పుష్యమిత్ర - 2

టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: ప్రైం మినిస్టర్ "ఇండియన్ గ్లోబల్ " అనే అతిశక్తివంతమైన రాడార్ ను హిమాలయాలపైన నిర్మించడానికి ఇస్రో చైర్మన్ సతీష్ చంద్రకు అనుమతినిస్తారు. దానికి అనువైన ప్రదేశం కోసం ఇస్రో  “కనిష్కవర్ధన్ టీం”  ను పంపుతుంది. హెలికాప్టర్ల ద్వారా  అన్వేషణ జరుగుతూ ఉంటుందిఅది గమనించిన పాకిస్థాన్ ప్రభుత్వం, భారత దేశపు సైనికులు బార్డర్లో చేస్తున్న హడావిడి ఏమిటొ తెలుసుకోమని, కరిముల్లా అనే ఏజెంటును నియమించమని పాకిస్థాన్ ప్రెసిడెంట్ ఆర్మీ చీఫ్ కు అదేశాలిస్తాడు. ఇక చదవండి.
" సార్!  కనిష్కవర్ధన్ హియర్! " ఓవర్. "ఎస్!  కనిష్కవర్ధన్ వాట్ యీస్ ది ప్రోగ్రెస్? సతీష్ చంద్ర హియర్ ఓవర్.". "సర్ ఇక్కడ దయామీర్ పర్వతం మీద  మూడు వేల గజాల ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసాము. అది పాకిస్తాన్ భూభాగానికి దాదాపు రెండు వందల కిలో మీటర్లలో ఉంటుంది.  అనగానే ఓ వెరీ గుడ్. వాట్ యీస్ ది లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ ఆఫ్ దట్ ప్లేస్ మిస్టర్ కనిష్కా? జస్ట్ ఫర్ మై చెక్!".  వెంటనే  35°14’ 14” నార్త్ లాటిట్యూడ్  అండ్ 74°35' 21” ఈస్ట్ లాంగిట్యూడ్ సర్ అన్నాడు ! కనిష్క. “నేను తర్వాత కాంటాక్ట్ చేస్తాను. ఓవర్.” ఫోను కట్ చేసాడు చైర్మన్.
*  *  *
కరిముల్లా ఆర్మీ చీఫ్ ఎదుట సెల్యూట్ చేసి నిల్చున్నాడు.  "ఎట్ యువర్ కమాండ్ సర్".  భారత్ భూభాగంలో హిమాలయాల మీద ఏదో సీక్రెట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. నువ్వు వెంటనే వెళ్ళి అదేమిటొ తెలుసుకుని నాకు 48 గంటలలోపు విషయం చెప్పాలి అధికార పూర్వకమైన స్వరంతో అన్నాడు.  "జీ..కానీ 48 గంటలంటే మరీ తక్కువ సమయం కదా.." కరక్టే... ప్రెసిడెంట్ ఆర్డర్స్ నేనేమీ చెయ్యలేను. సారీ.. నీకు హెలికాప్టర్ ప్రొవైడ్ చేస్తాము. డు ఇట్ ఫాస్ట్లీ.. పర్వాతారోహకుడు గా వెళ్ళు భారతీయుడిగా నటించి విషయం సేకరించి చెప్పు". మన ఆర్మీ నీ ఏర్పాట్లు చూస్తుంది. ఇది మన దేశానికి సంబందించిన ప్రిస్టేజ్ ఇష్యూ..  బై... కం విత్ గూడ్ న్యూస్.
*  *  *
మిస్టర్ కనిష్క వర్దన్...మీరు ఎంపిక చేసిన ప్రదేశం బాగానే ఉంది కానీ...పక్కనే పెద్ద మంచు కొండ ఉంది గమనించారా? ఒకవేళ మంచు తుఫాను వస్తే మన కట్టడం నిలబడుతుందా టెక్నికల్ గా అలోచించాల్సి ఉంది.  తర్వాత ఈ ప్రాంతంలో ఇదివరకు ఎన్ని సంవత్సరాల క్రితం అలాంటి తుఫాన్లు వచ్చాయో అక్కడ ఉన్న వారిని ఎంక్వయిరీ చెయ్యండి.  ఆ గ్రవుండ్ మ్యాప్ ఫొటోలతో రేపు ఉదయం మీరు ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో  ఉండండి. నేను అక్కడ కలుస్తాను.  రేపు మధ్యాహ్నం  పీ.ఎం. దగ్గర అప్పాయింట్మెంట్ తీసుకుంటాను"  ఛైర్మన్ సతీష్ చంద్ర మాటలకు అలోచనలో పడి "అలాగే సర్" అన్నాడు.  మిగతా బృందం తొ జరిపిన అనేక చర్చల అనంతరం ఆ ప్రాంతమే అనువైంది గా భావించారు.
కనిష్క వర్ధన్ బృందం ఢిల్లీ ఎయిర్ పోర్టులోకి ప్రవేశిస్తూ ఉండగా ఎవరో వ్యక్తి తమను వెంటాడుతున్నట్టు భావించి    అర్మీ మేజర్ కు ఫోను చేసి విషయం తెలియ జేసాడు. "డోంట్ వర్రీ... పది నిముషాల్లో మీ వద్దకు ఒక సుబేదార్ మేజర్ వస్తాడు అతనికి ఆ వ్యక్తిని చూపించండి చాలు. మిగతా విషయాలు ఆయన చూసుకుంటారు" మేజర్ చెప్పాడు. ఫ్లైట్ రావడానికి ఇంకా గంట టైం ఉంది  ఈ లోపు ఈ వ్యవహారo తేలిపోతుంది అని ఊపిరి పీల్చుకున్నారు. కాఫీ తాగేలోపే.. "సర్! అయాం మేజర్ ప్రకాష్ సింగ్ "వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?" అంటూ ఒక వ్యక్తి వచ్చి  "సర్ మీరు చెప్పే వ్యక్తి ఇక్కడ ఉన్నారా? దయచేసి అతని వైపు వెంటనే చూడకండి".  "ఎస్. బ్లూ షర్ట్, వైట్ ప్యాంట్ విత్ వైట్ షూస్. ఆ బుక్ షాపు దగ్గర నిలబడి ఉన్నాడు" అని కనిష్క చెప్పగానే "ధ్యాంక్స్" అని చెప్పి వెళ్ళి వాడిని కాలర్ పుచ్చుకుని బయటకు తీసుకెళ్ళాడు. ఇంతలో సతీష్ చంద్ర వచ్చారు.  "గుడ్ మార్నింగ్ సర్! ఈ సూట్ కేసు లో ఫొటోలు, మ్యాపులు, అన్ని వివరాలు ఉన్నాయి అని అందించారు. వెరీ గుడ్. ఇవాళే అన్ని విషయాలూ మాట్లాడి ఫైనల్ చేస్తాను. మీరు మళ్ళీ ఈవెనింగ్ ఇక్కడే కలవండి. బై" అని కారెక్కి వెళ్ళిపోయాడు చైర్మన్.
*  *  *
"గుడ్ ఈవెనింగ్ కనిష్కా... బై ది బై  పొద్దున నేను వచ్చే ముందు ఏదైనా గొడవ జరిగిందా?" రాగానే ఆతృతగా అడిగాడు ఇస్రో చైర్మన్.  "ఎస్ సార్.. ఎవరో వ్యక్తి మమ్మల్ని ఫాలో అవుతున్నాడు గత రెండు రోజులుగా...అందుకే అర్మీ చీఫ్ సూచనలమేరకు ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని ఆయనకు చెప్పాము. ఆయన వాళ్ళ సుబేదార్ ను పంపి అతన్ని పట్టుకెళ్ళే ఏర్పాటు చేసాడు" అన్న కనిష్క మాటలకు చిన్నగా నవ్వాడు సతీష్ చంద్ర. "ఏమిటి సార్! మేము పొరబడ్డామా! తప్పు చేసామా అని అడగ్గానే.."మీరు చేసింది కరక్టే గానీ అతను ఎవరో తెలుసా?  పాకిస్థాన్ స్పై గా పనిచేసే ఇండియన్. మనకు వారి సైన్య రహస్యాలనూ.. వారి వ్యూహాలనూ... ఎప్పటికప్పుడు మనకు అందజేసే ఏజెంట్.  పేరు కరిముల్లా. గొప్ప దేశభక్తుడు. పుట్టింది భారతదేశం అయినా పాకిస్థాన్ వెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకున్నాడు. అక్కడే లా డిగ్రీ చదివి మొత్తానికి సైన్యం లో చేరి ఐదు సంవత్సరాలు అయింది.  పొయిన సంవత్సరం ప్రొమోషన్ కూడా తీసుకున్నాడు. మన ఇండియన్ గ్లోబల్ ఐ విషయం తెలుసుకు రమ్మని పాకిస్థాన్ అర్మీ చీఫ్ ఇతన్ని పంపారు. అతను ఏ ప్రదేశం లో కనబడ్డా మీరు ఏమీ మాట్లాడకుండా మీపని కొనసాగించుకోండి. నాకు ఇవన్నీ పీ.ఎం గారు ఇవాళ చెప్పారు.  ఈ విషయం సీక్రెట్ గా ఉంచండి. గుడ్ న్యూస్ ఏమిటంటే  పీ.ఎం   మన ప్లాన్ ఓకే చేసారు. మీరు టవర్ నిర్మాణం లో ఉండండి. మనం అనుకున్న విధంగా రెండు నెలల్లో టవర్ నిర్మాణం మిస్సైల్ లాంచింగ్ స్టేషన్ రెండూ నిర్మాణం అవ్వాలి.   మీడియా వారికిగానీ పత్రికా విలేకర్లు గానీ అడిగితే ఏమీ చెప్పకండి. శ్యాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ నిర్మాణంలో ఉంది అని చెప్పండి అంతే.  జాగ్రత్త కొత్త వ్యక్తులను నమ్మి పని అప్పజెప్పకండి అని ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళిపోయారు చైర్మన్.
*  *  *
"గుడ్ మార్నింగ్ సర్!" సెల్యూట్ చేసి నిలబడ్డాడు కరిముల్లా ఆర్మీ చీఫ్ ఎదురుగా. "బోలో కరిముల్లా భాయి! క్యా హో రహా హై ఉదర్?" "సర్!  వాళ్ళు వాతావరణ పరిశోధనాశాల నిర్మిస్తున్నారు. మంచు తుఫాన్లూ అవీ వస్తే ముందే పసిగట్ట వచ్చునట!" అనగానే..  " ఈ "అట",  "అంట" అనే పదాలే నాకు నచ్చవ్! నువ్వు గమనించావా! ఎవరైనా చెప్పారా?" అనగానే.. "సర్ అక్కడ పనిచేసే ఒక ఇంజినీర్ ను కలిసాను. ఆయనకు ఇండియన్ కరెన్సీ ఏభై వేలు ఇచ్చాను." అనగానే.. "వెరీ గుడ్ కరిముల్లా..దీన్ని ఒక రిపోర్టు లాగా రాసివ్వు లేకపోతే మన ప్రెసిడెంట్ నమ్మడు." "అలాగే సార్! నేను మరి కొద్ది రోజులు  ఇంకా వాళ్ళను గమనించాలనుకుంటున్నాను.  ఇది ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే. ఫైనల్ గా మీకు ఒక 10 రోజుల్లో ఇస్తాను.  ఐ వాంట్ పర్మిషన్ సర్. " అలాగే.. రిపోర్ట్ రాసి నా  టేబుల్ పై పెట్టి వెళ్ళు. "ఎస్ సార్" అని నిష్క్రమించాడు కరిముల్లా.  ఆర్మీ చీఫ్ ఈ విషయాన్ని పూర్తిగా విశ్వసించాడని భావిస్తే పప్పులో కాలేసినట్టే!   (సశేషం)
*  *  *

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top