గ్రుడ్లు, పాలు మాంసాహారమా ? శాఖాహారమా?
అంబడిపూడి శ్యామ సుందర రావు  
ఈ చర్చ ఎన్నాళ్ళుగానో సాగుతుంది అవునని కాదని వాదించే వాళ్ళు ఉన్నారు మనిషి ఆహారపు అలవాట్లను బట్టి జీవులను శాఖాహారులు అంటే పూర్తిగా మొక్కలకు సంబంధించిన ఆహారాన్ని తీసుకునేవారు మాంసాహారులు అంటే పూర్తిగా జంతు సంబంధమైన మాంసాన్ని ఆహారంగా  తీసుకునేవారు జంతువులు ఎక్కువ భాగం ఈ కోవలోకి వస్తాయి మూడవ రకం సర్వభక్షకులు  అంటే వీరు శాఖాహారాన్ని  మాంసాహారాన్ని తింటారు దంత  నిర్మాణంలో ఉన్న తేడాలను  బట్టి ఈ రకమైన వర్గీకరణ జరిగింది శాఖాహార  జంతువులైన ఆవు గేదె మేక వంటి జంతువులలో కోర దంతాలు ఉండవు కాబట్టి అవి గడ్డి లాంటి మొక్కల పైనే ఆధారపడి ఉంటాయి పులి సింహం కుక్క వంటి జంతువులలో కట్టింగ్ టీత్ ఉండవు కోర దంతాలు  ఉంటాయి కాబట్టి అవి మాంసాన్ని చీల్చి తింటాయి మనిషి కోతి  వంటి జంతువులలో ఈ రెండు రకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు శాఖాహారాన్ని మాంసాహారాన్ని తినగలరు ఆచారాలు కట్టుబాట్ల వల్ల  కొన్ని కులాలవారు మాంసాహారాన్ని తీసుకోరు గ్రుడ్లు, పాలు ఈరెంటి విషయములోనే ఈ చర్చ సాగుతుంది కాబట్టి ఈ విషయాన్ని పరీశీలీద్దాము 
ముందుగా శాఖాహరము ,మాంసాహారము అనే విషయము పై శాస్త్రము చెప్పిన వివరణ తెలుసుకుందాము.ఈ భూమిపై జీవుల పుట్టుక ఆధారంగా జీవులను నాలుగు రకాలుగా విభజించారు (సైన్సు ప్రకారం రెండు రకాలు) అవి జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్బీజములు అని పిలుస్తారు. జారాయుజములు అంటే  గర్భం లోని పిండమును  ఆవరించి యుండి మాయ వలన పుట్టునని,మనుష్యులు పశువులు ఈ రకానికి చెందినవి. రెండవది అండజములు గ్రుడ్డు నుండి పుట్టే పక్షులు పాములు ఈ రకానికి చెందినవి.మూడవ రకం స్వేదజములు అంటే చెమట వలన పుట్టే దోమలు నల్లులు మొదలైనవి నాల్గవ రకము,ఉద్బీజములు ఇవి వి
విత్తనం నుంచి వచ్చేవి ఉద్బీజములు లేదా ఉచ్చములు అంటే విత్తనం నుండి వచ్చేవి ఇవి ఎక్కువగా ఆకాశము వైపు సాగుతాయి ఇవన్నీ సత్వ గుణ పూరితాలు కాబట్టి వీటిని శాఖాహారం అంటారు. యాజ్ఞవల్క్యస్మృతి ప్రకారం చర సృష్టిని జంతువులు ఆహారం కోసం వాడ కూడదు ఆచర సృష్టి అంటే మొక్కల్లో ఒక కొమ్మను నరికిన మళ్లా  కొమ్మ పెరుగుతుంది ఇవి ఆహారం కోసం కదల వలసిన పని లేదు వీటిలో సత్వ గుణం ఉంటుంది కాబట్టి వీటిని తింటే సత్వ గుణం వృద్ధి చెంది ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి శాఖాహారాన్ని భుజిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటారని, కైవల్యాన్నీ  పొందుతాడని ఋషులు చెప్పారు.
మానవుడు మావి నుంచి పుడతారు. తల్లి పాలు త్రాగి పెరుగుతారు అందుచేత  ఆవులు, మేకలు వంటి జంతువుల పాలు కూడా తాగవచ్చు. ఆవులు గేదెలు వంటి పాలిచ్చే జంతువుల పాలు మనము వాటి దూడలు త్రాగినాక  మనము త్రాగటం వల్ల వాటికి నష్టం ఏమి లేదు మనము పితికి ఆ పాలు వాడుకోక పోయిన దూడ త్రాగగా మిగిలిన పాలను ఏ చెట్టుకో పొదుగును అదిమిపెట్టి కార్చేస్తాయి. కాబట్టి ఆ పాలను మనము త్రాగటం వల్ల అట్టి జంతువులకు మనము ఎటువంటి హాని చేయడం లేదు కాబట్టి పాలు ఖచ్చితముగా శాఖాహారమే ఇక్కడ మనము గుర్తించ వలసిన విషయం ఒకటి ఉంది అది ఏమిటి అంటే ఉద్బీజములను తిని బ్రతికే జరాయుజముల పాలు మాత్రమే శాఖాహారం అంటే ఆవులు గేదెలు మేకలు వంటి జంతువుల పాలు,మాత్రమే శాఖాహారం అంతేగాని అవును తినే పులి లాంటి జంతువుల పాలు శాఖాహారం కాదు
ఇంక  గ్రుడ్డు విషయానికి వద్దాము ప్రస్తుతం కృత్రిమంగా 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment