ఒకటైపోదామా ఊహల వాహినిలో -29
నా ప్రాణం నన్ను వదిలేసి రైలుమీద అంత దూరం
వెళ్లిపోయిందా... అనుకుని
"నాకోసం వెతికించవద్దు.. అని మా నాన్నకి ఉత్తరం
రాసిపెట్టి చెప్పకుండా నా ప్రాణం కోసం
గాలిలో ఎగిరి వచ్చేసాను." అని విమానం నేల మీద నుంచి గాలిలోకి ఎగిరి మళ్లీ నేల మీద దిగినట్టుగా చేతితో చేసి
చూపించాడు విరాట్.
'విరాజ్ యు ఆర్ గ్రేట్. ప్రేమికులు గోడ
కట్టినట్టు అబద్ధాలు ఆడతారని నేను ఎక్కడో పుస్తకంలో చదివింది.అద్భుతంగా కవర్
చేసావ్. నీకు హాట్సాఫ్ విరాజ్.' అనుకుని మనసులోని అతని బుగ్గ
మీద ముద్దు పెట్టుకుంది హరిత.
"అంటే అతను హరితను ప్రేమించిన వాడా?" కళ్ళతో సైకిల్ చేస్తూ అడిగింది
బబిత శకుంతలని.
అవును అని తల ఊపి " నేనిక్కడికొస్తున్నట్టు
హరితే నీకు చెప్పి ఉంటుంది. నీతో చెప్పొద్దని నేను ఫోన్ కూడా
తీసేసుకున్నాను." అంది శకుంతల చిరు కోపంగా.
" అనవసరంగా మీరు నా ప్రాణాన్ని అనుమానిస్తే ఈ
శరీరం బాధపడుతుంది ఆంటీ. హరితను ఏమన్నా అన్నారంటే
మీరు నన్ను అవమానించినట్టే. నిజం చెప్పాలంటే నన్ను ప్రేమించినా కూడా మీ
మాటకే తను ఎక్కువ విలువ ఇస్తుంది ఆంటీ. నేను నమ్మినా నమ్మకపోయినా మీ దగ్గరకు వస్తున్నట్లు హరిత నాతో 'చెప్పలేదు'... " చెప్పలేదు అన్నచోట ఒత్తి పలుకుతూ.
అతను అంత గట్టిగా ఒత్తి చెప్పేటప్పటికి శకుంతల నిజమే
అనుకుంది.
" వెర్రివాడ. ఆ మార్గంలో కాకపోతే వేరే మార్గంలో
చెప్పి ఉంటుంది. లేకపోతే మేము ఇక్కడకు
వచ్చినట్టు నీకు తెలిసే అవకాశం లేదు. నీలోని నిజమైన ప్రేమను గుర్తించి నా
కూతురు నీతో ఇప్పుడు నిండైన ప్రేమలో పడిపోయింది. నాకు కావలసింది నువ్వు ఇక్కడికి
రావడమే. కచ్చితంగా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఇలాగే జరగాలని ఆ
దేవుడిని నేను కోరుకున్నాను. స్వామి నా మొర ఆలకించాడు." అని కళ్ళు మూసుకుని
స్వామికి దండం పెట్టుకుంది శకుంతల.
"ఇంతకీ ఎక్కడ
దిగారు?" అడిగింది
హరిత.
" ఆర్ఎన్ఎస్ రెసిడెన్సి లో. రూమ్ నెంబర్
201"
" అన్నట్లు సారీ... మా పిన్నిని పరిచయం చేయలేదు
కదూ.. తను మా పిన్ని. పేరు బబిత. మా నాన్నగారు బాబాయ్ గారు కలిసి ఎయిర్ ఫోర్సులో 15 ఏళ్ల పాటు పనిచేసారట. ఒక కడుపున పుట్టక
పోయిన సొంత అక్క చెల్లెలులా ఉంటారు అమ్మ, పిన్ని.
బాబాయ్ గారు పోయిన తర్వాత మా పిన్ని వాళ్ళ
పుట్టింటికి అంటే తమ్ముడు దగ్గరికి వచ్చేసింది. మాకు ఈ లోకంలో అయిన వాళ్ళ
కన్నా పిన్ని ఎక్కువ అని అమ్మ చెబుతూ
ఉంటుంది. " అంది హరిత విరాజ్ తో.
విరాజ్ బబితకు నమస్కరించాడు.
" నమస్తే బాబు.ఏదైనా పని మీద వచ్చారా"
" అవునండి. మా బంగారం షాప్ అసోసియేషన్ వాళ్ళందరూ
ప్రతి సంవత్సరం ఎక్కడికి వచ్చాటుకి వారం రోజులు పాటు టూర్ ప్రోగ్రాం ఏర్పాటు
చేసుకుంటాం. ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్దామా?
అని ఆలోచిస్తూ ఉంటే.. ఫోటోస్టాట్ కుర్రాడు మురుడేశ్వర్ అని అనగానే
ముందు ఒకసారి నేను విజిట్ చేసి తర్వాత
మాకు జరిగే సమావేశంలో ప్రపోజల్ పెడతాను. అందరూ ఒప్పుకుంటే ఈసారి కర్ణాటక టూర్
ప్రోగ్రాం వేద్దామన్నది మా ఉద్దేశం. ఈలోగా మురుడేశ్వర్ నేను ఒకసారి చూసేయచ్చు కదా.
పైగా హరిత, ఆంటీ
నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చేసారు. అది నిజమో కాదో కన్ఫర్మ్
చేసుకోవడానికి కూడా వచ్చాను. " అన్నాడు విరాజ్.
" అలాగా ఎన్ని రోజులు ఉంటారు? "
" ఎలాగూ వచ్చాను కదా ఆంటీ. చుట్టుపక్కల అన్ని
చూసి వెళతాను. ఉండొచ్చు బహుశా మూడు నాలుగు
రోజులు. " అన్నాడు విరాజ్.
" అయితే ఓ రోజు మా ఇంటికి భోజనానికి రండి"
అంది బబిత.
" తప్పకుండా వస్తాను ఆంటీ." అన్నాడు విరాజ్ హరిత కళ్ళల్లోకి చూస్తూ.
" సరే. విరాజ్. ఇక్కడ ఉన్న అన్ని రోజులు ఉదయం, సాయంత్రం ఇక్కడికి వస్తాం. మళ్లీ
కలుద్దాం అయితే. చెల్లి.. ఇంటికి వెళ్దామా వంట పని చేసుకోవాలిగా. " అంది
శకుంతల పైకి లేస్తూ.
"అవును. వెళ్ళొస్తాము బాబు." అంది బబిత.
" సరే ఆంటీ రేపొద్దున కలుద్దాం. బై హరిత. శుభరాత్రి".అన్నాడు విరాజ్.
" బై విరాజ్ గుడ్ నైట్." చెప్పి తల్లిని
పిన్ని అనుసరించింది హరిత.
********
ఇంటికి వచ్చాక శకుంతల బబితతో విరాజ్ హరితకు బహుమతి
ఇచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు జరిగిన
కథంతా చెప్పింది.
" విరాజ్ హరితని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాడు
చెల్లి. హరిత కూడా గత మూడేళ్లుగా నేను
చెప్పినట్టుగా విని అతనితో స్నేహంగా
మాత్రమే నడుచుకుంది. కానీ తన పట్ల విరాజ్ ప్రేమ
నిర్మలమైనది, కల్మషం
లేనిది తెలిసినప్పటినుంచి...హరితను మాత్రం
ఎంతకాలం కట్టడి చేయగలను చెప్పు. ఇప్పుడు
తను కూడా విరాజ్ ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది.
అది నిజమా కాదా తెలుసుకుందామనే నేను మేమిద్దరం
ఇక్కడికి వస్తున్నట్లుగా విరాజ్ కి
చెప్పద్దు అని చెప్పాను. ఫోన్ ద్వారా
మెసేజ్ చేయడమో, లేదా మాట్లాడి
చెప్పడం చెప్పడమో చేస్తుందనే అనుమానంతో
ఫోన్ కూడా తన దగ్గర నుంచి తీసేసుకున్నాను.
ఏదో మార్గం ద్వారా మేము ఇక్కడికి వస్తున్నట్టు విరాజ్
కి ఖచ్చితంగా సూచించింది. ఆ ప్రకారం హరిత
విరాజ్ ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తోందని నాకు రూఢి అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ
నిజమైన ప్రేమికులు.
అటువంటి ప్రేమికులని విడదీయడం మహా పాపం. విరాజ్ వాళ్ళ
నాన్నగారు ఇప్పుడు చేస్తున్న పని అదే. పెళ్లి కాకుండా బిడ్డ కని చూపించమంటాడు.
అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మన ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలో తోచకే నీ సలహా, l సహాయం తీసుకుందాం ఇక్కడికి
వచ్చాను.
విరాజ్ ఇక్కడకు రావడమే నాకు కూడా కావాల్సింది.
ఇద్దరు ఒకచోటే ఉంటే ఏం చేయాలో వాళ్ళ ఆలోచన వాళ్ళు
చేస్తారు. మన ఆలోచన మనం చేద్దాం. ఏమంటావ్ చెల్లి? " బబితను సలహా అడిగింది శకుంతల.
" నీకు ఎటువంటి సహకారం కావల్సినా చేసే పూచీ
నాదక్కా.ఈ విషయంలో హరీష్ కూడా మనకి కావాలంటే సహాయపడతాడు. నువ్వు నిశ్చింతగా ఉండు.
"
బబిత ఇచ్చిన హామీతో ఆమె చేతులను తన చేతుల్లోకి
తీసుకుని మదువుగా నొక్కింది శకుంతల.
ఇక్కడ వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వేరే గదిలో హరిత, సరిత విరాజ్ ని ఏ విధంగా ఏడిపించాలా
అని ప్లాన్ చేసుకో సాగారు.
*******




No comments:
Post a Comment