శ్రీథరమాధురి - 141
(పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
'జగన్మాత అన్నపూర్ణి' నివసించే ప్రదేశంగా వంటింటిని భావిస్తారు.
నిజానికి
ఒకరు వండేదంతా ఆవిడ పర్యవేక్షణలో దైవానికి తయారు చేసే ప్రసాదం.
ఒకరు
వంటింట్లో వంటను చేసినప్పుడు అతను లేక ఆమె, హృదయం నిండా ప్రేమతో, ఆనందకర స్థితిలో
ఉండాలి.వండేవారు వంటను 'మాతా అన్నపూర్ణేశ్వరి' పర్యవేక్షణలో వంటింట్లో వండుతారు.
కృంగిపోయిన
మనసుతో ఒకరు వంటింట్లోకి ప్రవేశించకూడదు. మానసికంగా స్థిరత్వం లేనప్పుడు అతను లేక
ఆమె ఆ రోజు ప్రతికూలతతో వంటింట్లోకి ప్రవేశించకూడదు.
ఆహారాన్ని
అన్నం అంటారు 'అన్నం న నిందయాత్
ప్రణోవా అన్నం'.
'నిందయాత్' అంటే అగౌరవించడం. సరైన సువాసన, రుచి, వస్తువులు లేకుండా
ఆహారాన్ని తయారు చేసి, తద్వారా ఆరోగ్యాన్ని
పాడు చేయడం కూడా ఆహారాన్ని అగౌరవించడమే.
ఒకరు వండేటప్పుడు అన్ని ఆలోచనలు, ఉద్వేగాలు అందులోకి ప్రవేశిస్తాయి.
కాబట్టి,
భగవంతుడికి సమర్పించే ఆహారం రుచితో సహా అన్ని అంశాల్లో సరిగ్గా ఉండాలి. అమితమైన
ప్రేమ, దయతో మంచి ఆహారాన్ని
వండినప్పుడు భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు.
ఒకరు
చిరాకుగా, పొగలు కక్కుతూ, అరుస్తూ ఉంటే, వంటగదిలో ఇతరులకు
ముఖాలు చూపిస్తూ ఉంటే, భగవంతుడు ప్రసాదాన్ని 'దెయ్యానికి' అందజేస్తాడు....
అప్పుడు ఇంట్లో అందరూ తినే ప్రసాదం దెయ్యానిది, దేవుడిది కాదు.
నెమ్మదిగా
గృహము కొంపగా మారుతుంది. ఆ ఇల్లు ప్రేమ,
దయ, మంచి సంకల్పం, కరుణ, బదులుగా కోపం, పగ, ప్రతీకారం, అసూయ, దురాశ మొదలైన వాటితో
నిండుతుంది.
భోజనం
వండడానికి వంటింట్లోకి ప్రవేశించినప్పుడు ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండండి. కోపం, పగతో వంటింట్లోకి ప్రవేశించకండి. అది యుద్ధ రంగం కాదు.
తెలుసుకోండి.




No comments:
Post a Comment