ఒకటైపోదామా ...ఊహల వాహినిలో!
కొత్తపల్లి ఉదయబాబు

సమయం సాయంత్రం ఆరుగంటలు. ట్యాంక్ బండ్ మీదనుంచి
దూరంగా పశ్చిమాన ఇంటికివెళ్ళే హడావుడి అన్నట్టు 
తనను వీక్షిస్తున్నవాళ్లకు 'సి యూ టుమారో ' అని చెప్పినట్లు భావించేలా కిందకి
దిగిపోతున్నాడు   సాయంకాల భానుడు. 
అయితే రైలింగ్ కి రెండువైపులా తన రెండు చేతుల్నీ చాచి
నిలబడిన విరాజ్ మాత్రం తానూ నిరీక్షిస్తున్న వ్యక్తి కోసం అన్నట్టు ఇటువైపు
చూస్తున్నాడు. సరిగా అతని ముందు ''స్విగ్గి''  జాకెట్
తొడుక్కున్న వ్యక్తి నడుపుతున్న బైక్ వచ్చి ఆగింది. బైక్ వెనుక నుంచి  జీన్స్ ప్యాంటు,  టీషర్టులో దిగిన వ్యక్తి  అతన్ని చూస్తూనే 'హాయ్'
అని పలకరించి దగ్గరగా వచ్చి నిలబడి అడిగింది.
''ఎంతసేపైంది వచ్చి?''
''పదినిముషాలు.''అన్నాడు విరాజ్/
 'ఆర్డర్ ఇచ్చి ఇటు వైపు వస్తున్న
కొల్లీగ్ ని లిఫ్ట్ అడిగి వచ్చే సరికి 
లేట్ అయింది. ఇంతకీ ఎందుకో రమ్మన్నావ్?''
 ''మనసారా ప్రేమించిన వ్యక్తిని
రోజుకోసారైనా చూసుకోకపోతే నేను ఉండలేను 
బేబీ. ఏకంగా పదినిముషాలు నిరీక్షింపచేసావ్, ''
 ''ఏకంగా... పదినిముషాలు
అంటున్నావ్? ప్రియురాలికోసం ఆమాత్రం నిరీక్షించలేవా?''
 ''గలను. కానీ ఆ పదినిముషాలు కూడా
ఎందుకు వృధా అవ్వాలి? పెళ్లి కాకుండా మీ ఆడపిల్లలు ఎలాగూ
ముట్టుకోనివ్వరు. అఫ్కోర్స్... అలా ముట్టుకోనిచ్చే ఆడపిల్లలు ప్రేమికురాలు కాలేరు.
వాళ్ళు జస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే. అదే పదినిముషాలు  ముందు వచ్చి ఉంటే నా ప్రియురాలి సన్నిధిలో
దగ్గరగా ఉన్నానన్న భావన అయినా నాకు మిగులుతుంది కదా...''
 ఆమె అతని
పొట్టలో పిడికిలి బిగించి కొట్టబోయి చేయి వెనక్కి తీసేసుకుంది.
 '' అదిగో..అదే మరి. ఏదైనా ఒక పని
చేయాలనుకున్నప్పుడు చేసేయాలి. లేకపోతే థ్రిల్ పోతుంది .''
'అహా....అలాగా....'ఆరు నెలలు కత్తిసాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మను యుద్ధానికి రమ్మన్నాడట' నీలాటి వాడు. నా కరాటే విద్య నామీద అన్యాయంగా దాడి చేసేవాడి మీద ఉపయోగించాలి గానీ...నీ మీద కాదు.''
 'అబ్బ....చ....నువ్వు కొట్టే పంచ్
కి నేను స్పృహతప్పి పడిపోతాను మరి. ఇది జిమ్ బాడీ..బేబీ ...తెలుసుగా...''అన్నాడతను నవ్వుతూ.
 ''తెలుసు కాబట్టీ నా పంచ్ వృధా
చేయలేదు మహానుభావా...ఇంతకీ నువ్వు ఎందుకు రమ్మన్నావో చెప్పలేదు.'' 
 " నేను
చెప్పే మాట విని  ముందు కంగారు పడకూడదు
తర్వాత ఆశ్చర్యపడకూడదు. సరదాకి  అని  అంతకన్నా అనుకోకూడదు. " అన్నాడతను సీరియస్
గా.
 "
అనుకోను " తేలికగా తీసుకుంటున్నట్లు అంది.
 ''నువ్వు  నాతో బిడ్డను కని సరిగ్గా పది నెలల్లో నా
చేతుల్లో పెట్టాలి. నాకు వాడితో ఆడుకోవాలని ఉంది. ఆతరువాత కూడా నేను నిన్ను
మర్చిపోలేక పేమిస్తూ ఉంటే అప్పుడు మన పెళ్లి ''.
 చాలా కూల్ గా
చెప్పాడు...అతనిప్పుడు వొళ్ళంతా వెయ్యి కళ్ళున్న ఇంద్రుడిలా ఉన్నాడు ..తన మాటలకు
ఆమె ఎలా స్పందిస్తుందా? అని 
 ''వ్వాట్ ...''ఒక్కసారి గట్టిగా అరవబోయి...చుట్టూ చూసి తమాయించుకుని అడిగింది ఆమె.
 ''ఏమిటీ? పెళ్లి
కాకుండా పది నెలల్లో నీ బిడ్డను కనీ నీ చేతుల్లో పెట్టాలా? అలా
చేసాకా  అప్పుడు కూడా నీకు నామీద ప్రేమ
తగ్గకుండా ఉంటే అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? మతిగాని     పోయిందా నీకు? అపుడు
మీ వాళ్ళు నన్ను కోడలిగా అంగీకరిస్తారనుకున్నావా? ఒక వేళ
అంగీకరించినా మన పెళ్లయి ఒక ఏడాది పూర్తిగా జీవితాన్ని ఎంజాయ్ చేసాకా గానీ  పిల్లల్ని కనే ప్రసక్తే లేదు.''
 'అంటే...అది అసాధ్యమా?''
 ''ఖచ్చితంగా అసాధ్యమే...అంతే కాదు
అత్యాశ కూడా..''
 ''అయితే నేను సీరియస్ గా
అడుగుతున్నాను. ఈ పని సుసాధ్యమే అని నువ్వు నిరూపించాలి  హరితా...నాది అత్యాశ కాదు హరితా.... నాకు  ఉన్న ఆశ, నువు ఒప్పుకుంటే
జరిగే అవకాశం  కూడా! .... నేను
మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి నాతో పెళ్లి కాకుండానే నాకు బిడ్డని కని
ఇవ్వాలి.ఆ థ్రిల్ నేను పెళ్ళికి ముందే అనుభవించాలి.''
(ఇంకా ఉంది)
 

 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment