అనుకోని  అనుబంధం
కందర్ప మూర్తి
పివి  స్మారకఘాటు 
చూసుకుంటు  ముందుకు నడుస్తుంటె   కొద్ది  దూరంలో 
చిన్ననాటి  మిత్రుడు 
నాగేశ్వర్ కంటపడ్డాడు.
  
"హలో, నాగూ" అంటు అతని 
దగ్గరకు
వెళ్లి  పలకరించాడు. ముందు 'ఎవరా!'  అని 
సందిగ్దంలో
ఉన్న  నాగేశ్వర్, కామేశాన్ని
గుర్తుపట్టి
"ఏరా, కామేశం !నువ్వా?,  చాల సంవత్సరాల తర్వాత చూసినందున 
వెంటనే  జ్ఞాపకం రాలేదు.చాలా మారిపోయావురా.
చదువుకునే రోజుల్లో సన్నగా
ఉండేవాడివి బొద్దుగా తయారయావు.
ఎక్కడ  ఉంటున్నావు,
ఏం  చేస్తున్నావు , మీఊరెలా ఉంది, ప్రశ్నల  మీద 
 ప్రశ్నలు  వేస్తున్నాడు. 
    
"ముందు అలా లాన్లో గడ్డి మీద కూర్చుని
మాట్లాడుకుందాం, పద". అంటూ 
దగ్గరగా
ఉన్న  పచ్చగడ్డి మీద  కూర్చున్నారు  ఇద్దరూ.
నేను మా ఊరి గవర్నమెంటు
హైస్కూల్లో  మేథ్సు  అసిస్టెంటుగా  జాబ్  చేస్తున్నాను. మా మేనమామ
గారమ్మాయి  సుజాతతో పెళ్లైంది. మాకు 
పది సం.ల  కొడుకు 
శరత్  ఉన్నాడు. మనం  చదివేటప్పుడు నాన్న  మన 
స్కూల్లోనే  తెలుగుపండిట్ గా  ఉండేవారు కదా. తర్వాత ఆయన  రిటైరై 
 ఈమద్యనే  కాలం 
చేసారు.
నేను  డిగ్రీ,  పిజి 
అయిన తర్వాత 
 బిఎడ్  పూర్తై 
ఎంట్రన్స్  రాసి 
టీచర్ గా  సెటిలయాను. తాతగారు  ఎలిమెంటరీ స్కూల్
టీచర్గా, నాన్నగారు హైస్కూలు టీచర్గా, వారి  వారసత్వం  నిలబెడుతు 
నేనూ  హైస్కూలు 
టీచర్నయా. అంటూ 
మా
దగ్గరి  బంధువుల ఇంట్లో  శుభకార్యం 
ఉంటే  శలవు పెట్టి  హైదరాబాదు  వచ్చాను. రేపు  తిరుగు ప్రయాణం" అని తన  గతం 
చెప్పుకొచ్చాడు  కామేశం.
    
"నీ సంగతేంటి.   మీ నాన్నగారు 
రెవిన్యూ
డిపార్ట్మెంట్లో  జాబ్ చేసేవారు 
కదా. ఆయన  ట్రాన్ఫర్ 
తర్వాత  మీ కుటుంబం షిప్టు  అవడంతో  మా ఊరితో 
రాకపోకలు  లేకపోయాయి. నీ సంగతులు  తెలియలేదు. నీకు  ఆటిజం 
ఉన్న
తమ్ముడు ఉండేవాడు  కదా. వాడి 
వైద్యం  గురించి 
మీ నాన్న  చాలా కష్టపడేవారు. ఎక్కడెక్కడి  డాక్టర్లకు  చూపించారు. వాడి ట్రీట్మెంట్ 
కోసం  అవుసరమైతె 
హైదరాబాదు  తీసుకెళ్లి బాగుచేయిస్తా  అనేవారు"  అంటూ  జరిగింది గుర్తు చేసాడు కామేశం.
       
నాగేశ్వర్ కు  గతం జ్ఞప్తికి  వచ్చి  కళ్లు  తుడుచుకుంటు,
"తమ్ముడు  చనిపోయాడని ,
నాన్న  వాడి 
ఆరోగ్యం  గురించి చాలా  బాధపడేవారని   వాడు  కోలుకుని 
మామూలుగా తిరగాలని 
దేవుళ్లకు  పూజలు,
అన్నదానాలు,  దానధర్మాలు చేసేవారని  ఎంత ప్రయత్నం  చేసినా 
వాడి  ఆరోగ్యం 
బాగుపడక  చనిపోయాడని 
చెప్పి  ఆగిపోయాడు. 
వాడికి   సేవ చేసి చేసి  అమ్మ 
ఆ షాక్  నుంచి 
కోలుకోలేకపోయింది.  తర్వాత 
ఆవిడ  కూడా 
బెంగతో  కాలం చేసింది.  నేను  సివిల్ ఇంజినీరింగ్  పూర్తి చేసి  ఒక కంస్ట్రక్షన్ కంపెనీలో జాబ్  దొరికితే  ప్రస్తుతం  షార్జాలో 
ఉంటున్నాను. నాకు 
మాబంధువుల
అమ్మాయితో  పెళ్లి  జరిగింది. మాకు పాప  పుట్టింది. నాదీ  దురదృష్ట 
జాతకమే.  హాయిగా సాగిపోతున్న  మా జీవితంలో  అనుకోని 
 దుర్ఘటన జరిగి 
నా బతుకు  అంధకారమైంది. కిచెన్లో  వంటగేస్ సిలిండర్  పేలి  నా భార్య,
కూతురు  అగ్నికి 
ఆహుతయారు. ఆ షాక్ 
నుంచి  కోలుకోడానికి  నాకు  చాలా కాలం  పట్టింది. ఈ జ్ఞాపకాలకు  దూరంగా  ఉండాలని 
దుబాయ్  కంపెనీలో అవకాశం  వస్తే  వెళిపోయాను. నాన్నగారు  కాలం 
చేసి సంవత్సరమైంది. ఇప్పుడు  నేను 
వంటరి  పక్షినయాను. దుబాయ్  కంపెనీ మీటింగ్  హైదరాబాదులో ఉంటే వచ్చి  హోటల్లో  ఉన్నాను. మనసు  ఆహ్లాదం కోసం ఇలా  టేంక్ బండ్ 
వైపు  వచ్చాను" అంటూ  తన  పూర్వ కథ  చెప్పుకొచ్చాడు  నాగేశ్వర్.
 
"నీ విషయంలో చాలా విషాదం జరిగిందోయ్. వింటుంటే బాధ 
కలుగుతోంది.
భగవంతుడు  మంచి  వాళ్లకే 
కష్టాలు తెచ్చి పెడతాడు. నీకు  అభ్యంతరం 
లేకపోతే  మళ్లా మా ఊరు  రావోయ్. ఆ పరిసరాలు, వాతావరణం
నీకు  కొంత 
ఉపశమనం  కలిగిస్తాయి. మన  చిన్ననాటి ముచ్చట్లు  మాట్లాడుకోవచ్చు." అని  తన 
ఇంటి  వివరాలు ఎడ్రసు  ఇచ్చాడు  కామేశం.
 
ఇన్ని సంవత్సరాల తర్వాత  నిన్ను 
కలిసాక  ఏదో 
మధురానుభూతి
నన్ను   వెంటాడుతోంది  కామేశం. ఈ కాన్ఫరెన్స్   పూర్తి  చేసుకుని తప్పక  మీ ఊరు  వస్తాను  అని 
కామేశం  ఇచ్చిన 
వివరాలు నోట్  చేసుకున్నాడు. అక్కడికి  దగ్గరగా ఉన్న  రెస్టారెంట్లో ఇద్దరూ  స్నేక్స్  తిని 
 వీడ్కోలు  తీసుకున్నారు.
* * *          
 కామేశం 
చెప్పిన
ఎడ్రసుకు బయలుదేరాడు  నాగేశ్వర్. ఊరంతా  మారిపోయింది. పాత  ఇళ్లన్నీ  కూలగొట్టి  కొత్త హంగులతో  భవనాలు వెలిసాయి. మట్టి రోడ్లు 
పోయి
తారు రోడ్లు ,  సిమ్మెంటు రోడ్లుగా  మారేయి. అప్పట్లో  సైకిలు రిక్షాల స్థానంలో  ఆటోలు 
వరస  కట్టేయి. కూరల మార్కెట్, బజారులో పెద్ద పెద్ద 
షాపులు
వెలిసాయి.
   
బస్టాండులో బస్సు దిగిన
నాగేశ్వర్ ఆశ్చర్యంగా "ఇక్కడ పాత చెరువు   ఉండేది   కదరా"  అంటే 
"దాన్ని  మట్టితో 
కప్పేసి ఈ
కొత్త  బస్టాండు  కట్టేరు. రియల్ ఎస్టేట్  వాళ్లు 
భూములు కొనేసి  వెంచర్లు 
వేస్తున్నారు
" అన్నాడు.
       
గుర్తు పట్టలేనంతగా  ఊరు 
మారిపోయిందంటు
కామేశం  తెచ్చిన  మోటర్ బైకు 
వెనుక  కూర్చుంటే 
పది నిమిషాల్లో
ఇల్లు  వచ్చింది. పైన అంతస్తు, కింద పోర్షనుతో 
ఇల్లు  అందంగా ఉంది. చుట్టూ  ప్రహరీగోడ 
ముందు  చిన్న 
ఇరన్
గేటు  ఉంది.
చుట్టూ  పూలమొక్కలు ,
వరండాలో  సోఫాలు 
 కుర్చీలు
తీర్చిదిద్దినట్టు  కనబడుతున్నాయి. వెనక  కొబ్బరి చెట్లు, జామ,  బొబ్బాస, అరటి వంటి ఫలవృక్షాలు
ఏపుగా పెరిగాయి. రకరకాల పక్షుల అరుపులతో 
సందడిగా  ఉంది.
      
గేటు తీసి నాగేశ్వర్ ని  లోపలికి 
తీసుకువచ్చాడు
కామేశం. ఇంతలో కామేశం భార్య  సుజాత  ఎదురొచ్చి పలకరించింది. అప్పటికి  ఉదయం 
పదకొండు  దాటింది. వరండాలో  సోఫాలో  ఇద్దరూ  ఆసీనులయారు. చల్లని వాతావరణం, చక్కటి గాలి 
హాయిగా  ఉంది.
సుజాత  గ్లాసుల్లో 
చల్లని
నీళ్లు  తెచ్చి  ఇచ్చింది. "తాతగారు  కట్టించిన 
ఈ ఇంటిని  నాన్నగారు 
అలాగే ఉంచారు.
నేను  దాన్ని  మోడరన్ 
చేసాను"
అంటూండగా  పదేళ్ల  కామేశం 
కొడుకు  శరత్ క్రికెట్ బేట్  పట్టుకుని  ఇంట్లోకి  వస్తు 
కొత్త  వ్యక్తిని చూసి  సంశయిస్తుంటే   కామేశం  దగ్గరకు 
పిలిచి, నాగేశ్వర్
ని   పరిచయం  చేసి 
గుడ్
మార్నింగ్ చెప్పమంటే  విష్ చేసి  బేట్ 
పట్టుకుని  లోపలికెళ్లాడు.
   
సుజాత  రెండు కప్పులతో  వేడి కాఫీ  తెచ్చి  ఇచ్చింది. కాఫీ  తాగుతు 
కామేశం
ఇల్లు , వాతావరణం  చూసి  పరవశించిపోయాడు  నాగేశ్వర్. ఇంతలో  25 సం.ల  ఒక  అమ్మాయి 
నుదుటున బొట్టు  లేకుండా 
సాదా
చీరలో  ఇరన్ గేటు  తీసుకుని ఇంట్లోకి  వచ్చి 
తిన్నగా   లోపలికెళిపోయింది.
      
ఆ అమ్మాయిని  చూసిన 
కామేశం  తన 
మరదలని, టెన్తు పాసయి 
మహిళా
సంఘంలో టైలరింగ్  టీచర్గా జాబ్  చేస్తు 
తమతోనె  ఉంటోందని, 
గత  సంవత్సరం ప్రైవేటు కంపెనీలో  పనిచేస్తున్న  భర్త  యాక్సిడెంట్లో చనిపోయాడని  వివరణ 
ఇచ్చాడు.
  
"అయ్యో, 
ఇంత  చిన్న 
వయసులో  ఎంత 
విషాదం"
అని  సానుభూతి  కనబరిచాడు 
నాగేశ్వర్
దశరా పండగ సందర్భంగా హైస్కూలుకి  శలవులైనందున కామేశానికి  విశ్రాంతి 
దొరికింది.
నాగేశ్వర్ ని  వెంటపెట్టుకుని గుళ్లూ, దర్సనీయ  స్థలాలు  కుటుంబ 
సబ్యులతో  ఎంజాయ్ చేసాడు. దసరా పండగ  కూడా 
కలిసి  రావడంతో 
ఇంట్లో సందడి  వాతావరణం 
కనబడింది.
సుమారు  వారం రోజులు నాగేశ్వర్,  కామేశం 
కుటుంబ  సబ్యులతో 
గడిపాడు.
అక్కడి   వాతావరణం, వారి  ఆప్యాయతలు  చూసి మనసుకి 
ప్రశాంతత  కలిగింది. ఈ సమయంలోనె  కామేశం 
విధవ
మరదలు ఇందిరతో  పరిచయమైంది. ఆ
అమ్మాయి  అణకువ, మాటతీరు  ఎంతో నచ్చింది. తనకి  కూడా  ఇప్పుడు ఎవరో ఒకరు తోడు
కావాలి.
ఇందిర విషయం కామేశంతో మాట్లాడితే ఏమనుకుంటాడోనని బెరుకుగా ఉంది. రేపు ప్రయాణమనగా రాత్రి భోజనాలయాక పై అంతస్థులో కామేశంతో మాటల సందర్భంగా తన మనసులోని మాట బయటపెట్టాడు నాగేశ్వర్. అనుకోని ఈ సంఘటనను కామేశం నమ్మలేకపోయాడు. మరదలు ఇందిర జీవితం ఇలా చిన్న వయసులోనే మోడుబారిపోవడం గురించి భార్యతో ఎన్నో సందర్భాలలో బాధపడటం జరిగింది. ఆమెకు పునర్వివాహం చేద్దామన్నా ఎవరు ముందుకు వస్తారని తర్జనభర్జన పడేవారు. అటువంటిది వెతకపోయిన తీగ చేతికి అందినట్లైంది కామేశానికి. నాగేశ్వర్ ఉదార హృదయాన్ని అభినందించి, ఉద్వేగంతో వాటేసుకున్నాడు.
 

 



 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment