పేరు లేని రంగు.
 .... చందలూరి నారాయణరావు
9704437247
రంగులు పిలుస్తుంటే భయమేస్తుంది...
కళ్లకంటుకున్న వెంటనే
రంగురంగుల కలతలు
రంగు రంగులో వ్యూహమేముందో
ముఖంపై చిందిపడిన వెంటనే  మెరుపు రంగు
మనసు మబ్బు పట్టి నలుపు రంగు
పలుకు కురిసి పారుతుంటే మట్టి రంగు
అర్థాన్ని  పట్టి  తలస్తే ఎరుపు రంగు
తేలిగ్గా కదిలి కరిగితే తెలుపు రంగు
క్షణంకాలంలోనే వైరుధ్యం
ఒక్కోసారి పెనేసుకుని
ఒళ్లు విరుచుకుంటుంది వింత రంగు.
పిలిచినా వివిపించని రూపాన్ని
తలచినా అర్దముండదు.
కోరకుండానే  కోరిక పుట్టించి
పులుముకునేదాకా వెంటపడుతుంది.
పొగిడేలోగే ముఖం తిప్పుకుంటుంది.
ఎదుటకొస్తే ఓ రకం
తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకో రకం.
అద్దానికి అర్దం కాని రంగును
మనసు అర్దం చేసుకునే  చూపించేది
పేరు లేని రంగునే.
తాకితే పలకని , పలుకరిస్తే ఉలకని
అడ్రెస్స్ లేని అందాల్ని
మనిషిడెప్పుడు ధరించినా
నిజమో! శాశ్వతమో!
తెలియకపోవడం లోతైన శిక్షే.
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment