దిగ జారుడు - అచ్చంగా తెలుగు

 దిగ జారుడు

 (మినీ కథ)


రచన : బుద్ధవరపు కామేశ్వరరావు 

హైదరాబాద్ 




 ఆ రోజు ఉదయం వంటికి కొబ్బరి నూనె రాసుకుంటూ, వంటింట్లో కబుర్లు చెబుతూ తిరుగుతూ భార్య తలుపులమ్మ బుర్ర తినేస్తున్నాడు, భర్త తికమక రావు. ఆ కబుర్లు వింటూ ఏదో పని చేసుకుంటున్న తలుపులమ్మ హఠాత్తుగా కళ్లు తిరిగి కింద పడిపోయింది.


వెంటనే  ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు తలుపులమ్మ ఇంటికి చేరుకుని, తికమక రావుకు తెలిసిన, డాక్టర్ అయోమయాన్ని పిలుచుకుని వచ్చారు.


తలుపులమ్మ చెవి, మెడ, కాలు, చెయ్యి పరిశీలించి "నాకు ఓ డెబ్బై రెండు గంటలు సమయం ఇవ్వండి. తలుపులమ్మకు వచ్చిన తెగులు ఏమిటో పరిశోధన చేసి చెబుతా!" వారిచ్చిన ఫీజు జేబులో కుక్కుకొని చెప్పాడు  డాక్టర్ అయోమయం.


డాక్టర్ అయోమయం అలా వెళ్లగానే, చుట్టు పక్కల ఉండే అమ్మలక్కలు, నాన్నలన్నలు  "ఒరే తికమకా! నువ్వా ఓ అమాయకుడివి! రేపటి రోజున ఒకవేళ తలుపులమ్మ పరిస్థితి కానీ తేడా కొడితే మరి రేపటి నుంచి ఏమిటి నీ పరిస్థితి?" బాధగా అడిగారు. 


"ఏం చేస్తాం. నాకూ దానికీ ఇంత వరకే ప్రాప్తం అనుకొని సంతృప్తి పడి, రేపటి నుండి వంట వండుకోవడం ఎలాగో నేర్చుకుంటాను"  నిర్లిప్తంగా చెప్పాడు తికమక రావు.


అప్పుడే స్ప్రహలోకి వచ్చిన తలుపులమ్మ , "వంటికి రాసుకున్న కొబ్బరి నూనెతో వంటిల్లంతా కలతిరిగేసి, అక్కడ నేను జారిపడితే కనీసం సానుభూతి కూడా చూపకుండా, వంట చేయడం ఎలాగో నేర్చుకుంటా అంటావా? వంట???........" అంటూ పళ్లు పిండుకుంటూ చెబుతున్న మాటలు వింటూ బిక్కుబిక్కు మంటూ ఉండిపోయాడు తికమక రావు.


     *శుభం*        

No comments:

Post a Comment

Pages