హై ‘క్లూ’ లు - అచ్చంగా తెలుగు
హై ‘క్లూ’ లు
                                                         -తరిగొప్పుల  విఎల్లెన్  మూర్తి

విత్తనం ఉనికిని
తట్టిలేపుతోంది
        చినుకు!!...   
                      
స్వాతిముత్యం ధన్యం !
ఆమె నాసికపై  -
‘ముక్కెర’య్యింది.!!

కళ్ళల్లో ‘వత్తు’లేసుకుని
ఆమె ఎదురుచూపు!
అతనొచ్చి ‘వెలుగి’స్తాడనీ...!!

ఎండలకి అన్నీ మోడులే -
వసంతగానం...
‘చెట్టె’క్కింది!!. 
చెరువు ఎండింది –
రైతు గుండె
‘చెరువైం’ది...!!

మృత్యువైనా-
మంచితనానికి
భృత్యువే.!!

నిద్రలోఅందంగా
నవ్వుతానట…
ఈసారి అద్దంలో చూడాలి!

ముహుర్తాలు మార్చారే-
పెళ్ళికూతురు చూసే
సీరియల్ టైమదే.!!!

ఒంటరిగాళ్ల
సమూహం
అపార్ట్ మెంట్!!...

మట్టికొట్టుకున్నవేళ్ళు
మనకందిస్తున్నాయి-
పూలూ పళ్ళు!!

No comments:

Post a Comment

Pages