శివం-141 - అచ్చంగా తెలుగు

 శివం-141

శివుడే చెబుతున్న కథలు




నేను అనగా శివుడు 


 (జ్ఞాన ధ్యాన స్థితిలో ఉన్న కార్తికేయుడు నాకు విష్ణు  దేవుడికి బ్రహ్మ దేవుడికి మీ త్రిమాతల కి కథ చెబుతున్నాడు .. అందులో భాగంగా   కుండన్న మరియు అతని తల్లి యొక్క కథను రసవత్తరంగా చెబుతున్నాడు, తను తన తల్లి కలుసుకోవడం నేను వారి ఇంటికి రావడం ఆ మహాతల్లి నన్ను వారితోపాటు ఆతిథ్యం స్వీకరించి భోజనం చేయమని అడగడం దానికి గాను నాది ఒక షరతు ఉంది అని  వివరించడం దాకా కథ జరిగింది )

నేను విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు మీ త్రిమాతలు కథ వింటూనే ఉన్నాం.. కార్తికేయుడు రచన శైలి చిరస్మరణీయం , మా యొక్క పాత్రలు వాడుతూ తమ రాసుకున్న సన్నివేశాలు ఎంతో గొప్పగా నిజమైన మా భక్తాభిలాషాన్ని కచ్చితంగా చూపిస్తాయి ..
చెప్పవయ్యా కార్తికేయ ఎంతోసేపటి నుంచి అంతే మా ముందు తన్మయిత్వంలో ధ్యాన స్థితిలో కూర్చొని మేము అడిగిన కథలు నీ అంతరాత్మ ద్వారా తిరిగి చెబుతూనే ఉన్నావు ..
త్రిమాతలు "ఏమిటి కథలో మహాదేవుని వారు పెట్టిన షరతు " 

{

శివుడు " నాది ఒక షరతులు చెప్పాను కానీ ఇప్పుడే నేను చెబుతాను అనలేదుగా కానివ్వు తల్లి నీవేదో నాకు అవి ఎందుకు చేద్దామని అనుకుంటున్నావు కదా ఖచ్చితంగా నీ చేతి వంట తిని నేను ఆనందపడతాను .. అమ్మ.. తల్లి !కోరుకున్న కోరిక చిన్నది ఒకటిఅర జరగకపోతే నన్ను తిట్టుకునేవారు ఎంతోమంది ఉన్నారు ఈ దేవుడు నన్ను ఎందుకు కరుణించడు అని విమర్శ చేసేవారు ఎంతోమంది ఉన్నారు.. కానీ నీవు మాత్రం అచంచలమైన విశ్వాసంతో అనంతమైన నీ బిడ్డ మీద ఉన్న అనురాగంతో నామీద నీవు భారాన్ని మోపి ప్రతిరోజు నువ్వు తినే దాన్ని నాకు ప్రసాదంగా నివేదిస్తున్నావు.. ఆనాడే నువ్వు చేసిన ప్రతి వంట నేను తిన్నాను తల్లి, అంతేగాక ప్రతిసారి నువ్వు కడుపుకు తినే ప్రతి సమయం ఎక్కడుందో నా బిడ్డకు కూడా సమయానికి భోజనం అయ్యేటట్లు చూడు స్వామి అని కోరుకునేదానివి .." 

అని మహాదేవుల వారు చెప్పటంతో   కుండన్న  తన తల్లి వైపు చూసి కన్నీటి పర్యంతంమయ్యాడు..

శివుడు " అదే కదా తల్లి ప్రేమంటే , ఉన్నాడో లేడో తెలియని నీ బిడ్డ గురించి కచ్చితంగా ఉన్నాడు ఎక్కడ ఉన్నా బాగుంటాడు ఎక్కడున్నా నాకోసం ఎదురు చూస్తూ ఉంటాడని మనసులో ఎంతో గొప్ప వివేక విచక్షణ పెట్టుకొని మీ బిడ్డ కోసం అనునిత్యం వేంపర్లాడావు.."

అప్పుడు గుర్తొచ్చింది  కుండన్న కి తను ఏ రోజు 
పస్తు  ఉండలేదని తనని పెంచిన వారు కూడా ప్రతి పుట ను చక్కగా భోంచేయాలని తనకి కొసరి కొసరి వడ్డించినది గుర్తుకొచ్చి తనని పెంచిన వారిని కూడా తలుచుకొని ఎంతో ఆనందపడ్డాడు దానికి కారణం నా తల్లి కోరిక కదా దాన్ని మహాదేవుడు తీర్చడం కదా అని ఎంతగానో  సంబర   పడ్డాడు.. తను అనాధని తనకు నిజంగా తెలియదు కదా తనని పెంచిన వారు చనిపోయేటప్పుడు చెప్పినప్పుడు మాత్రమే తనకి ఒక అమ్మ ఉందని ఆ అమ్మ దగ్గర నుంచి తప్పిపోయారని ఎట్లాగైనా అమ్మ ను  కలుసుకోవాలని ఆమెను కలుసుకోలేక వైరాగ్యం చెంది భగవంతుడు అయినా మహాదేవుని తలుచుకుంటూ ఆయన్ని తన తీవ్రమైన స్నేహ భక్తితో ప్రసన్నం చేసుకుంటాడని తెలియదు కదా..

తల్లి " మహాదేవ ఎన్ని కష్టాలు పడింది ఈ అదృష్టానికని ఎంతగానో ఆనందంగా ఉంది, నా నుంచి దూరమైన ఈ బిడ్డ సాక్షాత్తు మీతోనే పరాచకాలాడి భగవంతుని స్నేహితుడిని చేసుకున్న ఈ సన్నివేశం చూడటానికే నాకు ఈ జన్మ పండుగగా సరిపోయింది, దానితోపాటు నేను తమరికి కడుపునిండా భోజనం 
పేట్టడం అనేది నాకు ఎంతగానో ఆనందంగా ఉంది తండ్రి... మరొక్క కోరిక స్వామి" 

శివుడు "చెప్పు తల్లి నీ కోరిక ఏదైనా నెరవేరుస్తాను.. తండ్రి తమరు ఎప్పుడైనా గోరుముద్దలు తిన్నారో తినలేదు నేను మీకు కార్తికేయనికి ఒకే కంచంలో కలిపి మీ ఇద్దరికీ గోరుముద్దలు తినిపించాలని నా కోరిక తండ్రి దయవుంచి ఇది ఒక్కటి మన్నించండి, తమరికి గోరుముద్దలు తినిపించాలని అలాగే ఎంతో కాలం నుంచి దూరమైనా నా బిడ్డకి మీతో కలిపి గోరు ముద్దలు తినే అవకాశం రావాలని స్వార్ధంతో ఈ కోరిక కోరుకుంటున్నా తండ్రి  " 

}


గతంలో కార్తికేయ రచనలలో నాకు ఒక తల్లి ఉంటే ఎలా ఉంటుంది అని తన చేత చిన్న పిల్లలకు తల్లి చేసే  సుశ్రూష అంతా నాకు చేసినట్టు గోరుముద్దలు తిన్నట్టు తన భక్తిని చాటుకున్నాడు ఇప్పుడు నాతో పాటు నా భక్తుడు తన తల్లి కలిసి గోరుముద్దలు తినిపించాలని ఈ కార్తికేయ ఆలోచన నాకు ఎంతగానో నచ్చినది ..

విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు " మహాదేవ తమరి కన్నా మాకు కూడా ఆలోచన ఎంతో బాగా నచ్చింది, కథలు ఎలాగైనా మా పాత్రను కూడా చెప్పించి ఆ మహాతల్లి చేత గోరుముద్దలు మాకు తినిపింపజేస్తే బాగుండేది కార్తికేయుడు "

కార్తికేయుడు " అయ్యా విష్ణుదేవ తమరికి పెడితే ఒకటి బ్రహ్మదేవుల వారికి పెడితే ఒకటి శివుడికి పెడితే ఒకటా అందరూ ఒకటే అంతా ఒకటే అన్ని ఒకటే , ఏదైనా ఒకటే "

త్రిమాతలు "కార్తికేయుడు బహు చతురమైన ఎత్తు వేశాడు ఇప్పుడు ఈ కథలో విష్ణు దేవుడు పాత్ర బ్రహ్మదేవుడు పాత్ర లేదని ఇక వారు నోచ్చుకోరు సుమీ" 


 ఇక కథ 

{
   శివుడు "అలాగే తల్లి తప్పకుండా తీరుస్తా , అయినా స్మశానంలో కపాలల్లో తినే నాకు నువ్వు ప్రేమగా నోట్లో ముద్దులు పెడతానంటే ఎందుకు కాదంటాను తల్లి " 

 కుండన్న  " చూసావా అమ్మ స్నేహితుడి తల్లి కూడా తల్లితో సమానం అందుకని నిన్ను కూడా మహాదేవుని వారు అజరామరమైన వ్యక్తి సృష్టి ప్రారంభం ముందు నుంచి ఉండేవారు సృష్టిని తనలో లీనం చేసుకునే వారు కూడా నిన్ను అమ్మా అని పిలుస్తున్నారు ఆ జగన్మాతకే పతి   అయిన ఈ జగత్ పి త ని నీవు బిడ్డగా పొందుతున్నావమ్మా నీ అదృష్టం చూడు ఇదంతా నా స్నేహం వల్లే కదా అని తను ఆనందంతో కళ్ళు పైకి ఎగరేసి పొంగిపోతున్నాడు 

తల్లి " అవును ! నీ  నిష్కలంక భక్తికి లొంగిపోయాడు ఈ మహాదేవుడు అంటూ నన్ను ఆరాధనగా చూస్తుంది " 

 కుండన్న  " మరి ఏమనుకున్నావ్ ఈ కుండ న్న  అంటే" 

శివుడు " ఏమయ్యా ! నీకు నీ తల్లి చంద్రశేఖర ప్రభు అని గొప్ప పేరు పెట్టింది కదా నువ్వు ఇప్పటినుంచైనా చంద్రశేఖర ప్రభు అని చెప్పొచ్చు కదా " 

కు " అలాగే మహాదేవ ఇప్పటినుంచి నన్ను నేను చంద్రశేఖర ప్రభు గానే అనుకుంటాను నా తల్లిదండ్రులు పెట్టిన పేరు నాకు ఉత్తమమైనది " 


సరదాగా సంభాషణ కొనసాగుతూ ఉండగా ఆ మహాతల్లి అమితమైన ప్రేమతో చక్కగా మడి కట్టుకొని భగవంతుడికి నైవేద్యం వండినట్టే అన్ని పదార్థాలు సిద్ధం చేస్తుంది 

కు " అమ్మ ఇంట్లో అన్ని పదార్థాలు ఉన్నాయి మహాదేవుడికి ఏది ఇష్టమో కనుక్కొని అన్ని చెయ్ ఆయనకు అన్నీ తినిపించాలి మనం ఆయన మానసికంగా ఇప్పటిదాకా ప్రసాదం తీసుకుని ఆనందపడి ఉంటారు కానీ మనం ప్రత్యక్షంగా ఇవ్వాలి అయ్యా వెళ్లి పార్వతీ మాత తో  నీ దగ్గర నేను బిక్షం ఎత్తుకొని తిన్నాను కానీ ఒక తల్లి నా స్నేహితుడు మాత్రం నన్ను వారంతట వారే అడిగి నాకు గోరుముద్దలు తినిపించారని గొప్పగా చెప్పుకోవాలి ,

ఆ మాటకి పార్వతీ మాత కూడా నవ్వుకున్నది ..

}

నిజంగా పార్వతీ మాత నవ్వుకున్నది ..

పార్వతీ మాత " నేను రా కుమార్తె ను.. తమరు సాధువు లాగా వచ్చి నా దగ్గర బిక్ష అడిగారు నేను అందరికీ పెడతాను తమకి పెడతాను " అంటూ మహాదేవుని వారి వైపు చూసి వెటకారం చేయ సాగింది 

  నేను " చూడవయ్యా కార్తికేయ గురువా గురువా అని పిలుస్తూ మా ఇంట్లోనే మాకు గిల్లికజ్జాలు పెడుతున్న సుమీ" 

నా యొక్క హాస్య భరితమైన ఒక కవళికలు చూసి అందరూ ఆనంద పడ్డారు 

నేను "కార్తికేయ తొందరగా ఈ కథ అయిపో గోట్టి నీవు మనసులో అనుకున్న సాధన స్థిరంగా పెట్టి మాకు చేయబోతున్న కథను సిద్ధం చేశావు కాబట్టి నువ్వు దర్శకత్వం వెంటనే చేయవలెను .. దానికి మేము ఎంతో కాను ఆనందపడతాము ఈ కథ యొక్క ఆఖరి ఘట్టం త్వరగా మాకు చెప్పి ఇకని ధ్యాన స్థితిలో నుంచి బయటికి వచ్చి దర్శకత్వం మొదలు పెట్టవలెను 

లక్ష్మీదేవి " ఇది శివాజ్ఞ" 

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages