పూలవనం(నానీలు) - పుస్తక సమీక్ష - అచ్చంగా తెలుగు

పూలవనం(నానీలు) - పుస్తక సమీక్ష

Share This
పూలవనం(నానీలు) - పుస్తక సమీక్ష
అఖిలాశ,7259511956

కోపూరి పుష్పాదేవి గారు రచించిన పూలవనం నానీల పుస్తకం ఒక ప్రవాహం అని చెప్పాలి సమాజంలోని ప్రతివిషయాన్ని సూటిగా ప్రశ్నించడం వారి నానిల ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.నేటి వార్త చానల్స్ తీరుతెన్నుల గురించి చక్కగా చెప్పారు.మనిషి దేవుడిని ఎంతాగా పూజిస్తాడు అంటే ఆ దేవుడి చిత్రాలను కవర్లపై ముద్రించి ఆ కవర్లు చెత్త కుప్పలో పడేసేతంటగా అని చక్కగా చెప్పారు అవును నిజమే కదా దేవుడు గర్భ గుడిలో ఉండాలి లేదా మన హృదయాలయంలో ఉండాలి అంతే కాని ఎక్కడ పడితే అక్కడ ముద్రించారాదు అని సూటిగా తెలియజేసారు.ప్రజల మూర్ఖత్వమే నాయకులకు రాబడి అని ప్రజలు మేల్కోవాలని..నిజానిజాల గురించి ఆలోచించాలని ప్రజలకు హితభోదచేస్తారు.తీవ్రవాదం,అవినీతి,కష్టసుఖాలు ఇలా సామజిక సమస్యల గురించి తన అక్షరాలను శరలుగా చేసి వదిలారు అని చెప్పవచ్చు ఈ కవయిత్రి.

ఒక నాని వేదాంతాన్ని వల్లవేస్తే ఒక నాని అధ్యత్మికను రంగారిస్తుంది ఇలా తను సృజించని అంశం లేదు అని చెప్పాలి.మనిషి నైజం గురించి,తన అవసరాలకి చేసే కృత్యాల గురించి కవయిత్రి వర్ణించిన తీరు అమోఘం అని చెప్పవచ్చు.స్వలాభం లేకపోతె ఎంతటి మంచి ఆలోచనైన ముందుకు సాగనివ్వరు అని ఆవేదన చెందుతారు.మూఢనమ్మకాలకు ప్రాంతాలు అవసరం లేదని అందరు ఒక్కటే అని వాటి బారిన పడితే భవిష్యత్ శూన్యం అని చెప్పకనే చెప్పారు.నేటి యువత చిన్న వయసులోనే అన్ని చూడాలి అనే తత్వతోనే సమయం వృద్ధ చేస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటూన్నారని అని మనసు అనే మహేంద్రజాలం ఆడించే ఆటలో పావులుగా మారుతున్నారని ఆవేదన చెందుతున్న ఈ కవియిత్రి ఎంత సున్నితమైన మనసు కలవారో తెలిసిపోతుంది.ఈ కవయిత్రి ఎన్నో పుస్తకాలు తెలుగు సాహిత్య ప్రపంచానికి పరిచయం చేయాలి అని ఆశిస్తూ.కవయిత్రికి శుభాకాంక్షలు.

No comments:

Post a Comment

Pages