ఒకటైపోదామా ఊహల వాహినిలో -35
కొత్తపల్లి ఉదయబాబు
" మరి నాన్న నిన్నేమైనా అంటే? ఈ వయసులో నిన్ను వదిలేస్తే?
"
" చేసే పిచ్చి పనులన్నీ చేసి ఆయన నన్ను ఇంట్లోనుంచి గెంటేస్తాడా. గెంటే
పరిస్థితి వస్తే ఆయన్నే నేను వదిలేస్తాను కానీ నా భారతీయతని నా సంస్కృతిని నా
సంప్రదాయాన్ని నేను వదులుకోను. ఇది మన
పవిత్ర భారతదేశంరా. మన దేశం పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు చేతులెక్కి మొక్కుతాయి.
మన సాంప్రదాయం,
ఆచారాలు, వ్యవహారాలు కట్టుబొట్టు వీటన్నిటినీ
ప్రపంచ దేశాల్లో ఎందరో విదేశీయులు ఆచరించి మరీ చూపిస్తున్నారు.
అంతెందుకు?
మొన్న టీవీలో ఎవరో విదేశీ
కుర్రాళ్ళు వేదాన్ని కళ్ళు తిరిగి పోయేలా
చదివారు. చిన్న చిన్న కుర్ర పిల్లలు
భగవద్గీతలోని 700 శ్లోకాలు క్రమం తప్పకుండా అప్పగించారు. ఇంకా చెప్పాలంటే
మన ఇండియాలోని పెద్దలకే అవేవీ రావు.
అంత గొప్పది మన భారతీయ సంస్కృతి. అందువల్ల నేను
చెప్పినట్టు ఒక మంచి అమ్మాయిని చూసి
ప్రేమించి ఇంటికి తీసుకురా. ఎటోచ్చి
ప్రేమించే ముందు నాకు ఒకసారి చూపించు. ఆ అమ్మాయి మన సంస్కృతిని సంప్రదాయాన్ని
పాటిస్తుందో లేదో చెబుతాను. అప్పుడు నువ్వు ప్రేమించు. "
" అమ్మ నేను నీ దగ్గర ఒక నిజం దాచాను. నువ్వు
కోప్పడవు కదా. "
" అంటే మీ నాన్న కోరిక తీర్చేద్దామని ఎవరైనా
అమ్మాయిని ప్రేమించి గర్భవతిని కూడా చేసేసావా? అందుకేనా ఇంట్లో ఆ బొమ్మలను
పెడుతున్నావు? " అడిగేసింది విశాలాక్షి.
"అమ్మ. ప్రేమించుకుని పెద్దల అనుమతితో పెళ్లయిన
వాళ్లే 16 రోజుల పండగ పూర్తి కాకుండానే
విడాకులు తీసుకుంటున్నారు.
అలాంటిది. నా మనసుకు నచ్చిన అమ్మాయిని చూసుకుని,
ఆమె పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకొని, నేను
నీకు నచ్చానా, నన్ను ప్రేమిస్తావా అని ఆ అమ్మాయి నిర్ణయం
తీసుకుని మూడేళ్ల పాటు ప్రేమించి, నాన్న పెట్టిన కండిషన్
చెబితే, గతిలేక
నన్ను ప్రేమించిన పాపానికి ఒప్పుకొని తల్లి కాబోతోందమ్మా. నాన్న లేకుండా
ఒక్కసారి తను నీ దగ్గరికి తీసుకొస్తాను. నేను చేసింది తప్పు పనో సరి అయిన పనో
నువ్వే నిర్ణయించి చెప్పు." అన్నాడు విరాజ్.
" నువ్వు తండ్రి మాట పాటించే
శ్రీరామచంద్రుడులాంటివాడిరా. మీ నాన్న మాట పట్టుకుని వేళ్లాడి ఇప్పటికే బంగారం
లాంటి జీవితాన్ని పాడు చేసుకున్నావ్. ఒక్కసారి నా కోడల్ని తీసుకొచ్చి నాకు
చూపించు. మీ అమ్మ కోరిక తీరుస్తావా?
"
అడిగింది విశాలాక్షి.
" తప్పకుండా అమ్మా. నాన్న కొట్లో ఉండే సమయంలో
తనని తీసుకొచ్చి నీకు చూపిస్తాను. నువ్వు ఎంత మంచి దానివమ్మా. " అని తల్లిని
మనసారా కౌగిలించుకుని చమర్చిన కళ్ళు తుడుచుకుని బయటికి నడిచాడు విరాజ్.
******
షాపుకు వచ్చాక హరితకు ఫోన్ చేశాడు విరాజ్.
"హరిత.మా అమ్మకి మన విషయం అంత చెప్పేసాను."
" అలాగా మరి నన్ను అసహ్యించుకోలేదా? "
" అలా ఏం లేదు. అమ్మ మన పార్టీనే.నిన్ను ఒకసారి
చూడాలి అంది. మా నాన్న ఇంట్లో లేని సమయం చూసి నేను కారేసుకుని వస్తాను. ఒక పది
నిమిషాలు మాట్లాడేసాకా నిన్న మళ్ళీ ఇంటి
దగ్గర దింపేస్తాను. "
" అలాగే విరాజ్. వచ్చే అరగంట ముందు నాకు ఫోన్
చేస్తే నేను మంచి బట్టలు కట్టుకుని సిద్ధంగా ఉంటాను. "అంది హరిత.
" థాంక్యూ డార్లింగ్" అన్నాడు విరాజ్.
*********
సహజంగా తండ్రి షాపులో ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట
వరకు
సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8:00 వరకు చాలా బిజీగా ఉంటాడు.
మర్నాడు ఉదయం 11 గంటల దాటాక విశాలాక్షికి ఫోన్
చేశాడు.
" అమ్మ! ఖాళీగా ఉన్నావా పనిలో ఉన్నావా?"
" వంట చేస్తున్నాను రా "
" ఒక పది నిమిషాలు హరితను తీసుకు రమ్మంటావా? "
" ఊ...తీసుకురా.. ఓసారి చూసేస్తాను"
అనుమతించింది విశాలాక్షి.
హారతి కి ఫోన్ చేశాడు విరాజ్.
" టిఫిన్ అయిందా హరిత? "
" అయింది. అమ్మ డ్యూటీ కి వెళ్ళింది "
" అయితే
అమ్మ నిన్ను తీసుకు రమ్మంది. రాగలవా?
"
" వస్తాను. మీరు రండి"
హరిత ఒప్పుకున్నాక
కుర్రాళ్ళని షాపు చూసుకోమని చెప్పి
విరాజ్ పావుగంటలో హరిత ఇంటికి వచ్చాడు.
హరిత బయటికి
వచ్చాక తాళం వేశాడు.
పోర్టికోలో కారు ఆపి హత్య చేయపుచ్చుకొని నెమ్మదిగా
పైకి హాల్లోకి తీసుకొస్తూనే " అమ్మా"
అని అరిచాడు.
విశాలాక్షి హరితను చూస్తూనే మెరిసే కళ్ళతో
" రామ్మా. రా. " అంటూ సోఫా తన పక్కనే
కూర్చోబెట్టుకుని " ముందు మంచినీళ్లు తీసుకో.నీ పేరేమిటమ్మా? " అంటూ మంచినీళ్ల గ్లాస్
అందించింది.
అయితే నిదానంగా మంచి నీళ్లు తాగింది.
" నా పేరు హరిత అండి "
" మీ అమ్మగారు నాన్నగారు... "
"నాన్నగారు లేరండి. విరాజ్ బాబు మా కాలేజీకి
బహుమతులు ఇవ్వడానికి అతిధిగా వచ్చారు.." అని మొదలుపెట్టి స్పష్టంగా క్లుప్తంగా తన గురించి
పూర్తి వివరాలు చెప్పేసింది హరిత.
" అయితే ప్రస్తుతం నువ్వు.... "
" అవునండి. మూడో నెల. "
" మరి పెళ్లి కాకుండా అలా చేయడం తప్పు కదా..? "
"పెద్దవాళ్లు పిల్లల చేత తప్పు పనులు
చేయించకూడదు. అటువంటి పని చేస్తేనే నేను అంగీకరిస్తాను అని పెద్దవాళ్లే అంటే..
చిన్నపిల్లలం... లోకజ్ఞానం లేని వాళ్ళం ప్రేమించే వాడిని వదులుకోలేని వాళ్ళం. ఏం
చేస్తాం చెప్పండి.
ఒకవేళ నేను అందుకు ఒప్పుకోలేదు అనుకోండి.. మూడేళ్లుగా
ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం అతనితో సుఖంగా కాపురం
చేయగలనా?
మా అమ్మకు వచ్చే 20 వేల రూపాయల పెన్షన్ తో మాత్రమే
మేము బతకాలి. ఈ ప్రపంచంలో నాకు మా అమ్మ,
మా అమ్మకి నేను తప్ప మరెవరు లేరు. విరాజ్ బాబు కాలేజీలో అంత మంది ఆడపిల్లలు ఉండగా, పేద ఆడ పిల్లనని నన్ను ఎన్నుకొని,నిన్ను
ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఏ ఆడపిల్ల మాత్రమే కాదంటుంది చెప్పండి.
ఇప్పటికీ నేను చేసింది తప్పో, రైటో నాకు తెలియదు. ఒకవేళ నేను చేసింది తప్పైతే, పురిట్లోనే
నాకు శిక్ష వేసేమని ఆ భగవంతున్ని కోరుకున్నాను." అని అన్న హరితను వారిస్తూ -
" తప్పమ్మా అలా మాట్లాడకూడదు. ఆడపిల్లకి పురుడు అనేది పునర్జన్మలాంటిది. నువ్వు ఇప్పుడు
ఈ ఇంటి వారసుడినో,వారసురాలినో
మోస్తున్నావ్. ఆయన కచ్చితంగా నిన్ను కోడలిగా ఒప్పుకుంటారు. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం
చేయాలో నాకు తెలుసు."
"మీరు చెప్పండి మేడం. నా పరిస్థితిలో మీ బిడ్డ
ఉంటే ఏం చేస్తారు?"
" రేపు నీ భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచిస్తూ
ఉంటాను "
" ఇప్పుడు మా అమ్మ చేస్తున్న పని అదే మేడం
" హరిత అన్న మాటలకి విశాలాక్షి కళ్ళు చమర్చాయి.
" సరేనమ్మా. ఈ విషయంలో మనసులో పెట్టుకుని ఏమి
బాధపడొద్దు. మీ అమ్మగారికి కూడా ధైర్యంగా ఉండమని చెప్పు. నువ్వు నీ పద్ధతి నీ
నిదానం, అమాయకత్వం, ఒబ్బిడితనం అన్నీ నాకు నచ్చాయి.
అక్క ఏం చేయాలో నేను మా అబ్బాయి చూసుకుంటాం. సరేనా? "
" సరే మేడం" అంది హరిత దీర్ఘంగా
నిట్టూరుస్తూ.
" ఉండమ్మా కాస్త బోర్నవిటా తాగుదువుగానీ "
హరిత ఆమె చేయి పట్టుకుని ఆపింది.
"పర్లేదు మేడం ఇప్పుడేం వద్దు."
" అలా ఏం కుదరదు... నువ్వు మొదటిసారి మా ఇంటికి
వచ్చావ్. ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. నీకు ఏ సలహా కావాల్సి వచ్చినా నాకు ఫోన్ చెయ్.
మందులవి టైం ప్రకారం వేసుకుంటున్నావా? "
" వేసుకుంటున్నానండి "
"వేసుకో. పాపో, బాబో పుట్టిన తర్వాత ఆ బిడ్డతో
ఇక్కడికి రా. ఆ తర్వాత జరగాల్సింది నేను చూస్తాను " అని చెప్పి ఐదు
నిమిషాల్లో బొర్నవిటా మగ్ తీసుకువచ్చి
హరితకు ఇచ్చింది విశాలాక్షి.
హరిత తాగుతున్నంతసేపు ఆవిడ పక్కనే కూర్చుని హరితను
పరిశీలిస్తూనే ఉంది.
" ఆరోనెల నిండే అంతవరకు ఇంట్లో ఏదో ఒక పని
చేస్తూ ఉండు. ఎక్కువ సేపు పడుకోకు. ఏది తినాలనిపించినా తిను . నీ పద్ధతి చూస్తుంటే
మీ అమ్మగారికి అన్నీ తెలిసి ఉండాలి. అర్థమైందా"
" అర్థమైంది మేడం. మరి నేను వెళ్ళిరానా? "
" అలాగేనమ్మా " తల్లి హరితతో
మాట్లాడుతున్నంత సేపూ సోఫాలో కూర్చుని హరితను అలా గమనిస్తూనే ఉన్నాడు విరాజ్.
హరితకు బొట్టుపెట్టి డైనింగ్ టేబుల్ మీద ఉన్న పళ్ళని
క్యారీ బ్యాగ్ లో వేసి హరితకు అందించి,
మీది గుమ్మం వరకు వచ్చి టాటా చెప్పింది విశాలాక్షి.
విరాజ్
హరితను మళ్ళీ జాగ్రత్తగా ఇంటిదగ్గర దింపి షాప్ కి వచ్చేసాడు.

.jpg)
.jpg)

No comments:
Post a Comment