100% విజయాన్నిచ్చే 25 ఆలోచనలు - అచ్చంగా తెలుగు

100% విజయాన్నిచ్చే 25 ఆలోచనలు

Share This

100% విజయాన్నిచ్చే 25 ఆలోచనలు

బి.వి.సత్య నగేష్

మీరు గెలవాలంటే మీ మనసు ఇలా ఉండాలి .

విజయం సాదించాలంటే ముందుగా విజయం సాదించాలనే ఆలోచన ఆ వ్యక్తికి ఉండాలి .

మీ విషయం లో  విజయం సాదించాలి అనే విషయం నిర్ణయించుకున్న తర్వాత ఆ దిశలో ఆలోచనలు మొదలు పెట్టాలి . రోజు రోజుకి మీలో అబివృద్ది బాగా వస్తుంది అనే భావన మీలో బాగా ఉండాలి .

ఆత్మ పరిశోధనకు కూడా ఈ ఆలోచన బాగా పనికి వస్తుంది .చెడు ఆలోచన మనసులోకి రానివ్వకూడదు .ఆలోచన వలన మనో ధైర్యం పెరుగుతుంది.ఆలోచనలో ఊహించటం జరుగుతుంది.ఇది పగటి కలగానే ఉండిపోకుండా రోజు రోజుకి మీలో వచ్చే ప్రగతిని విశ్లేషించుకోవాలి.ఈ విజయం సాధించటానికి ఏమి చెయ్యాలి అనే విషయం చూద్దాం.మనసుకు విశ్రాంతిని స్పూర్తినిచ్చే ఈ క్రింది విషయాలు తలచుకోవాలి .

 1. మీరు ఏ పనినైనా చెయ్యగలరు.ప్రతి మనిషి తను అనుకున్నది సాధనతోనే సాధిస్తాడు.

 2. గతంలో ఎన్నో విజయాలు సాధించలేరు. ఇక ముందు ఎన్నో విజయాలు సాధించటానికి తయారుగా ఉన్నారు.

 3. గమ్యం చేరటంలో వచ్చే సమస్యలు స్పీడ్ బ్రేకర్లు మాత్రమే కాని అడ్డు గోడలు కాదు .ఒక ఊరు నుండి ఇంకో ఊరు బస్సులో వెళ్తున్నపుడు బస్సు అనేక సార్లు మార్గం మధ్యలో ఆగినా చేరవలసిన సమయానికి చేరవలసిన గమ్యం చేరుతుంది.

 4. సమస్యలను చూసి మీపై మీరు జాలిపడటం పొరపాటు. ఆత్మవిశ్వాసం తగ్గించుకోవటం ఇంకా పెద్ద పొరపాటు.

 5. గతం గురించి తలుచుకొని బాధపడకూడదు.బంగారం లాంటి భవిష్యత్తు గురించి ప్రణాళిక చెయ్యాలి .గతాన్ని మార్చలేం.

 6. వర్తమానం భవిష్యత్తుకి పునాది.గతం గురించి భాదపడటం అనవసరం.వర్తమానం లో ప్రతి క్షణం ను మీ లక్ష్యం గురించి ఖర్చు పెట్టండి .అదే మీ భవిష్యత్తుకి  పునాది.

 7. కొన్ని విషయాలలో రాజీపడి తీరాలి .

 8. కొన్ని విషయాలలో లౌక్యం తో వ్యవహరించాలి.

 9. ఏ  పని ముందు చెయ్యాలి అనే విషయం నిర్ణయించుకున్న తరువాత ఆ పనిని ఏకాగ్రత లో చెయ్యాలి .

 10. రోజు రోజుకి మీలో వచ్చే ప్రగతి ని మీరు హర్షించాలి .

 11. అవకాశాలు రావు .వాటిని కల్పించుకొని కైవసం చేసుకోవాలి.

 12. సమయం విలువైనది.ప్రతి క్షణం మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరికైనా రోజుకి 24 గంటలు మాత్రమే.

 13. విజయాలు సాధించిన వారందరు కస్టపడి సాధించిన వారే కాని విజయాలు వారికి ఎవరో తీసుకువచ్చి ఇవ్వలేదు.విజయాలు సాధించిన వారి గురించి అధ్యయనం చేసి వారు ఆ విజయాలు ఎలా సాధించారో తెలుసుకోవటం ఒక ముఖ్యమైన సాధన.

 14. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఎన్ని సంవత్చరాలు చూస్తున్నా స్విమ్మింగ్ రాదు. ఈత కొట్టాలంటే ఈ పూల్ లోకి దిగి విజయం కోసం పాటుపడాలి.

 15. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి.మీ మీద మీరు జాలి పడకూడదు.ఎవరి సానుభూతి గురించి ఎదురు చూడవద్దు అది మీ ఆత్మ విశ్వాసాన్ని సన్న గిల్లేటట్లు చేస్తుంది.

 16. ఆనుకున్న పనిని వెంటనే ప్రారంభించాలి .

 17. సమస్యను తలచుకొని బాధపడేకన్నా పరిష్కరించుకొని సంతోషపడటంలో ఎంతో తృప్తి ఆనందం ఉన్నాయి.

 18. వాయిదా వేస్తె విలువైన సమయం వృధా అవుతుంది.

 19. ఎంత దూరం వెళ్ళాలన్నా ఒక్క అడుగు తోనే ప్రయాణం మొదలవుతుంది కదా! ఏది సాధించాలి అన్నా ప్రయత్నం తోనే మొదలు పెట్టాలి .

 20. పొగడ్తలకు పొంగి పోవటం విమర్శలకు క్రుంగిపోవటం తప్పు.

 21. అలసిపోతున్నాను అని జాలి పడకండి.

 22. సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ,అంగవైకల్యం ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు.కాని వారి అబివృద్ధి ని వారు పాడు చేసుకోవటం లేదు. సమస్యతో  పాటే పడుతున్నారు.

 23. సమస్యకు బానిస కాకూడదు.నిరాశ,నిస్పృహలు సమస్యలకు సమాధానం కాదు.

 24. ఎదుటి వారు మిమ్మల్ని చులకన గా చూసేలాగా ప్రవర్తించ కూడదు .అది ఆత్మనూన్యతా భావనకు దారితీస్తుంది. విజయానికి ఆటంకం కలగజేస్తుంది.

 25. చిన్న రంద్రం కూడా పెద్ద నీళ్ళ ట్యాంక్ ని  ఖాళి చెయ్యగలుగుతుంది.చిన్న రంద్రం కూడా పెద్ద ఓడను నీట ముంచేయ్యగలదు.కనుక చిన్న చెడు ఆలోచన ను కూడా మనసులోకి రానివ్వకూడదు. అది ఆత్మ విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లు చేస్తుంది. విజయానికి అది కళంకం అవుతుంది.

 రోజు మనసుకు విశ్రాంతినిచ్చే సెల్ఫ్ హిప్నాటిజం తలచుకుంటూ మీ మనసును పూర్తి గా మంచి ఆలోచనలతో నింపితే మీ మనసు పూర్తి గా మిమ్మల్ని విజయం వైపు ప్రయాణం చేయిస్తుంది . విజయం సాధించి తీరుతారు.

No comments:

Post a Comment

Pages