వాలి సుగ్రీవుల వైర వృత్తాంతము - అచ్చంగా తెలుగు

వాలి సుగ్రీవుల వైర వృత్తాంతము

Share This

 వాలి సుగ్రీవుల వైర వృత్తాంతము

అంబడిపూడి శ్యామ సుందరరావు 




వాలీ సుగ్రీవులు సోదరులు  వాలి ఇంద్రుని కుమారుడు, మహా బలవంతుడు మరియు కిష్కింధ రాజయితే, సుగ్రీవుడు సూర్యుని కుమారుడు  ఇద్దరిలో వాలి జ్యేష్టుడు మరియు బలపరాక్రమాలలో సుగ్రీవునికన్నా మిన్న అందువల్ల వారి తండ్రి చనిపోగానే మంత్రులు అందరు వాలిని వానర సామ్రాజ్యానికి రాజుగా చేసారు సుగ్రీవుడు కూడ అన్న వాలిని గౌరవిస్తూ ఉండేవాడు సుగ్రీవుడు సేవకుడి వాలే అన్నకు సేవ చేస్తూ ఉండేవాడు.కొంతకాలానికి దుందుభి జ్యేష్ఠ పుత్రుడు మాయావి అనే రాక్షసునికి వాలికి ఒక స్త్రీ వలన వైరం ఏర్పడినది ఆ వైరము వల్ల ఒకనాడు మాయావి అర్ధరాత్రి కిష్కింద నగర ద్వారం వద్దకు వచ్చి భయంకరంగా సింహనాదం చేసి వాలిని తనతో యుద్ధం చేయవలసిందిగా సవాలు విసిరాడు. 

గాఢ నిద్రలో ఉన్న వాలి ఆ సవాలు స్వరం విని నిద్ర లేచి అప్పటికప్పుడే యుద్దానికి బయలు దేరాడు సుగ్రీవుడు, వాలి భార్య తార యుద్దానికి పోవద్దు అని వారించారు కానీ శత్రువు సవాలు చేసినప్పుడు ఏ సమయము అయినా ఆ సవాలు ను ఎదుర్కొని శత్రువును అంతమొందించాలీ అని చెప్పి వాలి మాయావి తో యుద్దానికి బయలు దేరాడు సుగ్రీవుడు అన్నగారి మీద ఉన్న ప్రేమ గౌరవము వల్ల సేవకుని వలె అనుసరించాడు  అసురుడు మాయావి వాలిని వాలి వెనుక వస్తున్నా సుగ్రీవుని చూసి భయపడి అమితవేగంతో పరిగెత్తసాగాడు. వాలి సుగ్రీవులు కూడా వాడిని వెంబండించారు.అప్పుడే చంద్రోదయం అయింది వెలుతురూ వచ్చింది ఆ అసురుడు వీరి నుండి తప్పించుకోవడానికి ఒక బిలములోకి దూరాడు ఆ బిలము భూమి మీద ఉన్నప్పటికీ పై వరకు గడ్డి కమ్ముకొని లోపలి పోవడానికి వీలు కాకుండా ఉంది.శత్రువు బిలం  లోకి ప్రవేశించడం చుసిన వాలి తమ్ముడితో,సుగ్రీవ నేను ఈ బిలములోకి ప్రవేశించి శత్రువును చంపి వస్తాను నేను తిరిగి వచ్చే వరకు నీవు ఈ బిలము వాకిట ఉండు అని ఆజ్ఞను జారీచేశారు సుగ్రీవుడు తానూ కూడా బిలములోకి వస్తానని అనుమతి  ఇవ్వమని వేడుకున్నాడు కానీ వాలి అంగీకరించలేదు వాలి తన అడుగుల మీద సుగ్రీవుని చేత అక్కడే ఉండేటట్లు ఒట్టు పెట్టించుకుని బిలం లోకి ప్రవేశించాడు 
వాలి బిలం లోకి ప్రవేశించి సంవత్సర కాలము గడిచింది  సుగ్రీవుడు అన్న ఆజ్ఞను అనుసరించి ఆ  సంవత్సరం అంతా బిల ద్వారం వద్ద కనిపెట్టుకొని ఉన్నాడు సంవత్సర కాల గడిచినా అన్న వాలి బయటకు రాకపోవడం తో అతడు చనిపోయాడేమో అని భయపడ్డాడు.చాలా కాలం గతించినాక బిలం నుండి నురగలతో కూడిన నెత్తురు రావడం కనిపించింది యుద్దములో పాల్గొంటున్న అసురుల అరుపులు వినిపించాయి కానీ అన్న వాలి  జయజయధ్వనులు వినిపించక పోవడంతో అన్న వాలి చనిపోయాడని భావించి ఆ బిలద్వారాన్నీ ఒక పెద్ద రాయి తో మూసి వేసి శోకార్తుడై అన్న వాలికి జలతర్పణం వదిలి కిష్కింధకు వచ్చాడు మంత్రులు అందరు జరిగినది సుగ్రీవుని ద్వారా తెలుసుకొని అందరు యోచించి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చేశారు. అప్పటినుండి సుగ్రీవుడు న్యాయ మార్గాన రాజ్యపాలన చేయడం ప్రాంభించాడు.

వాలి తన శత్రువు అయిన  మాయావిని  చంపి కొంతకాలానికి కిష్కింధకు వచ్చాడు పట్టాభిషక్తుడై రాజ్యం ఏలుతున్న సుగ్రీవుని చూసి వాలి ఆగ్రహించి సుగ్రీవుని తిట్టి మంత్రులను కారాగారంలో పెట్టాడు ఆ సమయములో వాలిని నిగ్రహించి సామర్ధ్యం ఉన్నప్పట్టికీ అన్న అనే గౌరవంతో ఉన్నాడు. అన్న వాలిని గౌరవించి నమస్కారం చేసి ఆశీర్వదించామని వేడుకున్నాడు అయినప్పటికీ వాలికి కోపము తగ్గలేదు తమ్ముడిని అనుగ్రహించలేదు.వాలి సుగ్రీవుని చావగొట్టి మరీ వెళ్ళగొట్టాడు  సుగ్రీవుని భార్యను అపహరించాడు అప్పటినుండి వాలి వల్ల భయము వలన భార్య వియోగ దుఃఖం వలన మహారణ్యములో సంచరిస్తూ ఈ భూమి మీద వాలి రావడానికి వీలు లేని ఋష్యమూక పర్వతానికి వచ్చి  చేరాడు.

ఆ విధంగా సుగ్రీవుడు  వాలి తో వైరము ఏర్పడటానికి గల కారణాన్ని  వివరించాడు సుగ్రీవుడు తన అపరాధం ఏమి లేకున్నా అన్న వాలి తనను చంపుతాడన్న భయముతో   తనకు ఉన్న కొద్దిమంది శ్రేయోభిలాషులల్తో ఋష్యమూక పర్వతము చేరి ఆంజనేయుని ద్వారా శ్రీరామా చంద్రునితో మైత్రి చేసికొని తనకు తన అన్న వాలికి వైరం ఏర్పడటానికి గల కారణాన్ని వివరించినాడు  వివరించినాక వాలిని నిగ్రహించి తనను అనుగ్రహించవలనని శ్రీరాముని ప్రార్ధించెను. ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో మైత్రి చేసికొని వాలిని సంహరిస్తానని మాట ఇచ్చాడు. 

***

No comments:

Post a Comment

Pages