శివం -140 - అచ్చంగా తెలుగు

 శివం -140

(శివుడే చెబుతున్న కథలు)




నేను అనగా శివుడు 


( కార్తికేయుడు సమాధి స్థితిలో ఉండి త్రిమూర్తులు త్రిమాతలకి కథలు చెబుతూ , అందులో  కుండన్న కథ  ఆ కథ లో తల్లి  కొడుకుల సుదీర్ఘ  నిరీక్షణ తర్వాత ఎలా శివలీల పరంగా కలుసుకున్నారు, శివునికోసం కుండన్న తన తల్లి ఎలా ఎదురుచూస్తున్నారు, హరసిద్ధుడికి వచ్చిన కల కథలో భాగంగా చెప్పుకున్నాం) 

కార్తికేయుడు కథ చెబుతున్నాడు 
{
" ఆ తల్లికి ఈ బిడ్డకి అనుబంధం అజరామరంగా స్థిరపడిపోయింది, ఆ భగవంతుడు దయ ఉంటే నెరవేరంది ఏముంది , తప్పిపోయిన బిడ్డని తల్లిని సూది మోన అంతా సూక్ష్మంగా ఆ భగవంతుడు కలపగలడు. అదే కదా భగవంతుని లీల. ఎప్పుడో చిన్నప్పుడు తప్పి  పోయిన తల్లి సాక్షాత్తు తన కొడుకు దగ్గరికి జీవనోపాధి కోసం వెతుకుతూ రావడం ఏంటి  ? సరిగ్గా అప్పుడే కుండన్న కి శివుడు ప్రత్యక్షమవడం ఏమిటి , అంతా మహాదేవుని సంకల్పం ..

కుండన్న " మహాదేవుడు మనిద్దరం కాసేపు మాట్లాడుకోవాలని తాను రావట్లేదా ? "

తల్లి " ఒక పని చెయ్ నాయన ! నీవు మరొక మాట చెప్తున్నా ఒకసారి వెళ్లి ఆ మహాదేవుని పిలుచుకొని రా నేను ఇక్కడున్న ఉద్యానవనంలోని పూలు పండ్లు"

కుండన్న " అలాగే లోపల ఉన్న పాలు "

తల్లి " అవి కూడా సిద్ధం చేస్తాను ఎవరైనా ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకుంటారు మనం ఆ రుద్రుడికే అభిషేకం ప్రత్యక్షంగా చేద్దాం " 


కుండన్న " అమ్మ ఆ శివయ్యకి వేటితో అభిషేకం చేయాలో అవన్నీ సిద్ధంగా ఉన్నాయి ఆయన రావటమే ఆలస్యం మనము నువ్వు అనుకున్నట్లు చేద్దాము " 

తల్లి " నువ్వు వెళ్లి చూసి రా నాయన చాలా సంవత్సరాలు తర్వాత కనబడ్డ బిడ్డను చూసిన ఆనందం తోపాటు సాక్షాత్తు ఆ మహాదేవుని చూడగలుగుతున్నాను ఆనందం కూడా నా మనసులో పదిలమై మనసు ఉప్పొంగిపోతుంది " 

కుండన్న " అలాగేనమ్మా ! నీకోసం ఆ మహాదేవుని పిలుచుకు వస్తాను" 

అంటూ బయలుదేరపోయాడు .


ఎదుటి గా హోరగాలి, ఆకాశం నిర్మలంగా ప్రకాశిస్తుంది, సూర్యుడు తేజస్సు వర్చస్సు ఎక్కడో ఒకచోట ప్రస్ఫుటమవుతుంది , ప్రకృతి అంతా ఒక ఆనందకరమైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది, మబ్బు పట్టి గాలిలో మట్టి వాసన వస్తుంది, 
డమరుక ధ్వనులు అంతర్లింగా తల్లి కొడుకులు ఇద్దరికీ వినిపిస్తూ ఉన్నాయి , దూరం నుంచి ఒక కాంతిపుంజం కనిపిస్తుంది ఆ తల్లికి 

  కుండన్న "అమ్మ అదిగో చూశావా ఆ శివయ్య వస్తున్నాడు ఇందాక కొలను  లో ఆయనకు స్నానం చేయించాను, మీ అమ్మ వస్తుంది వెళ్ళు నేను కాసేపట్లో వస్తానని చెప్పాడు కదా మహాదేవుడు తప్పక మాట మీద నిలబడతాడు ఇక్కడికి వస్తున్నాడు "
ఆ తల్లికి ఆనందభాష్పాలు గలగల రాలుతున్నాయి, 
పాపమా తల్లికి తన బిడ్డని తన నుంచి వేరు చేశానని కోపం లేదు. కేవలం నన్ను దూరం నుంచి కాకుండా అతి సూక్ష్మంగా దగ్గర నుండి చూస్తానని ఒక ఆనందం తప్ప.. అంటున్నాడు కార్తికేయుడు తన కథలో 

శివుడు వస్తూ ఉండగా అక్కడ ఉన్న వృక్షములన్నీ వాటికి ఎంతటి అవే వందనం చేస్తున్నాయి 

ఆ తల్లి కొంగుని తన భుజాన వేసుకొని నాకు స్వాగతం చెప్పడానికి  నుంచోనే ఉంది. 

ఆ బిడ్డ "అమ్మ అదిగో మా శివుడు వస్తున్నాడు చూడు , నువ్వేమన్నా నేను బ్రమ తో మాట్లాడి ఉంటానని అనుకోని ఉంటావు , అదిగో దూరంగా కనబడుతున్నాడా " అని అడుగుతున్నాడు

దగ్గర దగ్గరగా దగ్గరగా మహాదేవుడు వస్తున్నాడు 
అక్కడున్న ఆ ఇరువురి మనసు ఎంతో ప్రశాంతతకి లోనయ్యింది ,. అడుగు అడుగు దగ్గర పడేకొద్దీ ఆ తల్లి ఆనందభాష్పాలతో రెండు చేతులు జడించి తట్టుకోలేని ఆనందంతో మోకాలు పైన కూర్చునీ "ఇన్ని ఇన్ని జన్మలు కష్టపడింది ఈ ఒక్క నిమిషం కోసమే కదా స్వామి" అంటూ తన బిడ్డవైపు ఎంతటి గొప్పవాడు అయ్యాడు నా బిడ్డ అనే చూపు చూస్తూ కనులారపకుండా ఇప్పుడు ఆ వైపే చూస్తుంది "

కుండన్న " చూసావా అమ్మ మా మహాదేవుడు మా స్నేహితుడు నా కోసం చెప్పినట్టు వచ్చాడు "

శివుడు " అవును నీ కోసమే వచ్చాను మీ అమ్మకి నువ్వు చెప్పినట్టు నేను నీకు స్నేహితుడు లాగానే వచ్చా , " 

ఆ తల్లి పరుగున వెళ్లి  పూలు తీసుకువచ్చి 
ఎదురుగా శివుడు దగ్గరికి ఎంతో ఆనంద గా వచ్చి శివుని పాదాలు పట్టుకుని ఎన్నాళ్ళకి కనపడ్డావు తండ్రి నిన్ను ప్రత్యక్షంగా చూస్తానని అనుకోలేదు అంటూ కాళ్లు పట్టుకొని ఆవిడ తల శివుడి పాదాల చెంత ఉంచి వ్యక్తి ఆనందంతో ఏడ్చింది," నా బిడ్డ వల్ల నాకు ఎటువంటి మేలు జరిగింది తండ్రి అంటూ తీవ్రమైన భావ అవేశం
తో ఒకటి భక్తితో మాట్లాడుతూనే ఉంది. 

శివుడు " లేమ్మా మీ పూజలు ఫలించాయి నీ బిడ్డ నీ దగ్గరికి చేరుకున్నాడు నీవు ఆనందంగా ఉండటం, నీ ఆనందం వల్ల నా స్నేహితుడు ఆనందంగా ఉండటం నాకు ఆనందమే " 

కు "స్వామి ! మీరు మా అమ్మకి కనపడటం నాకెంతో ఆనందంగా ఉంది " అంటూ మరో మారి తనకు నేను ఎలా దర్శనమిచ్చింది మొత్తం చెప్పాడు 

ఆ తల్లి తను తెచ్చిన వివిధ రకాలైన పువ్వులతో నాకు పాద పూజ చేస్తుంది.. 

శివుడు " ఏమయ్యా నన్ను పిలుచుకొని రమ్మంటే నువ్వు మీ అమ్మ దగ్గర నుంచి కదలకుండా ఉంటావా నువ్వు ఏమైనా స్నేహానికి విలువ ఇచ్చిే వాడివేనా"
 
కుండన్న " అదేంటి ప్రభువా ! తమరే కదా మీ అమ్మ దగ్గరికి వెళ్ళమని పంపించారు గుర్తులు కూడా చెప్పారు కదా "

శివుడు " ఓహో అంటే మీ అమ్మ నన్ను పిలుచుకు రమ్మని చెప్పినా కూడా నువ్వు మీ అమ్మని ఎక్కడ వదిలేసి రావాల్సి వస్తుందేమో అని ఆయనే వస్తాడులే అనుకుంటూ కూర్చున్న మాట నిజం కాదా" 

కు " అది అది మహాదేవ" అంటూ నసి గాడు

శివుడు " చూసావా తల్లి మీ బిడ్డ ఎంత స్వార్ధపడు అయ్యాడో అని "ఫిర్యాదు లాగా చెప్పాను 

ఆ తల్లికి మాత్రం మా ఇద్దరి జగడం చూసి బహుముచ్చటగా ఉంది ఇటువంటి పుణ్యాత్ముండా నేను కంది అని తన బిడ్డ మొహం వైపు చూసి రెండు చేతులతో దిష్టి తీసుకుంది .. 

కు " మరి మహాదేవ ! దయవుంచి మాది ఒక చిన్న అభ్యర్థన ఉంది మా అమ్మ తరపున నా తరపున ఈ స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నానని తను కూడా నా పాదాల మీద పడ్డాడు  "


శివుడు" నేను నీలా కాదయ్యా! చెప్పు నీ అభ్యర్థులను మన్నిస్తాను ! "

కు " స్వామి నేను మా అమ్మ ఇద్దరం తమకు అభిషేకం చేసుకుంటాను దయచేసి అనుమతి ఇవ్వండి స్వామి"

శివుడు " అలాగే"
తనకి ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాను అక్కడ నన్ను కూర్చోబెట్టి అన్ని రకాల అభిషేక ద్రవ్యములతో అభిషేకం చేసి వారు తీవ్రమైన ఆత్మసంతృప్తి పొందారు ..

తల్లి "మహాదేవ జరిగిందంతా కలకన్నా ఎంతో మధురంగా ఉంది కాసేపటి క్రితమే నా బిడ్డ నాకు కనపడటం ఈ లోపు జన్మ సార్థకతమైన మీ దర్శనం నాకు లభించటం ఎంతో ఆనందంగా ఉంది తండ్రి" 

శివుడు " నాకు మీ అభిషేకం వల్ల ఎంతో ప్రీతికరంగా ఉన్నది మీరు అనుకున్న విధంగా మీరు ఎంత కాలం దూరంగా ఉన్నారో అంత కాలముని మీ ఇరువురి ఆయుషుల పొడిగించి  సుఖంగా ఉండే విధంగా దీవిస్తున్నాను  "


 కుండన్న " ధన్యవాదాలు ప్రభువా ! అడక్కుండానే వరమిచ్చిన దేవుడు నీవని మరొకసారి నిరూపించుకున్న దయచేసి మాలాంటి చిన్ని ప్రాణాలని కఠిన పరీక్షలతో బాధపెట్టవద్దయ్య నువ్వు పెట్టే పరీక్షకు తట్టుకునేంత ప్రాణం కాదు మాది ఏదో అలా బతకాలి కాబట్టి అనుభవిస్తున్నాం కానీ లేకపోతే మేము చాలా కొద్ది వారం అయ్యా దయచేస అర్థం చేసుకో "

శివుడు"  నా స్నేహితుడు  కుండలే కాదు   కాదు వేదాంతం కూడా బాగా తయారు చేస్తున్నాడు"

మా ఇరువురి సంభాషణ చూసి ఆ తల్లి ఎంతో ఆనందపడుతుంది 

శివుడు " సరేనమ్మా ! నీ బిడ్డకు నువ్వు ఏ పేరు పెట్టావో ఒకసారి చెప్పు "

కు " అవునమ్మా అడగడం మర్చిపోయా నా పేరు ఏమిటి నా అసలు పూర్తి పేరు ఏమిటి"

తల్లి " చంద్రశేఖర ప్రభు "

శివుడు " ఆహా నా పేరే అన్నమాట అద్భుతం " 

తల్లి " ఏది నీ పేరు కాదయ్యా! శివయ్య నువ్వు ఇక్కడే ఉంటే నేను సామాన్య మనుషులకి చేసినట్టు మంచి భోజనాన్ని చేసి నీకు నా బిడ్డకి పట్టించాలని ఎంతో మనసులో కోరికగా ఉంది దయచేసి ఈ కోరిక తీర్చు స్వామి "

కు " అడగాల్సిన పని ఏమిటమ్మా నా స్నేహితుడు మహాదేవుల వారు మన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించకుండా వెళతారా ఏమిటి ? "


శివుడు "  అయితే నా కోరిక తీరుస్తావా "


 కుండన్న "ఏమిటది?" 

}

No comments:

Post a Comment

Pages