మరలిపో కరోనా.
1.ఆ.వె:పుట్టితి వటనీవు వూహాను నగరిలో
       వచ్చి చేరితివిట వాసిగాను
       నన్ని దేశములను నలవోకగా చుట్టి
         ప్రజకు బాధ లిడుట భావ్యమౌనె.
2.ఆ.వె:భీతి నిడక చనుము వేగమిక కరోన
       తిరిగి యగపడకుము దేశమందు
        విన్న నీదు పేరు పెరుగు రక్తపు పోటు
        వచ్చి నట్టి దారి పట్టి పొమ్ము
3.ఆ.వె: దైవభక్తి పెరిగె ధరణిలో జనులకు     
        కరములు మరి కాళ్లు కడిగి కాని
        యింటి నడుగు బెట్టి యెట్టి పనుల నైన
       మొదలు బెట్ట బోరు ముందుగాను.
4.ఆ.వె,:దగ్గు రొంప లింక తట్టు కొనగలేము
       సాగవే కరోన జవము గాను
      చెంత నీవు చేర చింతలే హెచ్చేను
       వందనాలిడుదుము వదలి పొమ్ము
5.ఆ.వె:పెరుగు పాలు కింక కొరతయు మొదలయ్యె
      బయటి కేగ నెంచ భయము కలుగు
     పిల్ల లాది గాను  వృద్ధుల వరకును
      నీదు పేరు చెప్ప నిదుర పోరు.
6.ఆ.వె:నీదు రాక వలన నేర్చితి మిప్పుడు
       మరచి పోయి నట్టి మంచి పనులు
     చేయి కలుప కుండ చేతులు జోడించు
      సంప్ర దాయ మెల్ల జనులు కబ్బె.
***
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment