90 వసంతాల భొంబాయి ఆంధ్ర మహాసభ 
ఓరుగంటి సుబ్రహ్మణ్యం 
మహాసభ కార్యవర్గం 90 వసంతాల వేడుకలకు శనివారం (6.1.2018) సాయంత్రం దీపప్రజ్వలన  చేసి శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలలో భాగంగా మొదటి సాంస్క్రుతిక కార్యక్రమం బాల కామేస్వరరావు (హైద్రాబాద్) బ్రుందం "సినారే కలం - ఘంటసాల గళం" సినీ సంగీత విభావరి నిర్వహించారు. బాల కామేస్వరంగారి గొంతు నిరాకరించడంతో,   బాపుశాస్త్రి, రేణుక, రుచికా ,  భొగా సహదేవులు ఈ సంగీత ఝరిని ముందుకు సాగించారు. వాయిద్యకారులు విభావరికి తోడునీడై తమవంతు సహకారాన్ని అందించారు. పూర్ణచంద్రరావు వివిధ సంగీత పరికరాలను ఉపయోగించి  తన ప్రతిభను చూపించారు.  ఈ సంగీత విభావరి ఆద్యాంతం శ్రోతలను అలరించింది.  
ముఖ్య అథిదిగా వచ్చిన మునిసిపల్ కౌన్సిలర్ అశిష్ చెంబూర్కర్ మహాసభ చేస్తున్న సేవలను కొనియాడారు.  తనవంతు సహాకారం సభకు అన్నివేళల ఉంటుందని భరోసా ఇచ్చారు. సాంస్క్రుతిక శాఖ ఉప్పధ్యక్షులు గట్టు నరసయ్య వందన సమర్పణతో కార్యక్రమ్మనికి ముగింపు పలికారు.  
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment