నా కంటే ముందే
చందలూరి నారాయణరావు
9704437247
ఎప్పుడూ ఇంతేగా
మళ్ళీ ఇప్పుడు ఇంకొకడు.
వాడు నేను ఒకటేనన్న
నిజాన్ని తట్టుకోలేని
పిరికితనం వాడిది.
వాడు ఆస్వాదించే రుచి....
నేను ఆదరించే రుచి ఒకటయినా
వాడు నడిచే దారిలోనే
నా మార్గం...నా గమ్యం రాసున్నా
వాడి గొంతుకు సమానంగా
నా స్వరం పలకబడుతున్నా
వాడు నా పక్కనున్నా
నేను వాడి వెంట వున్నా
ఎవరి హుందాతనం ఎవరికీ తక్కువకాదు
నా ఒంటికి సరిపడా
అందం నాకూ ఉంది
వాడి ఇంటితో పోటీగా
సుఖం నాకూ ఉంది.
* * *
ఐతే
జరుగుతున్న ద్రోహమొకటి
పిచ్చిపట్టిన భయం ఇంకొకటి
గొంతులు చించుకునే అసహనంగా
బయటపడలేని
ఈర్ష్య రూపంగా
నా కంటే ముందే
అక్కడ ప్రత్యక్షమవుతాయి
నా లోని లోపమొకటి
లోకంతో తనకున్న శత్రుత్వాన్ని దాచి నటిస్తుంది...
నా లోపలి మర్మమొకటి
నా వెనుకే గోతులు తీస్తుంటుంది.
ఎప్పుడూ ఇంతే
ఎవడో ఒకడు ఉంటూనే ఉన్నాడు.
నా కంటే ముందే
ఏదో ఒక వికృత రూపంలో
నన్ను చూపెడుతుంటాడు
***



No comments:
Post a Comment