బాలలకు జేజేలు !
బాలలూ!  మీ అందరికీ అచ్చంగాతెలుగు జేజేలు పలుకుతోంది.  
 
ఎందుకో తెలుసా?  ఇవాళ మీరు బాలలు.  కాని రేపు మీరంతా బాగా చదువుకుని, పెద్ద పెద్దవాళ్ళవుతారు కదా!  అందుకని అన్నమాట!  
 
ఇవాళ్టి పెద్ద పెద్దవాళ్ళందరూ ఒకప్పడు మీలాగే చిన్న చిన్నపిల్లలుగా వుండేవారు కదా?  
 
అంతవరకెందుకు, మనం రోజూ పొద్దున్న లేవగానే  
 
"శ్రీరాముని దయచేతను  
 
నారూఢిగ సకలజనులు నౌరా యనగా  
 
ధారాళమైన నీతులు  
 
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ!"  
 
అని సుమతీశతకంలో చదువుకుంటామే, ఆ శ్రీరాముడు కూడా ఒకప్పుడు మీలా చిన్నపిల్లవాడే కదా?  మీలాగే అన్నం తినడానికి మారాం చేసేవాడు, ఐనా చక్కగా వాళ్ళ అమ్మ, అంటే కౌసల్యాదేవి కలిపిపెట్టిన అన్నం తిని పెరిగి పెద్ద అయి, ఎన్నో గొప్ప పనులు చేసాడు కదా?  అవన్నీ మనం నెమ్మదిగా తలుసుకుందాం ఏం?  
 
అవునూ, బాలలూ!  మీరు సుమతీశతకం చదివారా?  తప్పకుండా చదవండి.  అందులో మంచి మంచి కమ్మనైన పద్యాలున్నాయి.  
No comments:
Post a Comment