ఒకటైపోదామా ఊహల వాహినిలో -21
కొత్తపల్లి ఉదయబాబు
రెండు రోజులపాటు విరాజ్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానము
లేదు. కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు. ఫోన్ కూడా చెయ్యలేదు.హరిత చేసినా అతను లిఫ్ట్
చేయలేదు.
రెండోరోజు సాయంత్రం
డ్యూటీ నుంచి వచ్చాక తల్లితో అంది
హరిత.
" చూసావా అమ్మ! అతనికి నీ దగ్గరికి వచ్చి
మాట్లాడడానికి భయం. నా ముందు ఆ సమస్య పెట్టేసేసి అతను మాత్రం ప్రశాంతంగా
కూర్చున్నాడు." అంది ఉక్రోషంగా హరిత.
" అంటే అతను చేసిన సాయాలు మర్చిపోయి స్నేహం వదిలేయమంటావా? "
తాను అనుకోకుండా బెంగుళూరు బంగారు వర్తకుల సంఘం సమావేశానికి మూడు రోజులు పాటు వచ్చానని.. ఇంటికి వచ్చాక తప్పక వచ్చి కలుస్తాను అని విరాజ్ మెసేజ్ పెట్టాడు.
"కావచ్చు. ప్రశాంతంగా ఉన్న మనముందు సమస్యను పెట్టినవాడు అతనే కదా " అంది శకుంతల.
*****
నాలుగో రోజు ఉదయం దాని బెంగళూరు నుంచి వచ్చానని, సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తానని హరితకు మెసేజ్ చేశాడు విరాజ్.
ఆరోజు శుక్రవారం కావడంతో డ్యూటీ కి సెలవు పెట్టి, తలార స్నానం చేసి, ప్రశాంతమైన మనసుతో పూజ చేసుకుని ఇంట్లోనే ఉండిపోయింది హరిత.
శకుంతల మధ్యాహ్నం
సెలవు పెట్టి ఇంటికి వచ్చేసింది తొందరగానే.
అన్నట్టుగానే సాయంత్రం ఐదున్నర గంటలకు విరాజ్
వచ్చాడు.
అతని చూడగానే హరిత కళ్ళల్లో మెరిసిన మెరుపును క్షణంలో పట్టేసింది శకుంతల.
బెంగళూరులో ప్రసిద్ధి పొందిన పది రకాల స్వీట్లలో
గోధుమ పాల హల్వా, మైసూర్ పాక్
రెండు స్వీట్ ప్యాకెట్లు, మరొక పార్సిల్ తెచ్చి హరితకు ఇచ్చాడు.
"ముందుగా
మనమందరం స్వీట్ తిందాం ఆంటీ."
" స్వీట్ తిన్నాక మీకు హాట్ ఇష్టం కదా. మరి
హార్ట్ తేలేదా? " ఆ
ప్రయత్నంగా అడిగేసి నాలుక కరుచుకుంది
హరిత.
" ఇక్కడ నేను మీ ఇద్దరికీ సమాధానం చెప్పాలి. మనం
మాట్లాడుకునేది ఎలాగూ హాట్ టాపిక్కే. ఆ విధంగా హాట్ అక్కర్లేదు.
నీ చేతి పకోడీ చాలా బాగుంటుంది. చేయగలిగితే సంతోషం. అది హాటే కదా" అన్నాడు విరాజ్.
" మీ నాన్నగారు నిన్ను పై చదువులు చదివించకుండా
వ్యాపారంలోకి ఎందుకు దింపారో మీ లౌక్యం చూశాక అర్థమైంది నాకు" తేలికగా
నవ్వేస్తూ అంది శకుంతల.
ముగ్గురు స్వీట్ తిన్నారు.
" చాలా చాలా బాగున్నాయ్ స్వీట్స్. ఈ మధ్యకాలంలో
ఇంత రుచిగల స్వీట్ తినలేదు. "అంది
హరిత.
" ఇప్పుడు చెప్పండి ఆంటీ. మీరేం
అడగదలుచుకున్నారో మొహమాటంగా లేకుండా
అడగండి. నేను అంతే నిర్మొహమాటంగా మీకు సమాధానం చెబుతాను. నేను కోరేది ఒకటే.
పూర్తిగా విషయం అవగాహన అయ్యేంతవరకు ఎవ్వరము రియాక్ట్ అవ్వద్దు. "
అర్థమైందా అన్నట్టు శకుంతల హరిత కేసి చూసింది.
సరే అన్నట్టు కళ్ళతోనే సమాధానం ఇచ్చింది హరిత.
" మీ పెళ్లి కాకుండానే హరిత మీకు బిడ్డని కని
ఇవ్వాలి... ఆ తర్వాత కూడా మీ ప్రేమ తన పట్ల కొనసాగితే కనుక పెళ్లి చేసుకుంటాను
అన్నారట. అది నిజమేనా అని అడుగుదామని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. "
దానికి సమాధానంగా తన తండ్రి తనకు రాసిచ్చిన అగ్రిమెంట్ కాపీని శకుంతలకు ఇవ్వడానికి చేత్తో పట్టుకుని
తాను తన తండ్రి చేత ఆ అగ్రిమెంట్ రాయించాడో మొత్తం కథంతా వివరంగా చెప్పాడు.
అంతా విన్నాక
హరిత అతనికి చల్లని కిన్లే సోడా కలిపిన
' సుగంధి ' జ్యూస్ కలిపి పట్టుకొచ్చి ఇచ్చింది.
అప్పటికే విరాట్ తన చేతికి ఇచ్చిన అగ్రిమెంట్ కాగితాలను ఒకటికి మూడుసార్లు క్షుణ్ణంగా చదివింది శకుంతల.
" ఇప్పుడు నాకు అర్థమైంది. మీకున్న ఆడ
స్నేహితులతో మీరు ఎక్కడ తొందర పడతారో అని మీ నాన్నగారే మీకు గీసిన లక్ష్మణ రేఖ
అది.
ముందు మీరు నాకు రెండు విషయాలు స్పష్టం చేయాలి.
ఇంతకాలం హరిత కి మీకు మధ్య ఉన్నది కేవలం స్నేహం అనే
అనుకుంటున్నాను నేను. మీ దృష్టిలో అది స్నేహమా? ప్రేమ?
ఇక రెండవది.
మీరు మీ నాన్నగారి అగ్రిమెంట్ ప్రకారమే హరిత నుంచి నిజంగా మీకు కావాల్సిన
సమాధానం కోరుతున్నారా? లేదా మీకంటూ ఏమైనా ఒక అభిప్రాయం ఉందా? "
హరిత వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలోని ప్రతి అక్షరం చెవులు రిక్కించి వినసాగింది.
రెండు నిమిషాలు ఆగి అనంతరం నెమ్మదిగా సమాధానం చెప్పాడు విరాజ్.
" మీ పాదాల సాక్షిగా హరిత నేను మనస్ఫూర్తిగా
ప్రేమిస్తున్నాను ఆంటీ. ఏ లక్షణాలుగల అమ్మాయి నాకు భార్య అయితే బాగుంటుందో అవే
లక్షణాలతో కనిపించిన హరితని నేను మొదటి చూపులోనే ప్రేమించాను. ఆమె పట్ల నా ప్రేమ
చాలా కచ్చితమైనదని మీకు చెప్పగలను. ఎందుకంటే నేను బయట ఏ అమ్మాయిని చూసినా సరే ఆ
అమ్మాయిలో నాకు హరిత మొహమే కనిపిస్తుంది కనుక.
ఇక మీ రెండో ప్రశ్నకి సమాధానం. ఈ విషయంలో నేను చాలా సందిగ్ధంగా ఉన్నాను ఆంటీ. ఎందుకంటే మరోలా ఆలోచిస్తే నేను నాన్నకి ఇచ్చిన మాటని తప్పిన వాడిని అవుతాను. కానీ పెళ్లి కాకుండా హరితని నాతో బిడ్డని కనమని అడగడం అంత మహా పాపం ఈ ప్రపంచం లో మరొకటి లేదు అని నాకు తెలుసు. పైగా హరిత నేను ప్రేమించిన అమ్మాయి. కానీ నాన్నగారి నియమం ప్రకారం అడిగేసాను.ఈ సందిగ్ధంలో నా తల పగిలిపోతుంది ఆలోచనలతో. ఏం చేయాలో నాకు అర్థం కాకుండా ఉంది. " అన్నాడు విరాజ్.
" అలాంటప్పుడు మీ నాన్నగారికి తెలియకుండా మీరు హరితని ఏ గుళ్లోనో పెళ్లి చేసుకోండి. అప్పుడు బిడ్డని కని తీసుకువెళ్లి మీ నాన్నగారికి చూపించండి. మీ నాన్నగారి మాట మీరు తప్పినట్టు అవ్వదుగా. "
" కానీ పెళ్లి చేసుకోకుండా కనాలి అంటున్నాడే.
" మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా విరాజ్? మీ నాన్నగారు ఎగ్రిమెంట్ ని మీకు రాసిచ్చినా తనకు అనుకూలంగా రాయించుకున్నారు."
" అది ఎలా ఆంటీ ? "అర్థం కానట్టుగా అడిగాడు
విరాజ్.
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment