భగవంతుడికి...భక్తుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికర సంభాషణ - అచ్చంగా తెలుగు

భగవంతుడికి...భక్తుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికర సంభాషణ

Share This

 భగవంతుడికి.భక్తుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికర సంభాషణ.

(పూర్తిగా ఊహాజనితమే) 

అంబడిపూడి శ్యామసుందర రావు 




చదివినాక జీవితం పట్ల మీ ఆలోచనలు మీ జీవిత దృక్కోణమే మారిపోతాయి ఒక రోజు ఒక భక్తుడు దేవుడి ముందు కూర్చుని ఈ రోజు నీవు ఎందుకు స్వామీ నాకు చాల ఇబ్బందులు కలుగజేసావు నాకే ఎందుకు అలా జరగాలి రోజు నిన్ను పూజించనిదే బయటకు వెళ్ళాను ఏ పని చేయను అని ఆ భక్తుడు భగవంతుడితో తన భాధను చెప్పుకున్నాడు విన్న భగవంతుడు ఏమైంది నా వల్ల  నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని ప్రశాంతంగా అడిగాడు ఏమి తెలియనట్లు అడుగుతున్నావేమి స్వామి ఆఫీసు లో పని ఉందని పడుకోబోయే ముందు అలారం పెట్టుకొని పడుకుంటే ఆ అలారం మోగలేదు దాంతో లెట్ గాలేచి ఆఫీస్ కు ఆలస్యంగా వెళ్ళాను  ఓహ్ అంతేనా అని భగవంతుడు అంటాడు ఇంకా ఉంది స్వామి నా మోటార్ సైకిల్ మొరాయించింది దాంతో ఇంకా ఒత్తిడి పెరిగింది. అంతేనా ఇంకా ఏమైనా ఉందా అని భగవంతుడు అంటే ఇంకా ఉంది స్వామి ఆఫీస్ కు ఆలస్యంగా వెళ్లడం వల్ల మధ్యాన్నం భోజనానికి ఆలస్యంగా మెస్ కు వెళ్లాల్సి వచ్చింది నేను వెళ్లే టైమ్ కు భోజనాలు అయిపోయినాయి నేను ఖాళీ కడుపుతో ఉండాల్సి వచ్చింది 

అంతేనా ఇంకా ఏమైనా ఉందా? అని భగవంతుడు భక్తుడిని అడుగుతాడు ఆ భక్తుడు తన బాధలను కంటిన్యూ చేస్తాడు ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వస్తుండగా ఫోన్ మాట్లాడుతూ ఉండగా   దారిలోనే ఫోన్ సడన్ గా కట్ అయిపోతుంది కారణం ఫోన్ ఛార్జింగ్ పూర్తిగా అయిపోతుంది ఇవన్నీ ఏమిటి స్వామి ? అప్పుడు భగవంతుడు నీ సమస్యలు అన్ని అయిపోయాయా  ఇంకా ఏమైనా ఉన్నాయా. అని అడుగుతాడు  అసలు సమస్య అప్పుడే మొదలైంది స్వామి బాగా అలిసిపోయి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటూ ఉంటె అప్పుడే ఫ్యాన్ ,ఏసీ రెండు పనిచేయడం మానేశాయి. ఎందుకు స్వామి నామీద ఇంత కక్ష్య అని తన భాధను అంతా దేవుడి ముందు వెళ్లగక్కాడు. 

సరే నీవు చెప్పడం అయింది కదా నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ అలారం మోగితే నీవు నిద్రలేచి స్నానానికి బాత్ రూమ్ కు వెళ్ళేవాడివి ఆ టైం లో అక్కడ ఒక నల్ల త్రాచు ఉంది అది వెళ్ళిపోయాక నీవు లేవాలని నేను అలారం ను మొగనివ్వలేదు నీ మోటార్ సైకిల్ మొరాయించకుండా సరిగా టైం కు బయల్దేరి ఉంటె ఒక త్రాగు బోతు నడుపుతున్న ట్రక్కు క్రింద పడేవాడివి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.ఇంకా భోజనం సంగతి అంటావా నీవు వెళ్లిన సమయానికి అక్కడ వంట వాళ్ళు సాంబార్ లో బల్లిని గమనించి మొత్తం సాంబార్ ను బయట పారబోశారు ఆ ;పాత్రను కడిగి మళ్ళీ సాంబార్ తయారు చేసి వడ్డించడం వల్ల లేట్ అయింది  నీతో ఫోను మాట్లాడుతున్న వ్యక్తి మీ బాస్ దగ్గర నీ పరువు తీయాలనుకున్నాడు. ఆ ఫోను. ఆ క్షణంలో ఫోను బ్యాటరీ అయిపోవడం వల్ల వాడు నిన్నేమీ చేయలేకపోయాడు.చివరిగా...ఫ్యాను, ఏ.సి. అంటావా... అవి ఆన్ చేసినట్లయితే షార్ట్ సర్క్యుట్ జరిగి.. ఆ రాత్రంతా నువ్వు చీకట్లో గడపాల్సి వచ్చేది. అవసరమంటావా...చెప్పు ?

స్వామి నా అజ్ఞానాన్ని మన్నించు ఇన్ని చేసి నీవు నన్ను కాపాడావు నిన్ను అర్ధం చేసుకోలేక నిన్ను తొందరలో నిందించాను,క్షమించు స్వామి అని భక్తుడు అంటే భగవంతుడు క్షమాపణ అడగడం కాదు నన్ను పూర్తిగా నమ్మడం నేర్చుకో, ఏమి జరిగినా మన మంచికే అన్న భావన పెంచుకో నీవు ఎన్ని అనుకున్న నీకు మంచి జరిగే అత్యుత్తమ పనిని నీకు సిద్ధంగా ఉంచుతాను నన్ను నమ్మడం అలవాటు చేసుకో జీవితం సుఖంగా సాగుతుంది. అని దేవుడు మాయమవుతాడు 

No comments:

Post a Comment

Pages