలో శిల్పం చెక్కుతున్నాడు హరి సిద్ధమహారాజు..

హర సిద్దుడు " పాపం ఈ కార్తికేయుడు ఎటు వెళ్ళాడు ఏం చేస్తున్నాడో .. తిన్నాడో తినలేదో.
మనిషి మంచివాడు ఎవరినైనా ఇట్లే నమ్ముతాడు 
రాజ్యం విధించిన గడువు లోపల వస్తాడో రాడో.. తన దగ్గర ఉన్న పైకం సరిపోతుందో సరిపోదో.. సంక్రాంతి దగ్గరికి వస్తుంది ఇక శివరాత్రి రావడం ఎంతసేపు ..
కళాకారులు ఎట్లైనను తమ యొక్క భూమిని కాపాడుకోవాలి .. కచ్చితంగా కార్తికేయుడు నాటక ప్రదర్శన బాగా చేసి నన్ను మెప్పించి వాళ్లకి ఉన్న మాన్యాన్ని రద్దుకానీయకు0డా కాపాడుకోవాలి.. మహారాజుగా నా దగ్గర ఎన్నో సిరి సంపదలు ఉన్నప్పటికీ కూడా .. ఉన్నపలంగా పైకం లేని కారణంగా నా సొంత పైకం కొంత ఇచ్చి పంపించాను 
ఎక్కడ ఉన్నాడో బంగారు తండ్రి ." 

అని అనుకుంటున్నాడు ..

....

కైలాస గణాలు " ఏమి ఈ కార్తికేయుడు అదృష్టం.. ఒక విష్ణువును బ్రహ్మను శివున్నో ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేయాలి.. ఈతగాడు ఇద్దరితో చలోక్తులు విసురుతున్నాడు.. బ్రహ్మ దేవుడితో కూడా చలోక్తి ఆడపోతున్నాడు.. పైగా మన అమ్మవారల చేత  కూడా మహాదేవుడు ఏదో నాటకం ఆడిస్తాడు..
ఏదైనా భక్తి ఆనందం కళ మూడు ఒకటేనేమోలె" అని అనుకుంటున్నారు 

త్రి మాతలు"మనకి ముద్దుల తమ్ముడు సిద్ధమయ్యాడు " అని సరదాగా నవ్వు కుంటున్నారు
 
పచ్చికబయళ్ళల్లో మేము చేస్తున్న సారీ ఎన్నో పాలపుంతల ప్రయాణం అటువంటిది కానీ కార్తికేయని మనసు లయం వటం చేత అద తనకి క్షణాలుగా తోస్తున్నాయి..
ఈ ప్రక్రియ ద్వారా యోగులు ఋషులు  ఎన్నో మానవ సంవత్సరాలు తపస్సు చేసి తమ కోరుకున్నవి సాధిస్తారు .
అంతులేని ఈ కాలచక్రం ఎలా నడుస్తుందో,లోకాలు ఎన్నో, ఏమవుతుందో ఈ గొప్ప సృష్టిలో ఎక్కడెక్కడికి ఏ దారులు ఉన్నాయో ఏటువంటి ప్రక్రియలు జరుగుతున్నయో.. ఏటువంటి కాలగమనములు  జరుగుతాయి.. ఎన్ని పునరావృత్తమవుతాయి. బ్రహ్మము ఏది.. కాంతి ఏది క్రిష్టబలం ఏది అన్ని నాకు మాత్రమే సంపూర్ణంగా తెలుసు.. ఎందుకనగా వాటిని నేను సృజింప చేసిన వాడిని కదా ..

పార్వతీ మాత " అన్ని తెలిసిన మహాదేవుడు. ఒక చిన్న భక్తుడి కళాతృష్ణకి మెచ్చుకొని బావవేశాన్ని కల్పించుకొని తనకోసం మనందరిని కలుపుకొని ఏం లీల చేయబోతున్నాడు విశ్వనాథ నాయకుడు "

కా " గురువా ఏమిటి ఈ పచ్చి కి  చాలా దూరం ఉన్నట్లున్నాయి "

వరద " అవతల ఉన్న మాన్యమంతా మాదే .. వాటిని మేము సాగు చేసుకుంటూ బతుకుతున్నాం.. అక్కడ మా పరివారం ఉంది.. ఇప్పుడంటే కొంతమంది ఉన్నారు. మహా కుంభమేళాలకు వెళ్లారు.. లేకపోతే ఇంకో ఎంతో మంది ఉండేవారు "

కా " ఓహో అలాగన! అంటే ఇప్పుడు మీ పరివారం మొత్తం తిరిగి వచ్చే లోపల మనం ఈ నాటక ప్రదర్శన చేయాలి అదే మా రాజా  గురు పన్నాగం" అంటు నవ్వాడు 

నేను " పన్నాగము ఏముంది కార్తికేయ నా పేరు నటరాజు .. ఆయన వరదరాజు  "ఆ మాత్రం కళాతృష్ణ ఉండటం సహజమే సమంజసమే దానివల్లనే కదా నీతో అనుబంధం ఆప్యాయత అనురాగం ఏర్పడ్డాయి ఓ దర్శక స్నేహితుడా"

కా "నేను సరదాగా అన్నానులే గురువా ! "

వరద " మేము కూడా సరదాగా తీసుకున్నాము లె"

కా " గురువుల్లారా ! మీ ఇద్దరికీ కళాకారులకి ఉండే మాన్యం యొక్క విలువ మీకు తెలుసా అని భావిస్తున్నాను దయచేసి మీకు నేను ఏ పందెం పెట్టుకుని మా రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చానో తెలుసు కాబట్టి ఆ పందెంలో నన్ను మీరు నెగ్గించాలి"

నేను - వరద 
" ఏమయ్యా దర్శక దిగ్గజ ! అది మా చేతుల్లో ఏముంది నీవు మంచి కథ రాసుకొని బాగా నటించమంటే మేము నటిస్తాము .. నువ్వు ఆరు వంతులు చేయాలి మేము ఒక వంతు చేస్తాను అప్పుడే నూరు శాతం అవుతుంది "

నేను " నా కళారాధన నేను చేస్తాను మంచి కథే రాసుకున్నాను మంచి కథనం చేసుకున్నాను కళ ను చూసే వాడి మనసును బట్టి కూడా , కథ చేద్దాము అది నిర్ధారించుకునే ముందు తీర్పు చెప్పే వాడి మనస్తత్వం బట్టి కూడా నిర్ధారణ జరుగుతుంది 
ప్రదర్శన తర్వాత జరగబోయే ఏ ప్రక్రియ అయినా నా చేతుల్లో ఉంటుంది ప్రదర్శనకు ముందు ప్రక్రియ అంతా దైవాధీనము .."

నేను వరద  "భయం వద్దులే అటువంటి విజ్ఞములు నీకు రావు అవిఘ్నమస్తు.. ప్రజల్ని రంజంప చెయ్ కళ్ళతో తట్టి లేపు మంచి విలువలు పాటించు.."

కా " అవి ఎట్లాగో కచ్చితంగా ఉంటాయి నవరసాలు ఉండాలి కదా "

ఇద్దరం " నీకు అవి సమకూరుతాయిలె భయపడమాకు"

కార్తికేయనికి పచ్చిక ల్లో నుంచి వస్తున్న వెలుతురు చూస్తే మనసు రంజింపబడుతుంది 

కా " గురువా వెలుగు కనబడుతుంది "
నంది బృంగి గణ మూడు వేగం తగ్గించాయి 
వాటి ఆహార్యంలో మీరు చెప్పిన చోటికి చేర్చాం అనే ధీమా ఉంది 

నేను " బావ మొత్తానికి చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను "

వరద " పద బావా పద మన కొత్త అతిథి తో "

కా " అబ్బా ఎంతటి చల్లగాలి వీస్తుంది ఇటువంటి చల్లని ప్రకృతి గాలి నే ఆస్వాదించి ఎంతో కాలమైనది"

దేవతలంతా కొలువైన ఒక చిన్న విహారయాత్ర లాంటి వనం కి కార్తికేయుడు అడుగుపెట్టబోతున్నారు. 

వరద " దర్శకుడు మన మన్యం అందాలు చూసి మైమరిచిపోతాడేమో "

నేను " ముందు మీ చెల్లి చేత మా వాడికి అన్నం పెట్టించవయ్యా ఇందాకడి నుంచి ఆకలి ఆకలి నన్ను పట్టుకున్నాడు "

కా " గురువా అడుగు పెట్టకుండానే పులకించిపోతుంది ఈమాన్యం లోకి " 

అడుగుపెట్టిన తర్వాత అంతా నాటకమే

జగన్నాటకమే శివన్నాటకమే 

గణాలు " రంగనాయకుడికి విశ్వనాథ నాయకుడికి జై జై " అని తమ మనసులో ఘోషలు చేశాయి.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages