శ్రీథరమాధురి - 140
(పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
వంటింట్లో
వంట చేసే కళ...
మీరు
వంటింట్లో వంట చేస్తూ ఉన్నప్పుడు మీ హృదయం పనిచేయాలి, మెదడు కాదు.
- మీ మనసు సరిగ్గా లేనప్పుడు లేక మీకు మీ భర్త, భార్య లేక వేరే ఎవరితో అయినా సమస్యలు ఉన్నప్పుడు, వండిన ఆహారం మీకు ఇక ఎంత మాత్రం అమృతం కాదు. దాని లక్షణాలు మారి పాడైపోతుంది.
- మాట్లాడే మాటలు, ఆలోచనలు వండే ఆహారంపై ప్రభావాన్ని చెపుతాయి.
- · ఎవరైనా వంట చేసేటప్పుడు కోపంగా ఉంటే, అటువంటి ఆహారం చికాకును కలిగిస్తుంది.
- · వంట చేసేటప్పుడు ఎవరైనా బాధపడుతూ ఉంటే. అది తిన్న వ్యక్తి నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.
- · ఎవరికైనా అత్యంత స్వార్థం మనసులో ఉంటే లేక అతడు లేక ఆమెకే వంట చేయాలని ఉంటే, అది తిన్న వ్యక్తి స్వార్థపరుడయ్యే అవకాశం ఉంది.
- · వండే సమయంలో ఎవరైనా దురాశ లేక అసూయతో నిండి ఉంటే, అది తిన్న వ్యక్తిలో అసూయలేక స్వార్థం కలిగే అవకాశం ఉంది.
- · వండేటప్పుడు ఎవరైనా పశ్చాత్తాపం పగ, ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటే ఇది తిన్న వ్యక్తి కూడా పగతీర్చుకునేవారిలా మారతారు.
- · ఒకవేళ ఒకరు వంట చేసేటప్పుడు ప్రేమ, దయ వంటి భావనలతో నిండి ఉంటే, ఆ ఆహారం తిన్న వ్యక్తి ప్రేమ, దయ, శ్రద్ధలతో కూడుకుని ఉంటారు. అందుకే ఇదివరకు పెద్దలు వారి ఇంట్లో తప్ప, బయట తినేవారు కాదు. ఎందుకంటే ఆ సమయంలో వండే వారి మనఃస్థితి వారికి తెలియదు కనుక.
నేడు ప్రపంచం మారిపోయింది
చాలామంది ఇంట్లో ఉండడం మానేసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవడం మొదలుపెట్టారు.
ఒక్కొక్కసారి ఇతరులు వేడుకలు చేసుకునే సందర్భంలో, అందరూ భోజనాన్ని ఫ్రీ గిఫ్ట్ గా
కోరడం మొదలుపెట్టారు. ఇది ఆఫీసులోనూ, ఫ్రెండ్స్ తోనూ మామూలే.
ఎవరైనా నా వద్దకు వచ్చినప్పుడు, నేను మొట్టమొదట వారి వదనంలో గమనించేది, వారు ఎటువంటి భోజనం తింటున్నారు, దాని ప్రభావం వారిపై ఎలా
ఉంది అనేది.
వెనువంటేనే నేను నా ప్రయోగాల ప్రయోగశాలకు పరిగెత్తి, ఆ హాని యొక్క ప్రభావాన్ని తగ్గించే
ప్రయత్నం చేస్తాను.
మీ వంటింట్లో మీరు తయారు చేసే
ఆహారం ప్రేమతో కూడుకుని ఉండేలా చూసుకోండి.




No comments:
Post a Comment