శ్రీథర మాధురి - 131
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
ఈ ప్రపంచంలో ఏదీ నాది కాదు. ప్రతి ఒక్కటీ భగవానునికి చెందినది.
______________________________
శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు దూతగా హస్తినాపురానికి వెళ్ళాడు. ఆరోజున ఆయన అక్కడ రాత్రి బస చేయవలసి ఉంది.
ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ వెళ్తూ, ఆయన ఇలా అడగ సాగారు 'ఈ ఇల్లు ఎవరిది?'
భీష్ముడు ఇలా అన్నాడు 'దయచేసి లోపలికి రండి కృష్ణా! ఇది నా ఇల్లే!'
ఆయన భీష్ముని ఇంటిని దాటి వెళ్లిపోయారు.
తరువాతి ఇంటిలో ఆయన ఇలా విచారించారు, 'ఈ ఇల్లు ఎవరిది?'
ద్రోణుడు ఇలా బదులిచ్చాడు 'దయచేసి లోపలికి రండి కృష్ణా! ఇది నా ఇల్లే!'
ఆయన ద్రోణుడి ఇంటిని కూడా దాటి వెళ్ళిపోయారు.
ఆ తరువాతి ఇంటిలో ఆయన ఇలా విచారించారు, 'ఈ ఇల్లు ఎవరిది?'
కృపాచార్యుడు ఇలా బదులిచ్చాడు 'దయచేసి లోపలికి రండి కృష్ణా! ఇది నా ఇల్లే!'
ఆయన ఆ ఇంటిని కూడా దాటి వెళ్ళిపోయారు.
దుర్యోధనుడు అనేక వజ్రాలు, రత్నాలతో వేచి ఉండి, కృష్ణ భగవానుని ఈ విధంగా ఆహ్వానించాడు 'నేను మీరు ఉండడానికి అన్ని ఏర్పాట్లను చేశాను. నా భవంతిలో సౌకర్యవంతంగా ఉండండి. దయుంచి లోపలికి విచ్చేయండి కృష్ణా!'
కృష్ణ భగవానుడు దుర్యోధనుని పిలుపును పట్టించుకోకుండా ముందుకు వెళ్లి, చివరికి విదురుడు ఉండే కుటీరం వద్దకు వచ్చారు.
కృష్ణ భగవానుడు ఇలా అడిగారు 'ఈ ఇల్లు ఎవరిది?'
విదురుడు 'ఇది కృష్ణుడి కుటీరం' అన్నాడు.
కృష్ణ భగవానుడు అమితంగా సంతోషపడి విదురుని కుటీరంలోకి ప్రవేశించారు.
______________________________
అతడు గృహప్రవేశ ఆహ్వాన పత్రికలో 'నా ఇంటి గృహప్రవేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను' అని ముద్రించాడు.
కృష్ణ భగవానుడు అతని ఇంట్లో ప్రవేశిస్తాడా?
అలా కాకపోవచ్చు ఎందుకంటే అది భీష్ముడి/ ద్రోణుడి/ కృపాచార్యుడి/ దుర్యోధనుడి విశ్రాంతి ప్రదేశం. కానీ విదురుని 'కృష్ణకుటీరం' కాదు కనుక.
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment