శాప విమోచనం - బి.వి.రమణరావు Shapa vimochanam - అచ్చంగా తెలుగు

శాప విమోచనం - బి.వి.రమణరావు Shapa vimochanam

Share This
నాగార్జున సాగర్ దిగువ కాలవతవ్వే సమాయంలో దొరికిన తాళపత్రాల్లో ఉన్న గాథ యిది. ఇది ఏకాలం నాటిదీ ఏ మహర్షి వ్రసిందీ అన్న విషయాలు యింకా చరిత్రకరులు యిదమిద్ధమని తేల్చలేదు. వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల్లోనూ యిది లేదు కనుక, దరిమిలా దివ్యదృష్టితో లోకాంతర విశేషాలు చూడగలిగిన ఏ మహర్షో రాసి ఉండాలి. సుదీర్ఘమైన ఈ పురాణగాధను అతి క్లుప్తంగా మనవి చేస్తాను. అది సప్తమస్కందసమన్వితం. 1అపరలోక ఆవిర్భావం కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలమీద, త్రేతాయుగంలో మూడుపాదాలమీద, ద్వాపరయుగంలో రెండు పాదాలమీద, కలియుగంలో ఒంటిపాదం మీద నడుస్తుందని శాస్త్రాల్లో సూచించబడింది. కాని, వర్తమానకాలంలో ధర్మం స్తంభించిపోయింది. దానికి తార్కాణంగా కృతయుగంలో స్వర్గంలో జనాభా అయిదువందలకోట్లు ఉంటే నరకంలో ఏభైకోట్లు ఉండేది. ధర్మ గ్లాని దినదినాభివృద్ధి కావడంతో ప్రస్తుత నరకంలో అయిదువందల నలభయ్యారు కోట్లు ఉంటే స్వర్గంలో నాలుగుకోట్లమంది ఉన్నారు. ఇంచుమించు వాళ్ళందరూ దేవగంధర్వ కిన్నెరకింపురుషాదులే. ఎక్కడో నూటికీ కోటికీ ఒకళ్ళో యిద్దరో స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. నరకంలో జనాభా యీవిధంగా విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ యమయాతనలు పడే ప్రజానీకంతో బాటు పాలనా యంత్రాగానికి కూడా గాలి, నీరు, వెలుతురూ కరువయ్యాయి. క్షీరసాగరంతో శేషతల్పంమీద యోగనిద్రలో గుర్రెట్టి పడుకున్న విష్ణుమూర్తి దగ్గరకి దేవతలందరూ వెళ్ళి ఆర్తనాదాలతో మేల్కొల్పి ఈ సమస్య కేదైనా పరిష్కార మార్గం శెలవియ్యమని మొరెట్టుకున్నారు. బృహస్పతిని పిలిచి, ఏం చేస్తే బాగుంటుందని విష్ణుమూర్తి అడిగాడు. “ప్రభూ..! భూలోకంలో పాపం చెయ్యని వాళ్ళెవ్వరూ ఉండరు. వృత్తి వ్యాపారాల్లో కాని, ఉద్యోగాధికారాల్లో కాని రాజకీయరంగంళో కాని ఏదో విధమైన అవినీతికి, దుర్మార్గానికి, ద్వేషానికి పల్పడని వాళ్ళుండరు. ఖూనీలు, దౌర్జన్యాలు దొంగతనాలు మోసాలు చేసేవాళ్లతోబాటు వీళ్ళకి నరకంలో బాధలు తప్పవు. ఇది యుగయుగాలుగా వొస్తున్నదే..” అన్నాడు బృహస్పతి. “ఆరూల్స్ మార్చడానికి వీల్లేదు” అన్నాడు విష్ణుమూర్తి విసుగ్గా, “చిత్తం స్వామీ! అది మార్చక్కర్లేదు. కలియుగం ఉత్తరార్థంలో కట్నాలూ, లాంచనాలు అంటూ “పెళ్ళికి స్త్రీలను పీడించడం, పెళ్ళి చేసుకుంటానని దగా చెయ్యడం, పెళ్ళాడి భార్యల్ని హింసపెట్టడం, లాంటి ఘోరపాపాలు చెయ్యడం పురుషులకి పరిపాటయిపోయింది. ఈ బాపతు జనాభా నరకంలో ఏభైశాతం ఉన్నారు. వాళ్ళకొక ప్రత్యేకమైన లోకం సృష్టించి వాళని తగురీతిగా శిక్షించినట్లయితే నరకంలో జనాభా తగ్గుతుంది. మరి స్వామి ఆజ్ఞ” అన్నాడు బృహస్పతి వినయంగ. త్రిశంకుస్వర్గం లాంటి అపర భూలోకాన్ని సృష్టించి, అలాంటి మొగాళ్ళకి బుద్ధిచెప్పండి “ అంటూ ఆవలించి మళ్లీ యోగనిద్రలోకి విష్ణుమూర్తి జారుకున్నాడు, 2పరిణయస్కందం “అదిగో మా అమ్మాయి” అనడంతోటే సోఫాలో కూర్చున్న రంగనాథం, సుధాకర్, లత లేచి నిలబడి మేడమెట్లమీద నుంచి దిగుతూ ఠీవిగా బ్లౌజ్ బటన్స్ పెట్టుకుంటూ వొస్తున్న స్వర్ణవైపు దృష్టి మళ్ళించారు. “ఎంతచక్కని అమ్మాయ్!” అనుకున్నారందరూ, క్లోజప్లో “అతనే మా స్నేహితుడు రంగనాథం, అతను వాళ్ళబ్బాయి సుధాకర్, ఈ అమ్మాయి సుధాకర్ చెల్లెలు లత” అంటూ స్వర్ణ తండ్రి అందరినీ పరిచయం చేసేడు. అందరూ కూర్చున్నారు “ఎంతవరకు చదువుకున్నాడబ్బాయి?” అని అడిగింది స్వర్ణ “చెప్పు. సిగ్గుపడతావేఁ!” అని విశ్వేశ్వర్రావనడంతో సుధాకర్కి సిగ్గు మరింత ముందుకొచ్చి. మరింత తలదించుకున్నాడు. “ఏమిటో బావగారూ! ఎంత గ్రాడ్యుయేటయినా మా పాతకాలం సాంప్రదాయం వాడిలో జీర్ణించుకుపోయింది. ఆడవాళ్ళముందు వాడి నోరు పెగల్దు. చచ్చి స్వర్గానున్న మ ఆవిడగారు “ఏరా రంగీ, సుధకి కూడా నీ పోలికే వచ్చింది అనేవారు. ఎంత చదువుకున్నా ఆడవాళ్ళ ముందు వాడికి నోరు పెగల్ద్ఫు, ఇంతెందుకు, ఇన్న్నేళ్ళొచ్చినా ఆడతోడు లేందే ఒక్కడూ సినిమాకెళ్ళలేడు. కూడా మా లత ఉండాల్సిందే” అన్నాడు రంగనాథం. “మొగాడికి సిగ్గే సింగారం అన్నారు పెద్దలు” అన్నాడు విశ్వేశ్వర్రావు. “ అబ్బాయికి సంగీతం, డాన్సులాంటివేమైనా నేర్పించారా?” అడిగింది స్వర్ణ “మీకు తెలియనిదేముంది బవగారూ! మాది ఆడదిక్కులేని సంసారం. ఇంట్లో పనిపాట్లు నేర్పించేను. మా ఆవిడగారు బాగుంటే పిల్లాడి అచ్చటా ముచ్చటా తీర్చేవారు. వరిదారిన వారు వెళ్ళి పోయేరు. లత చేతికందొచ్చే వరకూ..!” అంటూ కంటతడి పెట్టేడు రంగనాథం. “ఊరుకో పాపం, మొగాడివైనా శాయశక్తులా సంసారాన్నీడ్చుకొచ్చేవు. అమ్మాయి చేతికందొచ్చిందంటే తల్లికి మించిన ప్రయోజకురాలవుతుంది ఇంకెంతకాలం. ఇంజనీరింగు మూడోయేడు చదువుతుంది కదా!” అన్నాడు విశ్వేశ్వరరావు వోదార్పుగా. “బియ్యే పాసయింది కదా! ఏమైనా పై చదువులు చదవాలనుకుంటుందా?” అడిగింది స్వర్ణ. “వీడుద్యోగం చెయ్యాలా ఊళ్ళేలాలా! పెళ్ళి చేసి ఓ అమ్మచేతిలో పెట్టేవరకే కదా యీ చదువు?” అన్నాడు రంగనాథం. “ఊరికే అడిగిందోయ్ ఇప్పుడిప్పుడే కదా మొగాళ్ళు చదువుకోవడం మనరోజుల్లో మొగాడికి చాకలిపద్దు రాసుకోగలిగితే అదే గొప్ప” అన్నాడు. “స్పోర్ట్లు, గేమ్సులో కాని ప్రవేశముందా? అని స్వర్ణ సిగ్గుతో తలవొంచుకొని కూర్చున్న సుధాకర్ కేసి చూసి నవ్వుతూ అడిగింది. “ఏమిటా మూగనోము? మాటలు కూడా రావనుకుంటారు. జవాబు చెప్పు.” తండ్రి రంగనాథం గదమాయించాడు. “ప్రవేశం లేదు అభిరుచుంది రన్నింగ్ కామెంట్రీ వింటాను” అన్నాడు సుధాకర్, “ఏవో గేమ్స్ ఆడతాననేవాడు. నేనే వొద్దనేవాడ్ని. ఇప్పుడు రోజులెలా ఉన్నాయో మీకు తెలీందేముందు! పెళ్ళీడొచ్చిన మొగాడు కాలేజీనుంచి యింటికి రావడాఅనిక్ ఇఅరగంటాలస్యమైతే గుండెలు దడదడలాడతాయి. ఎక్కడచూసినా పోకిరీ ముండలి, కాస్త ఎర్రగా బుర్రగా ఉన్న మొగపిల్లాడు వొంటరిగా కనబడితే వెంటపడటం, అల్లరిచెయ్యడం మీకు తెలియంది కాదు., నేనా మొగాడ్ని.. ఎక్కడ ఎలాంటి అల్లర్ల పాలవుతాడో అనీ నేనే ఆట పాటలకీ వెళ్ళనివ్వలేదు.” అని సర్దిచెప్పాడు రంగనాథం. స్వర్ణ మంచి ముహూర్తాన సుధాకర్కి మూడు ముళ్ళూ వేసింది. స్వర్ణ కారు డ్రైవ్ చేసుకుంటూ పక్కన తనని కూర్చోబెట్టుకు వెడుతుంటే ఆనంద తన్మయత్వంలో ఉండేవాడు సుధాకర్. ఎంతో అన్యోన్య దాంపత్యమనీ మురిసిపోయేరు వియ్యంకులిద్దరూ. ఓసారి మొగాడు స్కూటర్ డ్రైవ్ చెయ్యడం చూసి సుధాకర్ ఆశ్చర్యపోతుంటే “మొగాళ్ళు స్కూటర్ డ్రైవ్ చెయ్యడమే కాదు. నాతో క్లబ్బుకు రా చూద్దువుగాని, భార్యలవెంట వచ్చి పేకాడాతారు. సిగరెట్లు కాలుస్తారు. తాగుతారు” అని స్వర్ణ అంటుంటే “ఛీ పాడు” అన్నాడు సతివ్రతుడైన సుధాకర్. తన చెక్కిలిని సుతారంగా స్వర్ణభుజానికానించి. స్వర్ణ ఆప్యాయంగా పక్కకి తలవంచి సిగరెట్ పొగ సుధాకర్ మొహమ్మీదకి ఊదింది. “అబ్బ! ఏం సిగరెట్లు కాల్చడం బాబూ, ఒకటే వాసన” అన్నాడు సుధాకర్. పొగచేత్తో పక్కలికి విసురుతూ, “ఇదే ఆడవాసన” అంది స్వర్ణ, సుధాకర్ నడుంచుట్టూ చెయ్యివేసి తన వైపు లాక్కుంటూ. మరోసారి సినిమా పోస్టర్లను గురించి విమర్శిస్తూ “ఛీ! ఈ సినిమాల్లో ఏక్ట్ చేసే మొగాళ్ళకెంత సిగ్గుళేదో వొళ్ళలా ప్రదర్శించడానికి?” అన్న సుధాకర్ బుగ్గ మీద చిటికేస్తూ “సెక్సప్పీలంటే అదే డార్లింగ్..! ఈ పైజమా లాల్చీ తీసేసి వీకట్ బనీనుతోనూ అండర్వేర్ తోనూ చెర్లో స్నానం చేసి బయటకొస్తున్నప్పుడు ఫొటో..” అని స్వర్ణంటుంటే “ఛీ ఊరుకోండి” అంటూ సుధాకర్ స్వర్ణనోటిని చేత్తో మూసేడు. అందం, ఐశ్వర్యం. ఆరోగ్యం, ఔదార్యాలతో సుధాకర్ స్వర్ణలత ఒకళ్ళనొకళ్ళు తీసిపోని అపురూప అన్యోన్య దాంపత్యం అయితే, అప్పుడప్పుడు క్లబ్బు, పేకాట, తాగుడు సరదాల్లో స్వర్ణ రాత్రిళ్ళు ఇంటికి ఆలస్యంగా వచ్చేది. ఓ రోజున మరికాస్త ఆలస్యమైందేమో ఉక్రోషం పట్టలేక సుధాకర్ “రాత్రిళ్ళు మీరొచ్చే వరకూ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ వొంటరిగా ఉండడానికి భయమేసి చస్తున్నానండీ! అంటూ కంటతడి పెట్టేడు. “ఛ! ఛ!” భయమెందుకు?” అంటూ బుజ్జగించబోయింది స్వర్ణ. “మీకే, మీరలాగే అంటారు. పక్కవాటాలో ఉన్న వసుంధర రాగొచ్చి రోజూ రాత్రిళ్ళు మొగుడ్ని తంతుంది. ఆ ఏదుపులూ, అరుపులూ వినలేక చస్తున్నాను. ఆవిడతో తనింక కాపురం చెయ్యలేనని తనే నుయ్యో గొయ్యో చూసుకుంటానని ప్రభాకరం రోజూ మధ్యాహ్నం మనింటికొచ్చి ఒకటే గోల” అన్నాడు సుధాకర్. “వసుంధర తాగడం మానదు. తన్నడం మానదు. ప్రభాకరం చస్తానని బెదిరించడం మానడు. చావడు. ఆవిడ్ని విడిచి పెట్టిపోలేడు. ఇది అంతులేని కథ డాళింగ్! ఇది నూటికి తొంభై ఇళ్ళల్లో జరిగే భాగోతమే. ఈ లోకం తీరే అంత. మనం భయపడి, భాదపడి లాభం లేదు” అని భోదించింది స్వర్ణ. “రాత్రిళ్ళు కిటికీ లోంచి నాకేసి అదోలా చూస్తోందండీ ఆవిడ. అసలే తాగొస్తుంది. నేనొక్కడినే ఉంటాను భయంగా ఉంటుందండీ!” అన్నాడు సుధాకర్. “ఆవిడేమైనా వెర్రివెర్రి వేషాలేస్తే ఒళ్ళు హూనం చెయ్యమని మన గూర్ఖా వాచ్మెన్తో చెప్తాను. ఈసారి ఆ వసుంధర వాళ్ళింట్లో మరీ అల్లరి చేస్తే పోలీస్స్టేషన్కి ఫోన్ చెయ్యి. ఇన్స్ పెక్టర్ సుబ్బలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ మంఅతాయారూ నిమిషాలమీదొస్తారు. వాళ్ళకి కూడా నేను టెలిఫోన్ చేసి చెప్తాను.” అందే కానీ స్వర్ణ తను పెందరాళే ఇంటికొస్తానని హామీ ఇవ్వలేదు. ఇంకా బిక్కమొహం పెట్టుకున్న సుధాకర్ ఏం ప్రోమిస్ చెయ్యమంటాడో అని తటపటాయిస్తూ “ చెప్పడం మర్చిపోయేను. గుడ్ న్యూస్. ‘మొగలోకం’ సంపాదకురాలు వీరనాగమ్మని కల్సుకున్నాను నువ్వు రాసిన నవల గురించి చెప్పాను తప్పకుండా సీరియల్గా చేస్తానని చెప్పి పంపింది., నా చేతికియ్యు. రేపురాత్రి క్లబ్లో కలుసుకున్నప్పుడు స్వయంగా స్క్రిప్ట్ ఇస్తాను.” అంటూ ఓ కస్సా వేసింది స్వర్ణ. దాంతో సంతోషంతో స్వర్ణ కౌగిలిలో సుధాకర్  మైనంముద్దయిపోయాడు.   3తతః ప్రభావం కథ అంతటితో ఎందుకాగిపోలేదంటే హఠాత్తుగా కారేక్సిడెంట్లో స్వర్ణ స్వర్గస్తురాలైంది. ముప్ప్యివేలు కట్నం పోసి మురిసిపోతూ చేసిన పెళ్ళి మూణ్ణాళ్ళ ముచ్చట అయిందని రంగనాథం భోరున ఏడ్చాడు. సుధాకర్ మూడు రోజులు కోమాలో ఉన్నాడు. ఆ తర్వాత కూడా మామూలు మనిషవ్వలేదు. కాస్త తేరుకున్నాక, ఈరోజుల్లో మగాడురెండోపెళ్ళి చేసుకోవడం అక్కడా అక్కడా వింటున్నాం. చిన్నవయస్సు అపురూపమైన అందగాడు. పిల్లాజల్లా కల్గలేదు. అంచేత అవసరమైతే మరో ఇంతకట్నం పోసయినా సరే, రెండో పెళ్ళి చెయ్యడానికి రంగనాథం శతవిధాలా ప్రయత్నించేడు. పోనీ, ఉద్యోగం చేసుకోమన్నాడు. ససేమిరా దేనికీ ఒప్పుకోలేదు. నా స్వర్గాన్ని నాకు భగవంతుడు దూరం చేసేడు. బొందితోటే స్వర్గానికెళ్ళి తను స్వర్ణతో అక్కడా కాపురం చేస్తానని సుధాకర్ పట్టుదలతో తపస్సు ప్రారంభించేడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతని తపోదీక్ష పెరిగిపోసాగింది. కొన్నాళ్ళకి ఆ కఠోరతపస్సు ధాటికి తట్టుకోలేక చతుర్దశ భువనాలూ కంపించేయి. అప్పటికి సుధాకర్ తొమ్మిది టన్నుల తపోఫలాన్ని సంపాదించాడు. పదిటన్నులు పూర్తయితే ఇంద్రపదవి లభిస్తుంది. పదవిపోవడం ఖాయం అని తెలిసిన ముఖ్యమంత్రిలాగా భయభ్రాంతుడై ఇంద్రుడు ఏదో విధంగా చక్రం అడ్డువెయ్యమని నారదుడ్ని ఆశ్రయించాడు. నారదుడు సినిమా ప్రొడ్యూసర్ వేషంలో వచ్చి “నాయనా! ఇంతటి ఆత్మాహుతి నీకు తగదు. మళ్ళీ పెళ్ళాడనన్నవు. ఉద్యోగం వొద్దన్నావు. బొందితో స్వర్గానికెళ్ళాలంటూ చిక్కి శల్యమవుతున్నావు. మీ ఆదర్శదాంపత్యాన్నే కథా వస్తువుగా ఒక ఫిలిం తీద్దామని నినమ్దులో నటించమందామని గంపెడాశతో వొచ్చేను” అన్నాడు. తపః ప్రభావంతో అతని నిజరూపం తెల్సుకుని “నారదమునీంద్రా! మీరు సినిమా తీస్తానంటే వేషం వెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో నటించడానికి మీకు చేతనయితే నా ఆరాధ్యదేవత స్వర్ణని తీసుకు రండి. లేదా, నన్నీ విధంగా మోసం చేయడానికి వొచ్చిన ఈ వేషాన్ని సార్థకం చేసుకుంటూ భూలోకంలో మీరు సినిమాల్లో నటించుగాక! అంటూ శపించాడు. సుధాకర్ ఆ శపించడంలో తన తపశ్శక్తిని కొంత కోల్పోతూ, నారదుడు తంబురా చంకనెట్టుకొని దేవేంద్రుడి దగ్గరకెళ్ళి “పుణ్యానికెడితే పాపం ఎదురైనట్టు నీకుపకారం చెయ్యబోతే నాకు శాపం దెబ్బ తగిలింగి.” అంటూ వాపోయాడు. “ఈశ్వరాజ్ఞ! ఏం జరిగినా లోకకళ్యాణం కోసమే కదా! మొత్తం ఎమెద తపః ప్రభావం కొంత తగ్గింది. నాకు ఊపిరాడుతుంది. “స్వర్ణరూపం తప్ప అన్య సుందరీమణులెవ్వరూ ఆకర్షించలేదు. సుధాకరుడికి తపోభంగం కలగాలంటే స్వర్ణ అపరభూలోకం లోఇ అవరోహించాలి.” అన్నాడు నారదుడు. “అదెలా సాధ్యం? స్వర్గలోకంలో ఉన్న స్వర్ణ ఆలోకంలో కెళ్ళమంటే వెడుతుందా? ఆ బంధాలు ఆ జ్ఞాపకాలు ఆ కాయం కాలిపోవడంతో సరికదా! తొల్లి అభిమన్యుడూ స్వర్గస్తుడయ్యేక తండ్రి అయిన అర్జునుణ్ణే ఆనవాలు పట్టలేకపోయాడు కదా?” అన్నాడు ఇంద్రుడు. వజ్రాయుధంతో గోళ్ళు కత్తిరించుకుంటూ. “స్వర్ణ కాకపోతే స్వర్ణరూపంలో మరెవరైనా.. నారాయణ నారాయణ !” అంటూ నారదుడు గగనమార్గం పట్టేడు. 4ఇంద్రవైభవం అది స్వర్గం. ఇంద్రుడు శచీదేవి తమ ముప్పైరెండు లక్షల నలభయ్యారువేల ఏభయ్యో వివాహ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. దీపావళి రాత్రి ఏబిడ్స్ రోడ్ లాగ రంగు రంగు దీపకాంతులతో స్వర్గసీమంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అంతటా ఆనందం తాండవిస్తోంది. నాటి సాయంత్రం మహేంద్రభవనంలోని వినోదాలయంలో తరగతి వారీగా కూర్చున్న దేవ గంధర్వ కిన్నెర కింపురుషులు ఆకాశవీధిలో ప్రదర్శింపబడుటకు ఏర్పాటు చేయబడ్డ చలనచిత్రం దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోక్షణంలో ప్రదర్శన ప్రారంభమవుతుందనగా నారద మహాముని భూలోక సంచారం పూర్తి చేసుకొని, సభాసదులకెదురుగా ఆకాశమార్గాన అరుగుదెంచి ఆ పుణ్యదంపతుల మ్రోలనిలిచి తన శుభాకాంక్షలు అందజేశాడు. తర్వాత సంచీలోంచి ఒక్కొక్క పేకట్టే తీసి దేవేంద్రుడి హస్తములందుతుండగా “ఏమిటి మహానుభావా, ఈ అపురూప కానుకలు?” అడిగేడు దేవేంద్రుడు. “ఊరకరారు మహాత్ములు! మళ్ళీ ఏదో చిచ్చు రగిల్చి పని కల్పించడానికొచ్చుంటారు” అంది శచీదేవి. “నారాయణ్ణారాయణ! ఈ శుభసమయంలో భూలోకవాసులు భక్తితో పంఇన కానుకలు సమర్పించడానికి నేనొస్తే ఇదా అతిథి సత్కారం? ఇది వీరశైవులు గ్రోళే “శివ్వాస్ రీగల్”, ఇది వైష్ణవులు తమ అభినందన చిహ్నంగా పంపిన ‘రాయల్ సెల్యూట్’ ఈవిస్కీలనబడునని సోమరస సదృసములైన మరుకలశములు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు. వీటిని సాంకేతికముగ వెలసిన 555 సిగరెట్లు అనబడే ఈ పేకట్టు ధూమసుధాసాధనం. భూలోక వాసులు తమ వైజ్ఞాన ప్రగతి, చంద్రమండల యాత్ర, చలనచిత్ర సంచలనవైభవం తెలియజేయు ఈ మూడు ఫిల్మురీళ్ళు ఈనాటి కార్యక్రమానికి ఉపయోగపడతాయని పంపేరు” అన్నాడు నారదుడు సంచీ భుజాన వేసుకుంటూ. నారద మహాముని సముచితాసనమున ఉపనిష్టుడైన పిదప ఇంద్రుని సంకల్పానుసారం గగనవీధుల మేఘములు తొలగిపోయి చతుర్భుజాకారంలో రంగురంగుల నింగి తొంగిచూసింది. ఆ రంగోళీ ఆచ్చాదం అదృశ్యం కాగానే హిమగిరి సానువులు ప్రత్యక్షమయ్యేయి. తర్వాత ప్రరాఖ్యుడు, వరూధిని తాలూకు ప్రణయగాధ కన్నులకు, వీనులకు విందు కలిగించింది. ఆ తర్వాత నారద మునీంద్రుడు తెచ్చిన ఫిల్ము రీళ్ళు కూడా ఇంద్రుని సంకల్ప శక్తిచేత ప్రదర్శింపబడ్డాయి. ‘ఎంతఘాటుప్రేమ! ఎంతటి ఘనవిజయం! ఎంత ఘోరకలి’ అంటూ ఆ ఫిల్ములను గురించి ఎవరికి తోచిన విమర్శలు వాళ్ళు చేస్తూ లేచేరు. తిలోత్తమ మాత్రం కూర్చున్న చోటు నుంచి లేవకపోవడం చూసి, నిద్ర పోతుందేమోనని మేనక, ఊర్వశి చెరో జబ్బా పట్టుకుని లేవదీయబోయి, ఆమె ముఖంలో ఆనందరేఖలు గమనించి పారవశ్యంలో మూర్చ పోయిందని గ్రహించి ఎందుకైనా మంచిదని ధన్వంత్రిని తీసుకురమ్మని ఓ గంధర్వుడ్ని పంపారు.    5శాపవృత్తాంతం “ముని శాపం అనుభవించక తప్పదు” అని తలదించుకున్నాడు దేవేంద్రుడు “అంతా ఈశ్వర సంకల్పం” అన్నాడు నారదుడు. రంభగంభీరవదనయై “ఆముని ఎవరు? ఆ శాపంబెట్టిది” అని అడిగింది నారదుడు ఆమెను నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించి, తన అరచేతిలో రంభకు ఆ శాపవృత్తాంత దృశ్యములను చూపెట్టేడు. ఆమె చూసిన గాధ ఇది__ ఒకప్పుడు అపరభూలోకంలో సుధాకరుడను మహర్షి స్వర్గాధిపతి అయ్యే ప్రమాదం గుర్తించి నారదముని సూచన ననుసరించి ఆ మహర్షి తపస్సును ధ్వంసం చెయ్యమని ఆవిద్యలో అప్సరసలందరిలోనూ ఆరితేరిన తిలోత్తమను దేవేంద్రుడు నియమించేడు. సుధాకరుని ప్రియసఖి అయిన స్వర్ణరూపం దాల్చి అతని తపశ్శక్తికి మెచ్చి మృత్యుదేవత కరుణించి తనకి పునర్జీవనం ప్రసాదించిందని చెప్పి అతనితో కాపురం పెట్టింది. తపోభంగోద్యమం విజయోన్ముఖమైంది. అతని తపశ్శక్తి రెండున్నర కిలోగ్రాములకి దిగజారిపోయింది. పైగా మృత్యువు ఆసన్నమైంది విధిబలీయం సరిగ్గా ఆ సమయానికి సుధాకర్కి మత్తు వొదిలి తిలోత్తమంటే మొహమ్మొత్తి ఆమె నిజస్వరూపం గ్రహించి “ఓసీ మాయావీ! నీ మోహపాశంతో నా కళ్ళుకప్పి నన్ను తపోభ్రష్టుడ్ని చేసినందుకు ప్రతిఫలంగా నువ్వు మోహావేశంలో భూలోకంలో..” అని శాప వచనము పూర్తి కాకుండానే తపశ్శక్తితోపాటు ఆయుర్దాయాన్ని కూడా కోల్పోయేడు. ‘కుయ్యో మొర్రో’ అంటూ తిలోత్తమ ఇంద్రుడిదగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. కాలనిర్ణయం చెయ్యకుండా శాపాఘాయిత్యం చేసిన మునీశ్వరుణ్ణెవణ్ణీ ఇంత వరకూ తన సర్వీసులో చూడలేదని మనంబున చింతించుచూ ఇంద్రుడు__ “మరేమీ ఫర్వాలేదు. భూలోకంలో కొన్నాళ్ళుండి మళ్ళీ తిరిగొచ్చెయొచ్చు పఒగా నారదుడికి కూడా ఈశాపంలో వాటా ఉంది. అంచేత నారదుడు నీకు తోడుగా వస్తాడు” అన్నాడు. “కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు? అడిగింది తిలోత్తమ. “ఆముని మనస్సులో ఎన్నాళ్ళుందో అన్నాళ్ళు, భూలోకవాసులు అల్పాయుష్కులు. ఏపదమూడేళ్ళో పధ్నాలుగేళ్ళో కంటే వాళ్ళకి నోరు రాదు. అది మనకాలమానంలో కొన్ని ఘడియలు” అని ఇంద్రుడు ధైర్యం చెప్పేడు. “భూలోకులు తమో రజో గుణపీడితులు. కామాంధులు..” భయపడకు. నీ అమృతత్వానికి నిత్యనూతన యౌవ్వన కన్యాత్వానికి ప్రమాదము రాకుండా అదృశ్యము దుర్భేద్యము అయిన అద్భుత కవచాన్ని ప్రసాదిస్తాను” అని ఇంద్రుడు హామీ ఇచ్చేడు. “కాలకర్మ కారణ కర్తవ్యముల ననుసరించి ఆ శాపఫలం అనుభవించవల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ శాపప్రభావం వల్లణే తిలోత్తమలో ఇటువంటి చిత్తచాంచల్యం కలిగింది” అని చెప్పి నారదుడు  తన అరచెయ్యి తుడిచేసుకున్నాడు. మర్నాటి ఉదయం నవరత్న ఖచిత స్ఫటిక శిలపై కూర్చుని పాల సముద్రంలో కాళ్ళు పెట్టి అలలతలలపై తేలియాడు పాలనురగను పాదములతో సొగస్గా, గాలిలోకి చిమ్ముతూ ఆలోచనా నిమగ్నురాలైన తిలోత్తమ, నారాయణనామము వినగానే వచ్చినవాడు నారదుడని గ్రహించి, అతనివైపు తిరగకుండానే నమస్కరించి “నిజంగా భూలోకవాసులలో అన్నిరకాల భోగభాగ్యాలూ వివేక విజ్ఞానాలూ అందచందాలూ ఉన్నాయా?” అని అడిగింది. “వాటితో పాటు కష్టం, నష్టం, దుఃఖం, దారిద్ర్యం, మరణం కూడా ఉంటాయి.” అన్నాడు నారదుడు. “అవిలేకనే ఇక్కడ జీవితం పేలవంగా ఉంది. ఇక్కడ అందరికీ ఏం కావలిస్తే అవి సంకల్ప మాత్రంచేత లభిస్తాయి. అందరూ  ఆనందంగా ఉంటారు. ఇక్కడ కోరికలెదు. ఆందోళన లేదు. భయం లేదు. బాధలేదు. ఇంతమందిలోనూ ఇక్కడనేనూ ఒక్కర్తిని. నాకో ప్రత్యేకత ఏముంది? ఈ అభేదత్వాన్ని సమానత్వాన్ని నేను భరించలేను. ఈ నరకం నుంచి బయటపడాలి నేను” అంది తిలోత్తమ. ఇదంతా శాపప్రభావమే అని గ్రహించేడు నారదుడు. “బిడ్డా తిలోత్తమా! త్రిలోకసుందరివైన నీకీ మనోవ్యధ సహజమే. నువ్వే భూలోకంలో ఉంటే..” “నా జన్మకలత అదృష్టం కూడానా నిన్న చిత్రప్రదర్శనలో ఆ కథానాయిక ఓ సామాన్య సుందరయినప్పటికీ అందరి దృష్టీ, అందరి అభిమానం, అందరి సానుభూతి ఆమె పైనే. కష్టాల కాఠిన్యంలో బండబారి కన్నీటి కారుణ్యంలో కరిగి అనందమాధుర్యంతో మధించబడ్డ ఆమెజీవితం ధన్యమైంది. ఆమె తన ప్రియుని గాఢపరిష్వంగం కోసం పొందే పరితాపంలో ఆమె జీవితం చరితార్థమైంది.” అంది కళ్ళు తుడుచుకుంటూ. “పరిష్వంగమంటే గుర్తొచ్చింది. అనుభవం అభిరుచిలేని ఘోటక బ్రహ్మచారిని. పైగా, మతిమరుపు. ఆబాపతులే అనుకుంటాను భూలోకవాసులు స్వర్గవాసులకిమ్మని నాకిచ్చేరు. నీకు నచ్చితే నువ్వే పుచ్చుకో.” అంటూ యిటీవల శతరాత్రోత్సవం జరుపుకుంటున్న కొన్ని మలయాళ చిత్రాలలోని శృంగారసన్నివేశాల తాలూకు స్టిల్సు నారదుడు తిలోత్తమకందించేడు.  6భూలోకయాత్ర తెలుగు చలనచిత్రరంగంలో ఇటీవల విప్లవాత్మకమైన చిత్రాలు తీసి విజయం సాధించిన కీర్తి డైరెక్టర్ కళాధర్ కి దక్కింది. వరప్రసాద్, జయశీల అనే కొత్తజంటతో కళాధర్ పోచంపాడు ప్రాజెక్టు ప్రాంతంలో ఫిల్మ్ షూటింగులో నిమగ్నుడై ఉన్నాడు. ఆసన్నివేశంలో బంజారా గరల్స్ చేత రక్షింపబడిన హీరోయిన తనవైపు చేతులు చాచుకుని పరిగెత్తుకువస్తున్న హీరో చేతుల్లో వాలి మూర్చపోవాలి. చుట్టూ చేరిన బంజారా గరల్స్ ఆనందంలో తప్పట్లు కొడుతూ గంతులేస్తారు. షాట్ బ్రహ్మాండంగా వొచ్చేది కాని. ఆఖరిక్షణంలో “సుధాకర్!” అని కేకవేసి, బంజారాగర్ల్ కేసి చూసిన వరప్రసాద్ కించిత్ పూర్వజన్మ వాసన వేయగానే “స్వర్ణా!” అంటూ హీరోయిన్ చేతుల్లో వాలి మూర్చపోయేడు. డైరెక్టర్ కంగారుగా వెళ్ళి జరిగిందంతా చూసి విని,“ హూయీజ్ దిస్ గర్ల్? వాటీజ్ దిస్ న్యూసెన్స్?” అంటూ బంజారాగర్ల్ వేషంలో ఉన్న తిలోత్తమకేసి కళ్ళురిమి చూసాడు. “ హూయీజ్ దిస్ గర్ల్? వాటీజ్ దిస్ న్యూసెన్స్?” అన్న డైలాగ్ ని సరిగ్గా డైరెక్టర్ స్వరంలోనే రిపీట్ చేసి చిరునవ్వు నవ్వింది. తిలోత్తమ. “ఎవరో యీ మాయలాడి? ఏం మత్తుమందు జల్లిందో? దీనికేసి చూడగానే ఈయన మూర్చపోయాడు” అంది హీరోయిన్. అలాగే అభినయిస్తూ ఆ హీరోయిన్ గొంతునే అనుకరిస్తూ టేప్ రికార్డరు లాగ పలికింది తిలోత్తమ. కళాధర్ కళ్ళు గిర్రున తిరిగాయి. అక్కడ ఉన్న ఉత్తరాది కెమేరామెన్ “తుమ్ కోన్హో? యహాఁ క్యా కామ్ హై? హటో హటో” అంటూ తిలోత్తమని హేడ్ కెమేరాతో గెంటేడు. మళ్లీ అదే స్వరంతో అదే డైలాగ్ చెప్పి అతనిచేతిలో ఉన్న కెమేరాతో అతన్నే గెంటేటప్పటికి పదడుగులదూరంలో వెల్లకింతలా పడ్డాడు. ఇంతలో తేరుకున్న డైరెక్టర్ కళాధర్ తిలోత్తమ ధారణాశక్తికి, ధ్వని అనుకరణకి, అభినయానికి ఆశ్చర్యపడి క్లోజప్ లో చూస్తూ “నువ్వెవరమ్మా? చదువుకున్నదానివా ఉన్నావు. ఇన్ని భాషలు మాటలాడుతున్నావు. ఇట్టే స్వరాలు మారుస్తున్నావు!” అన్నాడు. తిలోత్తమ మళ్ళీ ఆ డైలాగ్ అందుకునేలోగా, ఆమె తండ్రివేషంలో ఉన్న నారదుడు “దొరా! ఇది న బిడ్డే. గింతప్పణ్ణుంచీ ఓరేం మాట్లాడినా గిట్లనే అంటది. భాష సంజాయించుకోదు.” అన్నాడు. తిలోత్తమ తన చేత్తో మూసి ఉంచి. డైరెక్టరు వాళ్ళిద్దర్నీ సాయంత్రం గెస్ట్ హవుస్ కి రమ్మన్నాడు. అక్కడ ఓ టేప్ రికార్డరు పెట్టి ఓ పాట తిలోత్తమకి వినిపింహి అలా పాడగలనా అని అడిగేడు. తక్షణం పాటంతా తు.చ తప్పకుండా అంతకంటే బాగా పాడింది. హీరోయిన్ చేత డ్యాన్స్ చేయించి  లాగే డ్యాన్స్ చెయ్యమన్నాడు. బ్రహ్మాండంగా చేసింది. ఆమెని ఆ బంజారా డ్రస్ తీసేసి సాదా చీర జాకెట్ మేకప్లో రమ్మన్నాడు. వొచ్చింది. చూసేడు. “భళిరా! ఎన్నడు జారె నీ భువికి రంభా రాగిణీ రత్నమేఖలయో..” అనుకున్నాడు.  7 పాపవిమోచనం కట్టుబట్టలతో అవతరించిన తిలోత్తమను కానీ ఖర్చులేకుండా సుధాకర్ గాంధర్వ వివాహం చేసుకున్నాడు. కట్నాలూ, కానుకలూ కులం గోత్రం సాంప్రదాయం అంటూ సుధాకర్ తల్లిదండ్రులూ బంధుమిత్రులూ ఆ పెళ్ళి రద్దు చెయ్యడానికి ప్రాయ్త్నించేరు. నారదుడి సలహామీద ఓ శుభముహూర్తాన యిద్దరూ రిజిస్టర్డ్ మేరేజ్ చేసుకుని అందరినోర్లూ మూయించేడు. కళాధర్ వాళ్ళిద్దర్నీ హీరో హీరోయిన్లుగా బుక్ చేసి రెండు ఫిల్ములు తీసేడు. రెండూ వాళ్ళిద్దర్నీ హీరో హీరోయిన్లుగా బుక్ చేసిరెండుఫిల్ములు తీసేడు. రెందూ బాక్సాఫెసు హిట్లు అయ్యాయి. తర్వాత అరవం, కన్నడం, మళయాళం, హిందీ పిక్చర్స్లో కూడా బుక్ అయ్యేరు. ఆవిధంగా ఇరవై పిక్చర్స్ లో ఏక్ట్ చెయ్యడంతో డబ్బు కుప్పలు తిప్పలుగా వొచ్చిపడింది. కాని, విశ్రాంతి విరామం ఆనందం దూరమయ్యేయి. ప్రొడ్యూసర్లు ఇంకంటేక్స్ వాళ్ళూ. నలుపూ తెలుపూ మంత్రగాళ్ళు భల్లూకాల్లాగ  పట్టుకుని వాళ్ళ మనశ్శాంతిని కబళించేటప్పటికి తిలోత్తమకి ఆ జీవితం మీద విసుగూ విరక్తీ  కలిగేయి. నారదుడి ప్రభోదనలవల్ల సుధాకర్ కూడా ధనార్జనకీర్తి దాహం కంటే సంతృప్తి మనశ్శాంతి ముఖ్యమని గ్రహించేడు. పూర్వజన్మ స్మృతితోపాటు పశ్చాత్తాపంకూడా ఆతని హృదయంలో చోటు చేసుకుంది. కొత్తకాంట్రాక్టులు సంతకం పెట్టడం మానేసి, తర్వాత చూస్తామని వాయిదావేస్తూ కొత్తవాళ్ళకి అవకాశమివ్వమని ప్రభోదిస్తూ కొన్నాళ్ళు కాలం గడిపేరు. తమ ఆస్తిపస్తులన్నీ పేదసాదలను ఉదారంగా దానంచేసి, నారదుడి సలహా సహకారాలతో ఓ మంచిరోజు చూసుకుని ఛార్టర్డ్ ప్లేన్ ఎక్కి  హైజాక్  చేసి సరాసరి త్రిశంకుస్వర్గం చేరి అక్కణ్ణుంచి ప్లేన్ ని క్షేమంగా భూలోకానికి పంపిస్తూ పైలట్ ని సన్మానించి ఆశీర్వదించి వీడ్కోలిచ్చేరు. త్రిశంకుస్వర్గంనుంచి ఇంద్రుడు పంపిన పుష్పకవిమానం మీద స్వర్గం చేరుకున్నారు. ఇదీ సంక్షిప్తంగా ఆ తాళపత్రాలలో ఉన్న పురాణగాధ. ఆవిధంగా నారదుడికీ తిలోత్తమకీ శాపవిమోచనం అయింది. ఈకథ చదివినవారూ విన్నవారూ పాపభారాన్ని తగ్గించుకుంటారనీ, ఈ దివ్యగాధలోని అమరసందేశం వరకట్నాలవల్ల మొగాడు నరకబాధలనుభవిస్తాడని కాబట్టి, ఆ సందేశాన్ని వంటబట్టించుకుని సంస్కారంతో వైవాహికజీవితాన్ని యిహలోకంలో గడిపినవారు స్వర్గలోకప్రాప్తిపొంది తరిస్తారనీ ఆ తాళపత్రాల్లో రాయబడి ఉంది. (‘ఆంధ్రభూమి’ సచిత్రవారపత్రిక, 8-7-72)  

నాగార్జున సాగర్ దిగువ కాలవతవ్వే సమాయంలో దొరికిన తాళపత్రాల్లో ఉన్న గాథ యిది. ఇది ఏకాలం నాటిదీ ఏ మహర్షి వ్రసిందీ అన్న విషయాలు యింకా చరిత్రకరులు యిదమిద్ధమని తేల్చలేదు. వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల్లోనూ యిది లేదు కనుక, దరిమిలా దివ్యదృష్టితో లోకాంతర విశేషాలు చూడగలిగిన ఏ మహర్షో రాసి ఉండాలి. సుదీర్ఘమైన ఈ పురాణగాధను అతి క్లుప్తంగా మనవి చేస్తాను. అది సప్తమస్కందసమన్వితం.

 1         అపరలోక ఆవిర్భావం

కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలమీద, త్రేతాయుగంలో మూడుపాదాలమీద, ద్వాపరయుగంలో రెండు పాదాలమీద, కలియుగంలో ఒంటిపాదం మీద నడుస్తుందని శాస్త్రాల్లో సూచించబడింది. కాని, వర్తమానకాలంలో ధర్మం స్తంభించిపోయింది. దానికి తార్కాణంగా కృతయుగంలో స్వర్గంలో జనాభా అయిదువందలకోట్లు ఉంటే నరకంలో ఏభైకోట్లు ఉండేది. ధర్మ గ్లాని దినదినాభివృద్ధి కావడంతో ప్రస్తుత నరకంలో అయిదువందల నలభయ్యారు కోట్లు ఉంటే స్వర్గంలో నాలుగుకోట్లమంది ఉన్నారు. ఇంచుమించు వాళ్ళందరూ దేవగంధర్వ కిన్నెరకింపురుషాదులే. ఎక్కడో నూటికీ కోటికీ ఒకళ్ళో యిద్దరో స్వర్గంలో ప్రవేశిస్తున్నారు.

            నరకంలో జనాభా యీవిధంగా విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ యమయాతనలు పడే ప్రజానీకంతో బాటు పాలనా యంత్రాగానికి కూడా గాలి, నీరు, వెలుతురూ కరువయ్యాయి. క్షీరసాగరంతో శేషతల్పంమీద యోగనిద్రలో గుర్రెట్టి పడుకున్న విష్ణుమూర్తి దగ్గరకి దేవతలందరూ వెళ్ళి ఆర్తనాదాలతో మేల్కొల్పి ఈ సమస్య కేదైనా పరిష్కార మార్గం శెలవియ్యమని మొరెట్టుకున్నారు. బృహస్పతిని పిలిచి, ఏం చేస్తే బాగుంటుందని విష్ణుమూర్తి అడిగాడు.

            “ప్రభూ..! భూలోకంలో పాపం చెయ్యని వాళ్ళెవ్వరూ ఉండరు. వృత్తి వ్యాపారాల్లో కాని, ఉద్యోగాధికారాల్లో కాని రాజకీయరంగంళో కాని ఏదో విధమైన అవినీతికి, దుర్మార్గానికి, ద్వేషానికి పల్పడని వాళ్ళుండరు. ఖూనీలు, దౌర్జన్యాలు దొంగతనాలు మోసాలు చేసేవాళ్లతోబాటు వీళ్ళకి నరకంలో బాధలు తప్పవు. ఇది యుగయుగాలుగా వొస్తున్నదే..” అన్నాడు బృహస్పతి.

            “ఆరూల్స్ మార్చడానికి వీల్లేదు” అన్నాడు విష్ణుమూర్తి విసుగ్గా,

            “చిత్తం స్వామీ! అది మార్చక్కర్లేదు. కలియుగం ఉత్తరార్థంలో కట్నాలూ, లాంచనాలు అంటూ “పెళ్ళికి స్త్రీలను పీడించడం, పెళ్ళి చేసుకుంటానని దగా చెయ్యడం, పెళ్ళాడి భార్యల్ని హింసపెట్టడం, లాంటి ఘోరపాపాలు చెయ్యడం పురుషులకి పరిపాటయిపోయింది. ఈ బాపతు జనాభా నరకంలో ఏభైశాతం ఉన్నారు. వాళ్ళకొక ప్రత్యేకమైన లోకం సృష్టించి వాళని తగురీతిగా శిక్షించినట్లయితే నరకంలో జనాభా తగ్గుతుంది. మరి స్వామి ఆజ్ఞ” అన్నాడు బృహస్పతి వినయంగ.

            త్రిశంకుస్వర్గం లాంటి అపర భూలోకాన్ని సృష్టించి, అలాంటి మొగాళ్ళకి బుద్ధిచెప్పండి “ అంటూ ఆవలించి మళ్లీ యోగనిద్రలోకి విష్ణుమూర్తి జారుకున్నాడు,

2          పరిణయస్కందం

            “అదిగో మా అమ్మాయి” అనడంతోటే సోఫాలో కూర్చున్న రంగనాథం, సుధాకర్, లత లేచి నిలబడి మేడమెట్లమీద నుంచి దిగుతూ ఠీవిగా బ్లౌజ్ బటన్స్ పెట్టుకుంటూ వొస్తున్న స్వర్ణవైపు దృష్టి మళ్ళించారు. “ఎంతచక్కని అమ్మాయ్!” అనుకున్నారందరూ, క్లోజప్‍లో

            “అతనే మా స్నేహితుడు రంగనాథం, అతను వాళ్ళబ్బాయి సుధాకర్, ఈ అమ్మాయి సుధాకర్ చెల్లెలు లత” అంటూ స్వర్ణ తండ్రి అందరినీ పరిచయం చేసేడు. అందరూ కూర్చున్నారు

            “ఎంతవరకు చదువుకున్నాడబ్బాయి?” అని అడిగింది స్వర్ణ

            “చెప్పు. సిగ్గుపడతావేఁ!” అని విశ్వేశ్వర్రావనడంతో సుధాకర్‍కి సిగ్గు మరింత ముందుకొచ్చి. మరింత తలదించుకున్నాడు.

            “ఏమిటో బావగారూ! ఎంత గ్రాడ్యుయేటయినా మా పాతకాలం సాంప్రదాయం వాడిలో జీర్ణించుకుపోయింది. ఆడవాళ్ళముందు వాడి నోరు పెగల్దు. చచ్చి స్వర్గానున్న మ ఆవిడగారు “ఏరా రంగీ, సుధకి కూడా నీ పోలికే వచ్చింది అనేవారు. ఎంత చదువుకున్నా ఆడవాళ్ళ ముందు వాడికి నోరు పెగల్ద్ఫు, ఇంతెందుకు, ఇన్న్నేళ్ళొచ్చినా ఆడతోడు లేందే ఒక్కడూ సినిమాకెళ్ళలేడు. కూడా మా లత ఉండాల్సిందే” అన్నాడు రంగనాథం.

 “మొగాడికి సిగ్గే సింగారం అన్నారు పెద్దలు” అన్నాడు విశ్వేశ్వర్రావు.

            “ అబ్బాయికి సంగీతం, డాన్సులాంటివేమైనా నేర్పించారా?” అడిగింది స్వర్ణ

            “మీకు తెలియనిదేముంది బవగారూ! మాది ఆడదిక్కులేని సంసారం. ఇంట్లో పనిపాట్లు నేర్పించేను. మా ఆవిడగారు బాగుంటే పిల్లాడి అచ్చటా ముచ్చటా తీర్చేవారు. వరిదారిన వారు వెళ్ళి పోయేరు. లత చేతికందొచ్చే వరకూ..!” అంటూ కంటతడి పెట్టేడు రంగనాథం.

            “ఊరుకో పాపం, మొగాడివైనా శాయశక్తులా సంసారాన్నీడ్చుకొచ్చేవు. అమ్మాయి చేతికందొచ్చిందంటే తల్లికి మించిన ప్రయోజకురాలవుతుంది ఇంకెంతకాలం. ఇంజనీరింగు మూడోయేడు చదువుతుంది కదా!” అన్నాడు విశ్వేశ్వరరావు వోదార్పుగా.

            “బియ్యే పాసయింది కదా! ఏమైనా పై చదువులు చదవాలనుకుంటుందా?” అడిగింది స్వర్ణ.

            “వీడుద్యోగం చెయ్యాలా ఊళ్ళేలాలా! పెళ్ళి చేసి ఓ అమ్మచేతిలో పెట్టేవరకే కదా యీ చదువు?” అన్నాడు రంగనాథం.

            “ఊరికే అడిగిందోయ్ ఇప్పుడిప్పుడే కదా మొగాళ్ళు చదువుకోవడం మనరోజుల్లో మొగాడికి చాకలిపద్దు రాసుకోగలిగితే అదే గొప్ప” అన్నాడు.

            “స్పోర్ట్‍లు, గేమ్సులో కాని ప్రవేశముందా? అని స్వర్ణ సిగ్గుతో తలవొంచుకొని కూర్చున్న సుధాకర్ కేసి చూసి నవ్వుతూ అడిగింది.

            “ఏమిటా మూగనోము? మాటలు కూడా రావనుకుంటారు. జవాబు చెప్పు.” తండ్రి రంగనాథం గదమాయించాడు.

            “ప్రవేశం లేదు అభిరుచుంది రన్నింగ్ కామెంట్రీ వింటాను” అన్నాడు సుధాకర్,

            “ఏవో గేమ్స్ ఆడతాననేవాడు. నేనే వొద్దనేవాడ్ని. ఇప్పుడు రోజులెలా ఉన్నాయో మీకు తెలీందేముందు! పెళ్ళీడొచ్చిన మొగాడు కాలేజీనుంచి యింటికి రావడాఅనిక్ ఇఅరగంటాలస్యమైతే గుండెలు దడదడలాడతాయి. ఎక్కడచూసినా పోకిరీ ముండలి, కాస్త ఎర్రగా బుర్రగా ఉన్న మొగపిల్లాడు వొంటరిగా కనబడితే వెంటపడటం, అల్లరిచెయ్యడం మీకు తెలియంది కాదు., నేనా మొగాడ్ని.. ఎక్కడ ఎలాంటి అల్లర్ల పాలవుతాడో అనీ నేనే ఆట పాటలకీ వెళ్ళనివ్వలేదు.” అని సర్దిచెప్పాడు రంగనాథం.

            స్వర్ణ మంచి ముహూర్తాన సుధాకర్‍కి మూడు ముళ్ళూ వేసింది. స్వర్ణ కారు డ్రైవ్ చేసుకుంటూ పక్కన తనని కూర్చోబెట్టుకు వెడుతుంటే ఆనంద తన్మయత్వంలో ఉండేవాడు సుధాకర్. ఎంతో అన్యోన్య దాంపత్యమనీ మురిసిపోయేరు వియ్యంకులిద్దరూ. ఓసారి మొగాడు స్కూటర్ డ్రైవ్ చెయ్యడం చూసి సుధాకర్ ఆశ్చర్యపోతుంటే “మొగాళ్ళు స్కూటర్ డ్రైవ్ చెయ్యడమే కాదు. నాతో క్లబ్బుకు రా చూద్దువుగాని, భార్యలవెంట వచ్చి పేకాడాతారు. సిగరెట్లు కాలుస్తారు. తాగుతారు” అని స్వర్ణ అంటుంటే “ఛీ పాడు” అన్నాడు సతివ్రతుడైన సుధాకర్. తన చెక్కిలిని సుతారంగా స్వర్ణభుజానికానించి.

            స్వర్ణ ఆప్యాయంగా పక్కకి తలవంచి సిగరెట్ పొగ సుధాకర్ మొహమ్మీదకి ఊదింది. “అబ్బ! ఏం సిగరెట్లు కాల్చడం బాబూ, ఒకటే వాసన” అన్నాడు సుధాకర్. పొగచేత్తో పక్కలికి విసురుతూ, “ఇదే ఆడవాసన” అంది స్వర్ణ, సుధాకర్ నడుంచుట్టూ చెయ్యివేసి తన వైపు లాక్కుంటూ.

            మరోసారి సినిమా పోస్టర్లను గురించి విమర్శిస్తూ “ఛీ! ఈ సినిమాల్లో ఏక్ట్ చేసే మొగాళ్ళకెంత సిగ్గుళేదో వొళ్ళలా ప్రదర్శించడానికి?” అన్న సుధాకర్ బుగ్గ మీద చిటికేస్తూ “సెక్సప్పీలంటే అదే డార్లింగ్..! ఈ పైజమా లాల్చీ తీసేసి వీకట్ బనీనుతోనూ అండర్‍వేర్ తోనూ చెర్లో స్నానం చేసి బయటకొస్తున్నప్పుడు ఫొటో..” అని స్వర్ణంటుంటే “ఛీ ఊరుకోండి” అంటూ సుధాకర్ స్వర్ణనోటిని చేత్తో మూసేడు.

            అందం, ఐశ్వర్యం. ఆరోగ్యం, ఔదార్యాలతో సుధాకర్ స్వర్ణలత ఒకళ్ళనొకళ్ళు తీసిపోని అపురూప అన్యోన్య దాంపత్యం అయితే, అప్పుడప్పుడు క్లబ్బు, పేకాట, తాగుడు సరదాల్లో స్వర్ణ రాత్రిళ్ళు ఇంటికి ఆలస్యంగా వచ్చేది.

            ఓ రోజున మరికాస్త ఆలస్యమైందేమో ఉక్రోషం పట్టలేక సుధాకర్ “రాత్రిళ్ళు మీరొచ్చే వరకూ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ వొంటరిగా ఉండడానికి భయమేసి చస్తున్నానండీ! అంటూ కంటతడి పెట్టేడు.

            “ఛ! ఛ!” భయమెందుకు?” అంటూ బుజ్జగించబోయింది స్వర్ణ.

            “మీకే, మీరలాగే అంటారు. పక్కవాటాలో ఉన్న వసుంధర రాగొచ్చి రోజూ రాత్రిళ్ళు మొగుడ్ని తంతుంది. ఆ ఏదుపులూ, అరుపులూ వినలేక చస్తున్నాను. ఆవిడతో తనింక కాపురం చెయ్యలేనని తనే నుయ్యో గొయ్యో చూసుకుంటానని ప్రభాకరం రోజూ మధ్యాహ్నం మనింటికొచ్చి ఒకటే గోల” అన్నాడు సుధాకర్.

            “వసుంధర తాగడం మానదు. తన్నడం మానదు. ప్రభాకరం చస్తానని బెదిరించడం మానడు. చావడు. ఆవిడ్ని విడిచి పెట్టిపోలేడు. ఇది అంతులేని కథ డాళింగ్! ఇది నూటికి తొంభై ఇళ్ళల్లో జరిగే భాగోతమే. ఈ లోకం తీరే అంత. మనం భయపడి, భాదపడి లాభం లేదు” అని భోదించింది స్వర్ణ.

            “రాత్రిళ్ళు కిటికీ లోంచి నాకేసి అదోలా చూస్తోందండీ ఆవిడ. అసలే తాగొస్తుంది. నేనొక్కడినే ఉంటాను భయంగా ఉంటుందండీ!” అన్నాడు సుధాకర్.

            “ఆవిడేమైనా వెర్రివెర్రి వేషాలేస్తే ఒళ్ళు హూనం చెయ్యమని మన గూర్ఖా వాచ్‍మెన్‍తో చెప్తాను. ఈసారి ఆ వసుంధర వాళ్ళింట్లో మరీ అల్లరి చేస్తే పోలీస్‍స్టేషన్‍కి ఫోన్ చెయ్యి. ఇన్స్ పెక్టర్ సుబ్బలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ మంఅతాయారూ నిమిషాలమీదొస్తారు. వాళ్ళకి కూడా నేను టెలిఫోన్ చేసి చెప్తాను.” అందే కానీ స్వర్ణ తను పెందరాళే ఇంటికొస్తానని హామీ ఇవ్వలేదు. ఇంకా బిక్కమొహం పెట్టుకున్న సుధాకర్ ఏం ప్రోమిస్ చెయ్యమంటాడో అని తటపటాయిస్తూ “ చెప్పడం మర్చిపోయేను. గుడ్ న్యూస్. ‘మొగలోకం’ సంపాదకురాలు వీరనాగమ్మని కల్సుకున్నాను నువ్వు రాసిన నవల గురించి చెప్పాను తప్పకుండా సీరియల్‍గా చేస్తానని చెప్పి పంపింది., నా చేతికియ్యు. రేపురాత్రి క్లబ్‍లో కలుసుకున్నప్పుడు స్వయంగా స్క్రిప్ట్ ఇస్తాను.” అంటూ ఓ కస్సా వేసింది స్వర్ణ. దాంతో సంతోషంతో స్వర్ణ కౌగిలిలో సుధాకర్  మైనంముద్దయిపోయాడు.

 

3          తతః ప్రభావం

            కథ అంతటితో ఎందుకాగిపోలేదంటే హఠాత్తుగా కారేక్సిడెంట్లో స్వర్ణ స్వర్గస్తురాలైంది. ముప్ప్యివేలు కట్నం పోసి మురిసిపోతూ చేసిన పెళ్ళి మూణ్ణాళ్ళ ముచ్చట అయిందని రంగనాథం భోరున ఏడ్చాడు. సుధాకర్ మూడు రోజులు కోమాలో ఉన్నాడు. ఆ తర్వాత కూడా మామూలు మనిషవ్వలేదు. కాస్త తేరుకున్నాక, ఈరోజుల్లో మగాడురెండోపెళ్ళి చేసుకోవడం అక్కడా అక్కడా వింటున్నాం. చిన్నవయస్సు అపురూపమైన అందగాడు. పిల్లాజల్లా కల్గలేదు. అంచేత అవసరమైతే మరో ఇంతకట్నం పోసయినా సరే, రెండో పెళ్ళి చెయ్యడానికి రంగనాథం శతవిధాలా ప్రయత్నించేడు. పోనీ, ఉద్యోగం చేసుకోమన్నాడు. ససేమిరా దేనికీ ఒప్పుకోలేదు. నా స్వర్గాన్ని నాకు భగవంతుడు దూరం చేసేడు. బొందితోటే స్వర్గానికెళ్ళి తను స్వర్ణతో అక్కడా కాపురం చేస్తానని సుధాకర్ పట్టుదలతో తపస్సు ప్రారంభించేడు.

            రోజులు గడుస్తున్న కొద్దీ అతని తపోదీక్ష పెరిగిపోసాగింది. కొన్నాళ్ళకి ఆ కఠోరతపస్సు ధాటికి తట్టుకోలేక చతుర్దశ భువనాలూ కంపించేయి. అప్పటికి సుధాకర్ తొమ్మిది టన్నుల తపోఫలాన్ని సంపాదించాడు. పదిటన్నులు పూర్తయితే ఇంద్రపదవి లభిస్తుంది. పదవిపోవడం ఖాయం అని తెలిసిన ముఖ్యమంత్రిలాగా భయభ్రాంతుడై ఇంద్రుడు ఏదో విధంగా చక్రం అడ్డువెయ్యమని నారదుడ్ని ఆశ్రయించాడు.

            నారదుడు సినిమా ప్రొడ్యూసర్ వేషంలో వచ్చి “నాయనా! ఇంతటి ఆత్మాహుతి నీకు తగదు. మళ్ళీ పెళ్ళాడనన్నవు. ఉద్యోగం వొద్దన్నావు. బొందితో స్వర్గానికెళ్ళాలంటూ చిక్కి శల్యమవుతున్నావు. మీ ఆదర్శదాంపత్యాన్నే కథా వస్తువుగా ఒక ఫిలిం తీద్దామని నినమ్దులో నటించమందామని గంపెడాశతో వొచ్చేను” అన్నాడు.

            తపః ప్రభావంతో అతని నిజరూపం తెల్సుకుని “నారదమునీంద్రా! మీరు సినిమా తీస్తానంటే వేషం వెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో నటించడానికి మీకు చేతనయితే నా ఆరాధ్యదేవత స్వర్ణని తీసుకు రండి. లేదా, నన్నీ విధంగా మోసం చేయడానికి వొచ్చిన ఈ వేషాన్ని సార్థకం చేసుకుంటూ భూలోకంలో మీరు సినిమాల్లో నటించుగాక! అంటూ శపించాడు. సుధాకర్ ఆ శపించడంలో తన తపశ్శక్తిని కొంత కోల్పోతూ,

            నారదుడు తంబురా చంకనెట్టుకొని దేవేంద్రుడి దగ్గరకెళ్ళి “పుణ్యానికెడితే పాపం ఎదురైనట్టు నీకుపకారం చెయ్యబోతే నాకు శాపం దెబ్బ తగిలింగి.” అంటూ వాపోయాడు.

            “ఈశ్వరాజ్ఞ! ఏం జరిగినా లోకకళ్యాణం కోసమే కదా! మొత్తం ఎమెద తపః ప్రభావం కొంత తగ్గింది. నాకు ఊపిరాడుతుంది.

            “స్వర్ణరూపం తప్ప అన్య సుందరీమణులెవ్వరూ ఆకర్షించలేదు. సుధాకరుడికి తపోభంగం కలగాలంటే స్వర్ణ అపరభూలోకం లోఇ అవరోహించాలి.” అన్నాడు నారదుడు.

            “అదెలా సాధ్యం? స్వర్గలోకంలో ఉన్న స్వర్ణ ఆలోకంలో కెళ్ళమంటే వెడుతుందా? ఆ బంధాలు ఆ జ్ఞాపకాలు ఆ కాయం కాలిపోవడంతో సరికదా! తొల్లి అభిమన్యుడూ స్వర్గస్తుడయ్యేక తండ్రి అయిన అర్జునుణ్ణే ఆనవాలు పట్టలేకపోయాడు కదా?” అన్నాడు ఇంద్రుడు. వజ్రాయుధంతో గోళ్ళు కత్తిరించుకుంటూ.

            “స్వర్ణ కాకపోతే స్వర్ణరూపంలో మరెవరైనా.. నారాయణ నారాయణ !” అంటూ నారదుడు గగనమార్గం పట్టేడు.

4          ఇంద్రవైభవం

            అది స్వర్గం. ఇంద్రుడు శచీదేవి తమ ముప్పైరెండు లక్షల నలభయ్యారువేల ఏభయ్యో వివాహ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. దీపావళి రాత్రి ఏబిడ్స్ రోడ్ లాగ రంగు రంగు దీపకాంతులతో స్వర్గసీమంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అంతటా ఆనందం తాండవిస్తోంది. నాటి సాయంత్రం మహేంద్రభవనంలోని వినోదాలయంలో తరగతి వారీగా కూర్చున్న దేవ గంధర్వ కిన్నెర కింపురుషులు ఆకాశవీధిలో ప్రదర్శింపబడుటకు ఏర్పాటు చేయబడ్డ చలనచిత్రం దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు.

            మరోక్షణంలో ప్రదర్శన ప్రారంభమవుతుందనగా నారద మహాముని భూలోక సంచారం పూర్తి చేసుకొని, సభాసదులకెదురుగా ఆకాశమార్గాన అరుగుదెంచి ఆ పుణ్యదంపతుల మ్రోలనిలిచి తన శుభాకాంక్షలు అందజేశాడు. తర్వాత సంచీలోంచి ఒక్కొక్క పేకట్టే తీసి దేవేంద్రుడి హస్తములందుతుండగా “ఏమిటి మహానుభావా, ఈ అపురూప కానుకలు?” అడిగేడు దేవేంద్రుడు.

            “ఊరకరారు మహాత్ములు! మళ్ళీ ఏదో చిచ్చు రగిల్చి పని కల్పించడానికొచ్చుంటారు” అంది శచీదేవి.

            “నారాయణ్ణారాయణ! ఈ శుభసమయంలో భూలోకవాసులు భక్తితో పంఇన కానుకలు సమర్పించడానికి నేనొస్తే ఇదా అతిథి సత్కారం? ఇది వీరశైవులు గ్రోళే “శివ్వాస్ రీగల్”, ఇది వైష్ణవులు తమ అభినందన చిహ్నంగా పంపిన ‘రాయల్ సెల్యూట్’ ఈవిస్కీలనబడునని సోమరస సదృసములైన మరుకలశములు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు. వీటిని సాంకేతికముగ వెలసిన 555 సిగరెట్లు అనబడే ఈ పేకట్టు ధూమసుధాసాధనం. భూలోక వాసులు తమ వైజ్ఞాన ప్రగతి, చంద్రమండల యాత్ర, చలనచిత్ర సంచలనవైభవం తెలియజేయు ఈ మూడు ఫిల్మురీళ్ళు ఈనాటి కార్యక్రమానికి ఉపయోగపడతాయని పంపేరు” అన్నాడు నారదుడు సంచీ భుజాన వేసుకుంటూ.

            నారద మహాముని సముచితాసనమున ఉపనిష్టుడైన పిదప ఇంద్రుని సంకల్పానుసారం గగనవీధుల మేఘములు తొలగిపోయి చతుర్భుజాకారంలో రంగురంగుల నింగి తొంగిచూసింది. ఆ రంగోళీ ఆచ్చాదం అదృశ్యం కాగానే హిమగిరి సానువులు ప్రత్యక్షమయ్యేయి. తర్వాత ప్రరాఖ్యుడు, వరూధిని తాలూకు ప్రణయగాధ కన్నులకు, వీనులకు విందు కలిగించింది. ఆ తర్వాత నారద మునీంద్రుడు తెచ్చిన ఫిల్ము రీళ్ళు కూడా ఇంద్రుని సంకల్ప శక్తిచేత ప్రదర్శింపబడ్డాయి. ‘ఎంతఘాటుప్రేమ! ఎంతటి ఘనవిజయం! ఎంత ఘోరకలి’ అంటూ ఆ ఫిల్ములను గురించి ఎవరికి తోచిన విమర్శలు వాళ్ళు చేస్తూ లేచేరు.

            తిలోత్తమ మాత్రం కూర్చున్న చోటు నుంచి లేవకపోవడం చూసి, నిద్ర పోతుందేమోనని మేనక, ఊర్వశి చెరో జబ్బా పట్టుకుని లేవదీయబోయి, ఆమె ముఖంలో ఆనందరేఖలు గమనించి పారవశ్యంలో మూర్చ పోయిందని గ్రహించి ఎందుకైనా మంచిదని ధన్వంత్రిని తీసుకురమ్మని ఓ గంధర్వుడ్ని పంపారు.

 

 5         శాపవృత్తాంతం

            “ముని శాపం అనుభవించక తప్పదు” అని తలదించుకున్నాడు దేవేంద్రుడు

            “అంతా ఈశ్వర సంకల్పం” అన్నాడు నారదుడు.

            రంభగంభీరవదనయై “ఆముని ఎవరు? ఆ శాపంబెట్టిది” అని అడిగింది

            నారదుడు ఆమెను నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించి, తన అరచేతిలో రంభకు ఆ శాపవృత్తాంత దృశ్యములను చూపెట్టేడు.

            ఆమె చూసిన గాధ ఇది__

            ఒకప్పుడు అపరభూలోకంలో సుధాకరుడను మహర్షి స్వర్గాధిపతి అయ్యే ప్రమాదం గుర్తించి నారదముని సూచన ననుసరించి ఆ మహర్షి తపస్సును ధ్వంసం చెయ్యమని ఆవిద్యలో అప్సరసలందరిలోనూ ఆరితేరిన తిలోత్తమను దేవేంద్రుడు నియమించేడు. సుధాకరుని ప్రియసఖి అయిన స్వర్ణరూపం దాల్చి అతని తపశ్శక్తికి మెచ్చి మృత్యుదేవత కరుణించి తనకి పునర్జీవనం ప్రసాదించిందని చెప్పి అతనితో కాపురం పెట్టింది. తపోభంగోద్యమం విజయోన్ముఖమైంది. అతని తపశ్శక్తి రెండున్నర కిలోగ్రాములకి దిగజారిపోయింది. పైగా మృత్యువు ఆసన్నమైంది విధిబలీయం సరిగ్గా ఆ సమయానికి సుధాకర్‍కి మత్తు వొదిలి తిలోత్తమంటే మొహమ్మొత్తి ఆమె నిజస్వరూపం గ్రహించి “ఓసీ మాయావీ! నీ మోహపాశంతో నా కళ్ళుకప్పి నన్ను తపోభ్రష్టుడ్ని చేసినందుకు ప్రతిఫలంగా నువ్వు మోహావేశంలో భూలోకంలో..” అని శాప వచనము పూర్తి కాకుండానే తపశ్శక్తితోపాటు ఆయుర్దాయాన్ని కూడా కోల్పోయేడు.

            ‘కుయ్యో మొర్రో’ అంటూ తిలోత్తమ ఇంద్రుడిదగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. కాలనిర్ణయం చెయ్యకుండా శాపాఘాయిత్యం చేసిన మునీశ్వరుణ్ణెవణ్ణీ ఇంత వరకూ తన సర్వీసులో చూడలేదని మనంబున చింతించుచూ ఇంద్రుడు__

            “మరేమీ ఫర్వాలేదు. భూలోకంలో కొన్నాళ్ళుండి మళ్ళీ తిరిగొచ్చెయొచ్చు పఒగా నారదుడికి కూడా ఈశాపంలో వాటా ఉంది. అంచేత నారదుడు నీకు తోడుగా వస్తాడు” అన్నాడు.

            “కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు? అడిగింది తిలోత్తమ.

            “ఆముని మనస్సులో ఎన్నాళ్ళుందో అన్నాళ్ళు, భూలోకవాసులు అల్పాయుష్కులు. ఏపదమూడేళ్ళో పధ్నాలుగేళ్ళో కంటే వాళ్ళకి నోరు రాదు. అది మనకాలమానంలో కొన్ని ఘడియలు” అని ఇంద్రుడు ధైర్యం చెప్పేడు.

            “భూలోకులు తమో రజో గుణపీడితులు. కామాంధులు..”

            భయపడకు. నీ అమృతత్వానికి నిత్యనూతన యౌవ్వన కన్యాత్వానికి ప్రమాదము రాకుండా అదృశ్యము దుర్భేద్యము అయిన అద్భుత కవచాన్ని ప్రసాదిస్తాను” అని ఇంద్రుడు హామీ ఇచ్చేడు.

            “కాలకర్మ కారణ కర్తవ్యముల ననుసరించి ఆ శాపఫలం అనుభవించవల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ శాపప్రభావం వల్లణే తిలోత్తమలో ఇటువంటి చిత్తచాంచల్యం కలిగింది” అని చెప్పి నారదుడు  తన అరచెయ్యి తుడిచేసుకున్నాడు.

            మర్నాటి ఉదయం నవరత్న ఖచిత స్ఫటిక శిలపై కూర్చుని పాల సముద్రంలో కాళ్ళు పెట్టి అలలతలలపై తేలియాడు పాలనురగను పాదములతో సొగస్గా, గాలిలోకి చిమ్ముతూ ఆలోచనా నిమగ్నురాలైన తిలోత్తమ, నారాయణనామము వినగానే వచ్చినవాడు నారదుడని గ్రహించి, అతనివైపు తిరగకుండానే నమస్కరించి “నిజంగా భూలోకవాసులలో అన్నిరకాల భోగభాగ్యాలూ వివేక విజ్ఞానాలూ అందచందాలూ ఉన్నాయా?” అని అడిగింది.

            “వాటితో పాటు కష్టం, నష్టం, దుఃఖం, దారిద్ర్యం, మరణం కూడా ఉంటాయి.” అన్నాడు నారదుడు.

            “అవిలేకనే ఇక్కడ జీవితం పేలవంగా ఉంది. ఇక్కడ అందరికీ ఏం కావలిస్తే అవి సంకల్ప మాత్రంచేత లభిస్తాయి. అందరూ  ఆనందంగా ఉంటారు. ఇక్కడ కోరికలెదు. ఆందోళన లేదు. భయం లేదు. బాధలేదు. ఇంతమందిలోనూ ఇక్కడనేనూ ఒక్కర్తిని. నాకో ప్రత్యేకత ఏముంది? ఈ అభేదత్వాన్ని సమానత్వాన్ని నేను భరించలేను. ఈ నరకం నుంచి బయటపడాలి నేను” అంది తిలోత్తమ. ఇదంతా శాపప్రభావమే అని గ్రహించేడు నారదుడు.

            “బిడ్డా తిలోత్తమా! త్రిలోకసుందరివైన నీకీ మనోవ్యధ సహజమే. నువ్వే భూలోకంలో ఉంటే..”

            “నా జన్మకలత అదృష్టం కూడానా నిన్న చిత్రప్రదర్శనలో ఆ కథానాయిక ఓ సామాన్య సుందరయినప్పటికీ అందరి దృష్టీ, అందరి అభిమానం, అందరి సానుభూతి ఆమె పైనే. కష్టాల కాఠిన్యంలో బండబారి కన్నీటి కారుణ్యంలో కరిగి అనందమాధుర్యంతో మధించబడ్డ ఆమెజీవితం ధన్యమైంది. ఆమె తన ప్రియుని గాఢపరిష్వంగం కోసం పొందే పరితాపంలో ఆమె జీవితం చరితార్థమైంది.” అంది కళ్ళు తుడుచుకుంటూ.

            “పరిష్వంగమంటే గుర్తొచ్చింది. అనుభవం అభిరుచిలేని ఘోటక బ్రహ్మచారిని. పైగా, మతిమరుపు. ఆబాపతులే అనుకుంటాను భూలోకవాసులు స్వర్గవాసులకిమ్మని నాకిచ్చేరు. నీకు నచ్చితే నువ్వే పుచ్చుకో.” అంటూ యిటీవల శతరాత్రోత్సవం జరుపుకుంటున్న కొన్ని మలయాళ చిత్రాలలోని శృంగారసన్నివేశాల తాలూకు స్టిల్సు నారదుడు తిలోత్తమకందించేడు.

 6         భూలోకయాత్ర

            తెలుగు చలనచిత్రరంగంలో ఇటీవల విప్లవాత్మకమైన చిత్రాలు తీసి విజయం సాధించిన కీర్తి డైరెక్టర్ కళాధర్ కి దక్కింది. వరప్రసాద్, జయశీల అనే కొత్తజంటతో కళాధర్ పోచంపాడు ప్రాజెక్టు ప్రాంతంలో ఫిల్మ్ షూటింగులో నిమగ్నుడై ఉన్నాడు. ఆసన్నివేశంలో బంజారా గరల్స్ చేత రక్షింపబడిన హీరోయిన తనవైపు చేతులు చాచుకుని పరిగెత్తుకువస్తున్న హీరో చేతుల్లో వాలి మూర్చపోవాలి. చుట్టూ చేరిన బంజారా గరల్స్ ఆనందంలో తప్పట్లు కొడుతూ గంతులేస్తారు. షాట్ బ్రహ్మాండంగా వొచ్చేది కాని. ఆఖరిక్షణంలో “సుధాకర్!” అని కేకవేసి, బంజారాగర్ల్ కేసి చూసిన వరప్రసాద్ కించిత్ పూర్వజన్మ వాసన వేయగానే “స్వర్ణా!” అంటూ హీరోయిన్ చేతుల్లో వాలి మూర్చపోయేడు.

            డైరెక్టర్ కంగారుగా వెళ్ళి జరిగిందంతా చూసి విని,“ హూయీజ్ దిస్ గర్ల్? వాటీజ్ దిస్ న్యూసెన్స్?” అంటూ బంజారాగర్ల్ వేషంలో ఉన్న తిలోత్తమకేసి కళ్ళురిమి చూసాడు. “ హూయీజ్ దిస్ గర్ల్? వాటీజ్ దిస్ న్యూసెన్స్?” అన్న డైలాగ్ ని సరిగ్గా డైరెక్టర్ స్వరంలోనే రిపీట్ చేసి చిరునవ్వు నవ్వింది. తిలోత్తమ. “ఎవరో యీ మాయలాడి? ఏం మత్తుమందు జల్లిందో? దీనికేసి చూడగానే ఈయన మూర్చపోయాడు” అంది హీరోయిన్.

            అలాగే అభినయిస్తూ ఆ హీరోయిన్ గొంతునే అనుకరిస్తూ టేప్ రికార్డరు లాగ పలికింది తిలోత్తమ. కళాధర్ కళ్ళు గిర్రున తిరిగాయి. అక్కడ ఉన్న ఉత్తరాది కెమేరామెన్ “తుమ్ కోన్‍హో? యహాఁ క్యా కామ్ హై? హటో హటో” అంటూ తిలోత్తమని హేడ్ కెమేరాతో గెంటేడు. మళ్లీ అదే స్వరంతో అదే డైలాగ్ చెప్పి అతనిచేతిలో ఉన్న కెమేరాతో అతన్నే గెంటేటప్పటికి పదడుగులదూరంలో వెల్లకింతలా పడ్డాడు.

            ఇంతలో తేరుకున్న డైరెక్టర్ కళాధర్ తిలోత్తమ ధారణాశక్తికి, ధ్వని అనుకరణకి, అభినయానికి ఆశ్చర్యపడి క్లోజప్ లో చూస్తూ “నువ్వెవరమ్మా? చదువుకున్నదానివా ఉన్నావు. ఇన్ని భాషలు మాటలాడుతున్నావు. ఇట్టే స్వరాలు మారుస్తున్నావు!” అన్నాడు. తిలోత్తమ మళ్ళీ ఆ డైలాగ్ అందుకునేలోగా, ఆమె తండ్రివేషంలో ఉన్న నారదుడు “దొరా! ఇది న బిడ్డే. గింతప్పణ్ణుంచీ ఓరేం మాట్లాడినా గిట్లనే అంటది. భాష సంజాయించుకోదు.” అన్నాడు. తిలోత్తమ తన చేత్తో మూసి ఉంచి.

            డైరెక్టరు వాళ్ళిద్దర్నీ సాయంత్రం గెస్ట్ హవుస్ కి రమ్మన్నాడు. అక్కడ ఓ టేప్ రికార్డరు పెట్టి ఓ పాట తిలోత్తమకి వినిపింహి అలా పాడగలనా అని అడిగేడు. తక్షణం పాటంతా తు.చ తప్పకుండా అంతకంటే బాగా పాడింది. హీరోయిన్ చేత డ్యాన్స్ చేయించి  లాగే డ్యాన్స్ చెయ్యమన్నాడు. బ్రహ్మాండంగా చేసింది. ఆమెని ఆ బంజారా డ్రస్ తీసేసి సాదా చీర జాకెట్ మేకప్‍లో రమ్మన్నాడు. వొచ్చింది. చూసేడు. “భళిరా! ఎన్నడు జారె నీ భువికి రంభా రాగిణీ రత్నమేఖలయో..” అనుకున్నాడు.

 7         పాపవిమోచనం

            కట్టుబట్టలతో అవతరించిన తిలోత్తమను కానీ ఖర్చులేకుండా సుధాకర్ గాంధర్వ వివాహం చేసుకున్నాడు. కట్నాలూ, కానుకలూ కులం గోత్రం సాంప్రదాయం అంటూ సుధాకర్ తల్లిదండ్రులూ బంధుమిత్రులూ ఆ పెళ్ళి రద్దు చెయ్యడానికి ప్రాయ్త్నించేరు. నారదుడి సలహామీద ఓ శుభముహూర్తాన యిద్దరూ రిజిస్టర్డ్ మేరేజ్ చేసుకుని అందరినోర్లూ మూయించేడు. కళాధర్ వాళ్ళిద్దర్నీ హీరో హీరోయిన్లుగా బుక్ చేసి రెండు ఫిల్ములు తీసేడు. రెండూ వాళ్ళిద్దర్నీ హీరో హీరోయిన్లుగా బుక్ చేసిరెండుఫిల్ములు తీసేడు. రెందూ బాక్సాఫెసు హిట్‍లు అయ్యాయి. తర్వాత అరవం, కన్నడం, మళయాళం, హిందీ పిక్చర్స్‍లో కూడా బుక్ అయ్యేరు. ఆవిధంగా ఇరవై పిక్చర్స్ లో ఏక్ట్ చెయ్యడంతో డబ్బు కుప్పలు తిప్పలుగా వొచ్చిపడింది.

            కాని, విశ్రాంతి విరామం ఆనందం దూరమయ్యేయి. ప్రొడ్యూసర్లు ఇంకంటేక్స్ వాళ్ళూ. నలుపూ తెలుపూ మంత్రగాళ్ళు భల్లూకాల్లాగ  పట్టుకుని వాళ్ళ మనశ్శాంతిని కబళించేటప్పటికి తిలోత్తమకి ఆ జీవితం మీద విసుగూ విరక్తీ  కలిగేయి. నారదుడి ప్రభోదనలవల్ల సుధాకర్ కూడా ధనార్జనకీర్తి దాహం కంటే సంతృప్తి మనశ్శాంతి ముఖ్యమని గ్రహించేడు. పూర్వజన్మ స్మృతితోపాటు పశ్చాత్తాపంకూడా ఆతని హృదయంలో చోటు చేసుకుంది.

            కొత్తకాంట్రాక్టులు సంతకం పెట్టడం మానేసి, తర్వాత చూస్తామని వాయిదావేస్తూ కొత్తవాళ్ళకి అవకాశమివ్వమని ప్రభోదిస్తూ కొన్నాళ్ళు కాలం గడిపేరు. తమ ఆస్తిపస్తులన్నీ పేదసాదలను ఉదారంగా దానంచేసి, నారదుడి సలహా సహకారాలతో ఓ మంచిరోజు చూసుకుని ఛార్టర్డ్ ప్లేన్ ఎక్కి  హైజాక్  చేసి సరాసరి త్రిశంకుస్వర్గం చేరి అక్కణ్ణుంచి ప్లేన్ ని క్షేమంగా భూలోకానికి పంపిస్తూ పైలట్ ని సన్మానించి ఆశీర్వదించి వీడ్కోలిచ్చేరు. త్రిశంకుస్వర్గంనుంచి ఇంద్రుడు పంపిన పుష్పకవిమానం మీద స్వర్గం చేరుకున్నారు.

            ఇదీ సంక్షిప్తంగా ఆ తాళపత్రాలలో ఉన్న పురాణగాధ. ఆవిధంగా నారదుడికీ తిలోత్తమకీ శాపవిమోచనం అయింది. ఈకథ చదివినవారూ విన్నవారూ పాపభారాన్ని తగ్గించుకుంటారనీ, ఈ దివ్యగాధలోని అమరసందేశం వరకట్నాలవల్ల మొగాడు నరకబాధలనుభవిస్తాడని కాబట్టి, ఆ సందేశాన్ని వంటబట్టించుకుని సంస్కారంతో వైవాహికజీవితాన్ని యిహలోకంలో గడిపినవారు స్వర్గలోకప్రాప్తిపొంది తరిస్తారనీ ఆ తాళపత్రాల్లో రాయబడి ఉంది.

            (‘ఆంధ్రభూమి’ సచిత్రవారపత్రిక, 8-7-72)

No comments:

Post a Comment

Pages