శివం-134 - అచ్చంగా తెలుగు

                                                                               శివం-134 

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్




కార్తికేయుడు కథ చెబుతున్నాడు 


కథలో భాగంగా కుండన్న కథ చెబుతున్నాడు.. కుండన్న కథలోని నాకు నులుగు పెట్టి స్నానము చేయించిన తర్వాత  వరం కింద తనకి తన అమ్మ కావాలని కోరుకుంటాడు .. తన అమ్మ బతికే ఉందని తన కోసమే ఇప్పుడు వస్తుందని చెప్పటంతో నిజంగా ఒక స్త్రీ మూర్తి రావటం , ఆమెకు కూడా మోచేయి దగ్గర తనకున్నట్లే మచ్చ ఉందని చెప్పటం.. అది చూసి కుండన్న తన తల్లిని గుర్తుపట్టటం.. తరవాత కథ)

నేను అనగా శివుడు 


నేను త్రిమాతలు బ్రహ్మదేవుడు విష్ణు దేవుడు కథని చాలా ఆసక్తిగా వింటున్నాము.. కదా భక్తి రసం నుండి.. తల్లి యొక్క సన్నివేశాలు అతను చిత్రీకరించిన తీరు అమోఘంగా ఉంది. కథ ఏం చెప్తున్నాడు వింటున్నాము మీరు కూడా అక్కడ చక్కగా వినండి 

{

కుండన్న " అమ్మ అమ్మ " ఏడుస్తున్నాడు 

స్త్రీ మూర్తి "  బాబు నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో , కానీ నీ వాత్సల్యం నన్ను కట్టిపడేస్తుంది.. దయచేసి నా జీవనం గడవడానికి నాకు కొంత సరుకు ఇవ్వు నాయనా " అని ప్రేమతో కూడిన దీనమైన మాట మాట్లాడుతుంది 

కు " అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె ఒడిలో  తల పెట్టి సేద తీరుతున్నాడు " 

అమ్మ "  నాయన! నా బిడ్డ చిన్నప్పుడు తప్పిపోయాడు .. అతడి పెద్దయి ఉంటే నీ అంత ఉండేవాడు.. నువ్వు అమ్మ అని పిలుస్తుంటే చిన్నప్పుడు తప్పిపోయిన నా బిడ్డ ఏడ్చినట్లు తన స్వరమే గుర్తుకువస్తుంది " 

కు " ఉ..." అంటూ నెలల పిల్లలు ఉక్క పట్టి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు వల్ల ఏమీ మాట్లాడలేకపోతున్నాడు 

అమ్మ " బాబు కొంచెం నువ్వు మంచి మనసు చేసుకొని కొద్దిగా సరుకు ఇవ్వవయ్యా జీవనం గడవటం మూడు పూటలా అన్నం తినటం కూడా నాకు కష్టంగా ఉంది " 

కు " అమ్మ అమ్మ అంటూ ఆమె పాదాల పైన చేతులు పెట్టి తన కన్నీళ్లు ఆమె పాదాల మీద పడేటట్లు ఏడుస్తున్నాడు " 

అమ్మ "ఏమైంది నాయన నీకేమన్నా గుర్తుకు వచ్చిందా , బహుశా మీ బంధువులలో ఎవరైనా నా లాగా ఉన్నారా? " 

కు " అమ్మ అమ్మ " అని అంటున్నాడు 

అమ్మ " నాయన నీ తల్లిలా కనపడితే అట్లనే భావించి నాకు మాత్రం డబ్బు ఇస్తేనే సరికిస్తానని మాత్రం అనవద్దయ్యా.. ప్రపంచంలో మనం ఎవరిని ఎట్లా నమ్మిన వారు మాత్రం ధనానికే ముగ్గు చూపుతారు. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి మనుషులతో పడి పడి ఈ వేదన తో కూడిన మాటలు అంటున్నాను "

కు " సరుకు తో పని ఏముంది అమ్మ ఇదంతా నీదే"

అమ్మ " నాయనా చిన్నప్పుడు తప్పిపోయిన నా బిడ్డని వెతుకుతూ ప్రతి ఊరు తిరుగుతూ తిరుగుతూ అక్కడ శివాలయ సత్రాల్లో బసచేస్తూ నా బిడ్డ కనబడతాడు అనే ఆశతో ఎదురుచూసి చూసి 
ఒంట్లో ఓపిక నశించి.. ఇక ఈ ఊరి శివాలయం దగ్గర చిన్న అంగడి పెట్టుకుని నా శేష జీవితాన్ని 
గడుపుదామని నిర్ణయించుకున్నాను అందుకే చిన్న పని కోసం నీ దగ్గరికి వచ్చానయ్యా.. ఎవరిని వాకబు చేసినా అందరూ నీ గురించి మంచిగా చెప్పారు.."

కు " అమ్మ నీ తప్పిపోయిన బిడ్డ ఎవరో కాదమ్మా అది నేనే కావాలంటే చూడు నీ మోచేకి నా చెయ్యికి గుర్తు అని " చూపించాడు 

అమ్మ " బాబు ఏమిటి నువ్వు చెప్పేది.."అంటూ తన మో చేయి తన బిడ్డ మో చెయ్యి మీద దేవుడు ఒకటే గుర్తిచ్చాడని చిన్నప్పుడు తన బిడ్డని లాలించిన ముద్దు ముద్దు సన్నివేశాలు తనకి గుర్తు రాసాగాయి

కు " ఇప్పుడు అర్థమైందా అమ్మ నువ్వే మా అమ్మవని అందుకే నిన్ను చూసిన ఆనందం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నాను "

అమ్మ " బాబు నాయనా అంటూ " ఇన్నేళ్ళకి  దొరికా వయ్యా ! అంటూ తను కూడా పూర్తిగా కన్నీరు పెట్టుకుంటుంది..

అమ్మ " ఏ ఊరిలో అయిన కనపడని దేవుడికి కూడా నీకోసం  మొక్కు కన్నది  ప్రతిదీ నాకు అవగతమే.. ఏ శివాలయంలో నిద్ర చేసిన.. ఏ దేవుడిని దర్శించుకున్న ఎప్పుడూ ఎల్లప్పుడూ నువ్వు క్షేమంగా ఉండాలి నిన్ను మళ్ళీ కలవాలనే భగవంతుని ఎప్పుడు కోరుకున్న నయానా "

కు " అవునమ్మా నీ కోరిక ఫలించింది నేను నిరీక్షణ ఫలించింది..!"

అమ్మ " పాపిష్టి దాన్ని భగవంతుడిని తిట్టుకున్నాను కూడా  బాబు , నా బిడ్డను నా దగ్గరికి చేర్చవా నేను నీకు ఏమన్యాయం చేశా ఎందుకు ప్రారబ్దం అని నన్ను ఏడిపిస్తావు అని , ఎన్నోసార్లు ఆ దేవుని దూషించాను"

కు " అమ్మ కనీసం నేను తప్పిపోయాను అని తెల్సునీకు..
నాకు ఎవరు తెలియదమ్మా .. కుండ లుఅమ్ముకునే ఒక తాత నన్ను చూసి ఇక్కడిదాకా నా జీవితము ను తీసుకువచ్చాడు.. మన ఈ మధ్య ఆయన కాలం చేస్తూ,నేను వారికి దొరికినిది చెప్పబట్టే నా తల్లిదండ్రులు ఎవరని  ఆలోచన మొదలు పెట్టాను"

అమ్మ "  ఎన్ని కష్టాలు పడ్డావు తండ్రి"

కు "  నాది ఏముందమ్మా ! నేను నిజంగా ఆ తాతకి నిజమైన మనవడు అనుకొని తల్లిదండ్రులు లేరు అనుకోనీ బతికాను, కానీ నువ్వు ఎవరూ లేక ఎంత భారంతో జీవితాన్ని వెలదీసావ్ అమ్మ " 

అమ్మ " ఆ దేవుడు ఉన్నాడు నాయన! ఆలస్యంగా అయినా నా ప్రార్థన ను విన్నాడు" 

కు " ఉండటమేముందమ్మా.. నాకు మహాదేవుడే దర్శనం ఇచ్చాడు.. నాకు అమ్మ కావాలని వరుము కోరుకో గా మీ అమ్మే నీకోసం ఎదురు వస్తుంది వెళ్లి కుటీరంలో చూడు అని నన్ను పంపించి నేను వస్తున్నాను పదా అని చెప్పారు "

అమ్మ " ఏమిటయ్యా నువ్వు చెప్పేది నీకు శివుడు కనపడ్డాడా? "

కు " అవునమ్మా ఇప్పటివరకు ఆయనతోనే సరదాగా సంభాషణ చేసి , ఆయనకి అభ్యంగన స్నానం చేయించి.. సుగంధ ద్రవ్యాలు పూసి.. ఇటు వస్తున్నాను.. నువ్వు వచ్చావ్"

అమ్మ " నమ్మ లేకుండా ఉంది ! శివుని చూసే పుణ్యాత్ముని నేను కన్నానా! "అంటూ చేతులతో దండం పెట్టి ఆమె ఒళ్ళు జలదరించింది 

కు " ఉండమ్మా ఆయన ఇక్కడికి వస్తున్నారు నువ్వు కూడా మాట్లాడదు గాని "

అమ్మ" ఎన్నో వేల శివాలయాలు దర్శించాను, పుణ్యమంతా నీకు వచ్చిందయ్యా .
అందుకే ఆ శివయ్య నీకు కనపడ్డాడు 
. కనపడటమే కాకుండా నీతో  పరాచకాలాడుతూ, ప్రత్యక్ష అభిషేకం చేసుకున్నావ్, ఎంత పుణ్యాత్ముడివయ్యా, నిన్ను కన్న నా జన్మ తరించింది 

కు " అమ్మ అదంతా నీ వల్లేనమ్మా.. నాకు తెలిసి నేను ఏ రోజు పెద్దగా ఎటువంటి పూజ నేను చేయలేదు. నువ్వు చేసిన పూజ ఫలితమే నాకు వచ్చిందమ్మా , అందుకే మహాదేవుడు నువ్వు ఒకేసారి నా దగ్గరికి వచ్చారు " అంటూ .. మట్టితో నన్ను చేద్దామనుకున్న కథంతా చెప్పి నా దర్శనం వరకు జరిగింది అతా చెప్పాడు

అమ్మ " నాయనా ఇక్కడికి మహాదేవుడు వస్తాడా వస్తే నాకు కనపడతాడా "

కు " ఎందుకు కనపడడు.. సాక్షాత్తు మహాదేవుడు నా స్నేహితుడు నేను చెప్తే వినకుండా ఉంటాడా ,వింటాడు

అమ్మ " ఎంత గొప్ప మాటలు చెప్పావయ్య మహాదేవుడు నీ స్నేహితుడా అబ్బా "అంటూ ఆనందభాష్పాలు రాల్చింది 

కు " అమ్మ మరి నేను ఆయన ఏమి అడిగాను తెలుసా.. నువ్వు ఇక్కడే ఉండిపో మనిద్దరం కలిసి హాయిగా ఈ కుటీరంలో ఉందాము నీకు ఎటువంటి సేవలు అయినా చేస్తాను స్వామి "అని 

అమ్మ " చాలు నాయనా మహా భక్తుల జీవితాలు కూడా ఇలాంటి సన్నివేశాలు జరగవు " 

కు " ఏమిటి ఇంకా మహాదేవుడు రాలేదు మనము వచ్చి చాలా సేపు అయింది " అంటూ దిక్కులు చూస్తున్నాడు 

అమ్మ " నాకు మహాదేవుడు దర్శనం చేయిస్తావా "

కు " స్వామి రానీవ్వు అమ్మ " 

అమ్మ " నిన్ను కన్నందుకు నాకు ఎంత అదృష్టం పట్టింది తండ్రి కొన్నిసార్లు మాయదారి దేవుడని నువ్వు కనపడబోయేసరికి తిట్టుకున్నాను అని చెప్పాను కదా.. దానికి క్షమాపణలు కూడా కోరుకోవాలి" 

కు " నిన్ను క్షమిస్తాడమ్మా ! నా స్నేహితుడు నా మాట కాదని ఏ పని చేయడు " 

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages