శ్రీథరమాధురి - 142
(పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
'అన్నదాత సుఖీభవ'
ఈ మాట
అనేక అర్థాలతో సంపన్నమైనది.
అన్నదాత అంటే...
-ఈ తిండి గింజలు, కూరలు పుట్టిన చోట, దున్నేందుకు భూమిని ఇచ్చినవాడు.
- ఆ ప్రత్యేకమైన భూమిని కలిగి
ఉన్న పితృదేవతలు.
- ఆ యొక్క ధాన్యాలు, పప్పులు, ఉప్పు, మిరపకాయలు, పసుపు, కూరగాయలు ఉత్పత్తి చేయడానికి తోడ్పడిన వారు.
- పండిన పంటను మార్కెట్ కు
తెచ్చిన వారు.
- వాటిని అమ్మే వారందరూ.
- వాటిని మార్కెట్లో కొనేందుకు
వెళ్లిన వారందరూ.
- ఆ పచ్చి వస్తువులను రుచికరమైన
ఆహారంగా వండటానికి కారణమైన వారు.
- ఆహారాన్ని వడ్డించేవారందరూ.
- అన్ని పదార్థాలు, ఈ భోజనాన్ని రుచికరంగా చేయడానికి కారణమైన ఉత్పత్తిదారులంతా.
బోన్గైగాన్ రిఫైనరీలో ఉత్పత్తి
చేసి ఇంటికి తెచ్చిన వంట గ్యాస్ నుంచి, శివకాశి నుంచి వచ్చిన అగ్గిపుల్లల
దాకా, భిలాయ్ లేక సేలంలో చేసిన స్టీల్
పాత్ర దాకా... ఈ రుచికరమైన భోజనాన్ని నాకు సమర్పించేందుకు బాధ్యులైన మొత్తం
మానవాళిని నేను 'అన్నదాత' అంటాను.
ఒక అతిథిగా భోజనం చేశాక, అతిథి సత్కారాన్ని స్వీకరించాక, నేను మనసారా వారిని 'హే అన్నదాత! సుఖీభవ!' అని దీవిస్తాను.
'సుఖీభవ' అంటే మీకు ఆనందాన్ని తీసుకువచ్చేవన్నీ, మిమ్మల్ని దృఢంగా ఉంచేందుకు సహాయపడేవన్నీ, మిమ్మల్ని ఆరోగ్యైశ్వర్యాలు, ప్రశాంతతతో ఉండేలా చేసేవన్నీ... అని అర్థం.




No comments:
Post a Comment