శివం-130
(శివుడే చెబుతున్న కథలు)
రాజ కార్తీక్
దర్శకుని కథ 37
( కార్తికేయుడి సమాధి స్థితి కొనసాగుతుంది.. తను మమ్మల్ని చూసినా ఆనందంలో లో మాకు స్తోత్రం చేసి తీవ్రమైన భావావేశా స్థితిలో ఉండి మాకు సమాధానం చెబుతూ మేము లేచి ప్రణాళిక చెప్పమన్నా కూడా ఇంకా తన్మైత్వంలోనే ఉన్నాడు, ఇక్కడ ఉన్న మేము తమ పాత్రను ఎలా మలిచాడు ఉదాహరించుకుంటున్నాము)
నేను అనగా శివుడు..
నేను " ఏమయ్యా నేను ఎన్నిసార్లు తధాస్తు అన్నా కూడా నువ్వు ఇంకా మామూలు స్థితి లోకి రావట్లేదు
.."
విష్ణు దేవుడు " బావ ఆత్మయొక్క యదార్థ స్థితిలో ఉన్నాడు కదా కానీ కాస్త ఆనందాన్ని అనుభవించని"
బ్రహ్మదేవుడు " మాత పార్వతి దేవి! ఇందాక నుంచి మీరు ఏదో ఆలోచిస్తున్నారు ఏమై ఉంటుంది"
పార్వతి మాత " అది కాదు బ్రహ్మదేవా అది కాదు విష్ణుదేవా ఎంత గొప్పగా తను రాసినా కూడా, ఒకచోట అతను చేసిన రచనకి నా మనసు చలించిపోయింది "
నేను " ఏమిట ది"
పార్వతీ మాత " ఈ పిచ్చి శివయ్యకి పుట్టుక లేదు తల్లి లేదు తండ్రి లేదు.. అతడే అది అతడే ఆనందం.. అతనికే తల్లి ఉండి ఉంటే స్మశానంలో తిరగనిచ్చేదా.. భూతాలతో ఉండనిచ్చేదా.. ప్రేతాలను దగ్గరికి రానిచ్చేదా.. విష సర్పాలను కంటికైనా కనిపించే విధంగా చేసేదా.. ఏందో పాపం ఏదీ లేనట్టు ఒక పిచ్చి పులి చర్మం కట్టుకొని తిరుగుతాడు.. బహుశా దేవుడు కదా ఆయనకేమి అవ్వదని లే"
విష్ణు దేవుడు " ఇది అందరూ చేసేదే కదా "
పార్వతీ మాత " అది కాదు సోదరా! హాలాహలం తాగనిచ్చేదా తల్లి ఉంటే .. అని రాశాడు.. ఏం జరుగుతున్నా తల్లి తన బిడ్డ శ్రేయస్సు చూస్తుంది కానీ వేరేది ఏమీ చూడదు కదా అని "
బ్రహ్మ దేవుడు " అవును మాత తమరు అందులో ఏమి చలించిపోయారు"
పార్వతీ మాత " నిజంగా ఆయన చేత హల హలం తాగిస్తూ గొంతు దగ్గర నిమిరి ఉన్నాను.. నాకు వినాయకుడు తాగుతాను అన్నా కుమారుడు తాగుతాను అన్న ఒప్పు కుంటాన అని నాకే ఒక్క నిమిషం అనిపించింది "
విష్ణు దేవుడు " సోదరి కవి హృదయంతో ఆలోచించిన మాట వాస్తవమే కానీ మహాదేవుని ఎవరు ఏమి చేయలేరు. . ఏది ఏమి చేయలేదు "
నేను " అవును పార్వతి .. అతగాడు నా మీద రాసిన భక్తి కథలు ఎన్నో .. ప్రతి దాంట్లో ఒక పరమార్థం .. ప్రతిభావం యదార్ధం.."
లక్ష్మీ మాత " మాకు మీ మీద ఒక కథ రాసింది జ్ఞాపకానికి వస్తుంది.. ."
నేను " కుమ్మరి వాడి కథ కద "
లక్ష్మీ మాత " ఒక కుమ్మరి వాడికి రోజు అధికమైన మట్టి కుండలు చేయాలని .. అతని కర్తవ్యం.. అతగాడికి ఏ రోజు గుడికి పోవడానికి కుదిరేది కాదు... ఏదో కుదిరి వెళ్తే ఆరోజు గ్రహణం అని గుడి మూసేవారు.. ఇలా మన వాడికి ఎప్పుడు గుడికి వెళ్లినా కూడా. అరకొర దర్శనంతో తన బాధ్యతలు ముగించుకొని.. తృప్తిగా భగవంతుని చూడలేదని బాధపడేవాడు "
సరస్వతి మాత " అలా కాదని.. అతగాడు.. ప్రతిరోజు చక్రం మీద వేసే మట్టితో శివలింగం చేయటం దానిమీద గుడిలో లాగా అభిషేకం చేసుకోవటం. ఆ మట్టి కరిగిపోగానే మిగతా కుండలు చేసుకోవటo .. ఇలా అతగాడి భక్తి మొత్తానికి మహాదేవుడికి చేరింది "
పార్వతి మాత " ఇలా రోజు శివలింగాన్ని చేస్తూ.. ఉన్న అతగాడికి.. శివలింగం ఎందుకు సాక్షాత్తు శివుని మట్టితో ఒకసారి చేద్దామని తలంపుతో.. చక్రం మీద మట్టిని తిప్పుతూ మహాదేవుని తయారు చేద్దామని ఎంత చేసినా సృష్టించలేక ఆ మట్టి విరిగిపోయింది.. ఇలా రెండు మూడు రోజులపాటు మట్టి కుండలు తయారు చేయకపోవడం వల్ల .. వర్తకులు గొడవకి వద్దామని అనుకున్నారూ. ఇక మన స్వామి ఊరుకుంటాడా
. అసలు కు0డలనే విషయం మర్చిపోయి మహాదేవుడి చిత్రాన్ని మట్టితో కుండ వలె చేద్దామనే తలంపుతో అదే పనిమీద అదే ఆశతో అహోరాత్రాలు కష్టపడి చేస్తున్నాడు.. అది కావట్లేదు "
బ్రహ్మదేవుడు " ఇక వర్తకులు అందరూ కలిసి మూడు నాలుగు రోజుల నుంచి మట్టి పాత్రలు రాకపోతే తమ వర్తకానికి ఇబ్బంది అని ఇతగాడున్న ప్రదేశానికి బయలుదేరారు.. దారిలో అతగాడి రూపంలో .. మహాదేవుడు.. "
విష్ణు దేవుడు " ఇక వారందరికీ ఏదో జీవితంలో ఒకసారి ఆలస్యమైందని వేరే పని మీద వెళ్ళటం వల్ల ఇలా జరిగిందని తమరిచ్చిన పైకం ముట్టిందని ఉద్దేశంతో మీకోసమే తీసుకొస్తున్నారని వారికి వారికి మడ్డి కుండ లు ఇచ్చి అక్కడికక్కడే పంపించాడు.. ఆ వర్తుకులు అందరూ పోనీలే మూడు రోజులు ఇవ్వకపోయినా 15 నెలల రోజులకు సరిపడా సామాన్లు ఇచ్చాడు అని సంతోషంగా వెళ్లిపోయారు "
నేను " ఏం చేస్తాం పాపం నాకోసం ఆ భక్తుడు సమయం కేటాయించాడు కదా అలా చేయటమే సబబు అని ఈ భక్తుడు రాశాడు.. "
కార్తికేయుడు " కుండలు చేయటం చేత అయిన నాకు.. నిన్ను చేయటం చేతకావట్లేదు మహాదేవ ! మమ్మల్ని చేసి వాడివి కానీ నేను మిమ్మల్ని చేసి వాడినా? అనామకుడి అంతర్ధం అంతే అంటూ కనుల వెంట నీళ్లు పెట్టుకున్నాడు.. మట్టి శివలింగాన్ని చేసుకుని దానికి నమస్కారం పెట్టాడు.. "
నేను " చెప్పు కార్తికేయ నీవు రాసిన కథ నువ్వు చెప్తే ఇంకా వినసొంపుగా ఉంటుంది"
కార్తికేయ " అలాగే గురువా! ఆ తరువాత ఆ రోజుకి ఓపిక లేక ఆ వర్తకులకు క్షమాపణలు చెబుదామని వెళ్ళాడు.. ఆ వర్తుకులు అందరూ ఏమయ్యా.. ఎంత మంచి కుండలు చేశావు.. ఇంత గొప్ప సరుకు ఎప్పుడూ ఇవ్వలేదు.. మొన్న నీకోసం వస్తుంటే ఎదురు వచ్చి ఇంత సరికిచ్చవు కదా అనేసరికి.. ఆ కమ్మరి భక్తుడి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. తనకేమీ అర్థం కావట్లేదు.. కానీ కళ్ళముందు సరుకు కనపడుతుంది.. ఏమి మాట్లాడలేక కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నాడు.. ఇంకా రెండు వారాలు పాటు కుండలు ఇవ్వవలసిన అవసరం లేదని నిర్ధారించుకున్నాడు "
నేను " కచ్చితంగా నేనే ఇచ్చాను అని తెలుసుకున్నాడా ? "
కా " గురువా నువ్వు నిజ జీవితంలో ఎన్ని పరీక్షలు పెట్టినా .. నా కథల్లో భక్త సులభడివి.. నువ్వు నిజంగా నీ భక్తున్ని బాధ పెట్టి నమ్మి న వారిని పరీక్షించినట్టు నా కథ నేను పరీక్షించనయ్యా.. ఎందుకంటే చదువుకున్న వాడికి చదివిన వాడికి భక్తి రావాలి గాని భగవంతుడు ఇంత పరీక్షలు పెడితే మన కర్మకొద్దీ వదిలేస్తే ఎలా అని భయంతో భక్తి వైపు రాకుండా ఉండకూడదయ్యా "
నేను " ....." ..అందరూ ".."
కా " గురువా ! మా తప్పులు
మా పూర్వజన్మ పాపాలు క్షమించి , నన్నే కాదు నిను నమ్మిన వారందరికీ.. మీ అనుగ్రహాన్ని కటాక్ష విక్షణా లను కొంచెం అధికంగా ఇవ్వు స్వామి.. నువ్వు కరుణించకుండా ఉంటావని మేము అనుకోము మా కర్మ అటువంటిది.. దయచేసి అందరినీ ఆదుకో విశ్వ నాయక.. మీరు కూడా జగన్నాయక. తమరు కూడా బ్రహ్మాండ నాయక "అంటూ త్రిమూర్తులను అభ్యర్థించాడు.. త్రిమాతలను వేడుకున్నాడు.
(ఇంకా ఉంది)




No comments:
Post a Comment