శ్రీథరమాధురి - 147 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 147

Share This

                                                             శ్రీథరమాధురి - 147

                               (పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు) 



ఆమె అమాయకురాలు. ఆమె ఒక ఆలయ పూజారి వద్దకు వెళ్ళింది. అతడు బహుశా మిడిమిడి జ్ఞానం కలవాడు కావచ్చు. ఆమె ఇలా పఠించింది.
 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్!
' 
ఆమె అతడి ముందు మహాగణపతిని ప్రార్థించింది. అతడప్పుడు ఇలా అన్నాడు, 'ఇది గణపతి మంత్రం కాదు, ఇందులో 'విష్ణు' అన్న పదం‌ ఉంది. కాబట్టి చదివేటప్పుడు మనసులో విష్ణువును ఉంచుకోవాలి.'
 
ఆమె గందరగోళానికి లోనయ్యింది.
 
ఇప్పుడు 'విష్ణు' అన్న పదాన్ని గురించి విశ్లేషిద్దాము.
 
విష్ణు లేక విష్ణుం అన్న పదానికి 'సర్వవ్యాపి' అని అర్థం. ఆయన అన్ని చోట్లా అవతరిస్తారు. 
మీరు ఆయనను అన్ని చోట్లా చూడవచ్చు. ఆయన చెట్టు కింద కూర్చుని ఉంటారు, ఇంట్లో ఉంటారు, ఆఫీస్ లో ఉంటారు, వీధి మూల ఉంటారు, కొలను వద్ద ఉంటారు, సముద్రతీరం వద్ద ఉంటారు, అడవిలో ఉంటారు, ఆయన అన్నిచోట్లా ఉంటారు. దైవం అన్నిట్లోనూ, అన్ని చోట్లా ఉంటారు. అయినా తెలుపు రంగు దుస్తులు ధరించి తెల్లని వర్ణంతో నాలుగు చేతులతో ప్రసన్నమైన వదనంతో ఉంటారు. ఈ ప్రార్ధన ద్వారా, ఆటంకాలు అనే రూపంలో కూడా ఉన్న ఆ దైవానికి నా సాష్టాంగ ప్రణామాలు.

తెలుపు రంగు స్వచ్ఛతకు సంకేతం, నాలుగు చేతులు అయినా ఏ ఇతర ప్రాణి కన్నా కూడా చాలా శక్తివంతమైన వారని సూచిస్తాయి. ఆయన ముఖం ఎల్లప్పుడూ ప్రసన్నంగా, చిరునవ్వుతో కూడుకుని ఉంటుంది. ఇది ఆయన పూర్తి ఉత్సాహంతో, ప్రేమతో కూడుకుని ఉంటారని సూచిస్తుంది. ఆనందంతో ప్రసన్న శక్తితో కూడుకున్న ముఖము ఎక్కువగా విశ్వ చైతన్యాన్ని సూచిస్తుంది. మీరు గణపతి ని ఏ రూపంలో ఆరాధించినా, లేక విష్ణువును ఈ రూపంలో ఆరాధించినా కూడా అది ఒకటే. కానీ 'విష్ణు' అన్న పదం, దైవం ఒక చిన్న అణువులోనూ, లేక పెద్ద స్తంభం లోనూ, లేక అన్నిటా అంతటా వ్యాపించి ఉన్నారన్న అంశాన్ని తెలుపుతుంది.
 
ఇప్పుడు నమ్మకంతో ఆమె గణపతిని ప్రార్ధించి నప్పుడు పూజారి తాను సరైనదని భావించిన విధంగా ఆమెను కూడా చెయ్యమంటూ, నియంత్రించాలని చూస్తున్నాడు. ఈ రకమైన నియంత్రణ ప్రమాదకరమైనది ఎందుకంటే అది ఒకరి నమ్మకంలో లేక నమ్మకాల వ్యవస్థలో జోక్యం కల్పించుకుంటుంది‌. ఇది తీవ్రంగా ఖండించిన దగ్గ అంశం.
ఋగ్వేదం ఇలా అంటుంది - 'ఏకం సత్ విప్రా బహుధా వదంతి.'
 సత్యం ఏది ఒకటే కానీ దానిని అనేకమంది అనేక రకాలుగా పిలుస్తారు.

****
శ్రీ మహాగణాధిపతి రూపంలో ఉన్న దైవాన్ని ఆటంకాలకు అధిదేవతగా కొలుస్తారు.ఆయనే ఆటంకం కనుక, ఒకవేళ ఆయనను కొలిచినట్లయితే ఆయన ఆటంకాలను కలుగజెయ్యరు. దైవం శక్తివంతమైన వారు అన్నదే సత్యం. ఆయన ఒకవైపు మీకు ఒక పనిని ఇస్తారు, మరొకవైపు అది జరగకుండా ఆటంకాలను ఇస్తారు. ఆయన ఒకవైపు వరాలు ఇస్తారు, మరొకవైపు శిక్షిస్తారు ఎందుకంటే ఆయన పరిపూర్ణులు. ఆయన ఒక గొప్ప మంచిని చేయటానికే రెండు పాత్రలను పోషించినా, మనుషులుగా మనం ఆయన ప్రణాళికలను అర్థం చేసుకోలేము. అందుకే మనకు అంతకుముందు దయతో ఇవ్వబడ్డ పనులకు ఆటంకం కలిగించవద్దని, మనం ఆయనను ప్రార్ధిస్తాము.
 
దైవమే మనను ఆ పనితో దీవించారు కదా, ఆయనే అది సరిగ్గా పూర్తి అయ్యేలా చూస్తారు, అన్న భావనతో మనం ఏ ప్రయత్నం చేయకుండా ఉండకూడదు.  కాబట్టి పని చేయాలన్న కోరిక ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యరూపం దాల్చాలి. అందుకే ఆయన శ్రీ మహాగణపతి గా వెలసిన శుభకరమైన వినాయకచవితి రోజున మనం ఆయనను ప్రార్దిస్తాము.
  
భగవాన్ శ్రీ మహాగణపతి మహారాజ్ కీ జై!


*****

గణపతి పూజ...

మామూలుగా ఆ రోజుల్లో పొలాల్లో నుంచి మట్టిని తీసుకుని, గణపతిని కుటుంబ సభ్యులంతా కలిసి స్వయంగా తమ చేతులతోనే తయారు చేసేవారు. ఈ గణపతిని
 3/5/7/9/11 రోజులపాటు ఆరాధించి, ఆ తరువాత చివరి రోజున ఒక బావిలోగానీ లేక చెరువులోగానీ నదిలోగానీ వదిలి వేసేవారు.

మొట్టమొదట పార్వతీదేవి గణపతిని మట్టితో చేసింది. ఆ మట్టికే పార్వతి ప్రాణం పోసి, గణపతి అని పేరు పెట్టింది. నైనా శివపార్వతులకు స్వాభావికంగా జన్మించిన వారు కాదు. బహుశా హిందూ మతంలో
ఒకరికి బిడ్డ, జన్యుపరంగానే జన్మించవలసిన అవసరం లేదని సూచించాలని భావించి ఉండవచ్చు. దీనినుంచి దత్తత తీసుకోవడం అన్న సిద్ధాంతం వచ్చింది. కాబట్టి ఆ రోజుల్లో గణపతి నే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ లేక సిమెంట్ తో కానీ లేక ఏ ఇతర నిర్మాణ సామాగ్రి తో కానీ చేసే ఆచారం లేదు.

తను స్నానం చేస్తున్నప్పుడు కావలి కాయడానికి పార్వతి గణపతి ని సృష్టించింది కనుక, గణపతిని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు.
శివుడు ఆమెను చూసేందుకు రాగా గణపతి శివుడికే ఆటంకం కలిగించాడు.
కాబట్టి గణపతే ఆటంకము, విఘ్నము. అందుకే ఆయనను విఘ్నాలను అధి దేవత  అని, విఘ్నేశ్వరుడు అని అంటారు. హిందూ మతంలో మనం ఆటంకాలను తొలగించుకోవడానికి ఈ విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తాము.
 కాబట్టి ఆనవాయితీ ఏమిటంటే, మట్టి వినాయకుడిని
 3/5/7/9/11 రోజులపాటు ఆరాధించి నిమజ్జనం చేయాలి. ఇక్కడ దాగిఉన్న సిద్ధాంతం ఏమిటంటే, ఆటంకమే గణపతి కనుక, మట్టి రూపంలో ఉన్న ఆటంకాన్ని పూజించి, దానిని మంచినీటిలో కరిగించడం. కాబట్టి బట్టి మంచి నీటిలో కరిగిపోయినప్పుడు, పూజ చేసిన వారి ఆటంకాలు అన్నీ కూడా దానితోపాటే కరిగిపోతాయని ఒక నమ్మకం.

ఇప్పుడందరూ గణపతిని ప్లాస్టర్-ఆఫ్-పారిస్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రి తో తయారు చేస్తున్నారు. వారు 3/5/7/9/11 రోజులపాటు ఆరాధించి, ఆ తర్వాత హుస్సేన్ సాగర్ వంటి కలుషిత జలాలలో లేక ఉప్పు తో కూడుకున్న సముద్రజలాల్లో ఆయనను విసిరి వేస్తున్నారు.
 
అనేక వేలమంది నమ్మకానికి సంబంధించిన అంశం కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితి పై నేను ఏమీ వ్యాఖ్యానించలేను. కానీ అందరూ మట్టితో విగ్రహాల తయారీకి లేక వాతావరణానికి మేలు చేసే వస్తువులతో వినాయకుడి తయారీకి మరల  గలిగితే, వాతావరణం కలుషితం కాదు గనక చాలా బాగుంటుంది.
I  
కొన్ని సార్లు ఇలా పూజ చేసేటప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోవడం జరుగుతుంది. అప్పుడు పూజను కొనసాగించలేము. కానీ అలా మరణం అన్నది కొన్ని ఇళ్లు ఉన్న ఒక కాలనీలో జరిగినప్పుడు పూజను ఆపక్కర్లేలేదు. కానీ ఎక్కువ ఆర్బాటం లేకుండా పూజను చెయ్యవచ్చు. అటువంటి పరిస్థితుల్లో పూజను పూర్తిగా ఆపివేయడం అన్నది మంచిది కాదు.
 
అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కాలనీలోని వారు ఒప్పుకోన్నట్లు అయితే, కనీసం ఒక ఇంట్లో మట్టి గణపతిని పెట్టి పూజను 3/5/7/9/11 
రోజులపాటు పూజచేసి, తరువాత ఆ గణపతిని కాలనీ గణపతితో పాటు పెట్టి, నిమజ్జనానికి తీసుకు వెళ్లడం అనేది ఒక ప్రత్యామ్నాయ పద్ధతి.
 
****




No comments:

Post a Comment

Pages