అమ్మేకదా!
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.11-07-2021
అమ్మేకదా!
పక్షపాతబుద్ధి చూపినా....
అమ్మే కదా!
ప్రేమను పంచింది 
ఈ అమ్మే కదా!
ధైన్యంగా ఉన్న మీఇంటిని
దేవాలయం చేసింది
ఈ అమ్మే కదా!
త్యాగాలు చేసింది,
రోగాలు తెచ్చుకుంది  
ఈ అమ్మే కదా!
జైలు లాంటి ఇంట్లో 
జయనికేతనం ఎగురవేసింది
ఈ అమ్మే కదా!
ఇంటికొచ్చిన వారందరికీ 
ప్రతిఫలం కోరని పనిమనిషయింది
ఈ అమ్మే కదా! 
నీ చిన్నప్పుడు
నీకై మీ నాన్నతో అబద్దాలడినది
ఈ అమ్మే కదా!
ఎంతమందికి ఏమిచ్చినా
నీకు అందరికన్నా ఎక్కువ ఇచ్చి
పక్షపాత బుద్ధి చూపినది 
ఈ అమ్మే కదా!
అప్పుడు అమ్మలో దొరకని దోషం
ఇప్పుడు దొరికిందా?
అప్పుడు అమ్మపై కలగని కోపం
ఇప్పుడు కలిగిందా?
***
 

 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment