'చరవాణి చెరలో బందీలం..!'
 -సుజాత.పి.వి.ఎల్, 
సైనిక్ పురి, సికిందరాబాద్.
శుభోదయం నుండి
శుభరాత్రి వరకు..
మత్తు ఆవహించినట్టు
మాయలో ముంచేస్తూంది..
బాహ్య బంధాలను తెంచేస్తూ..
అంతర్జాల వలలో బంధీలను చేసి 
వినోదం చూస్తోంది..
ఏ సంభాషణలైనా..
పలకరింపులైనా..
అరచేతిలో ఉన్న చరవాణి చెవికి చేరందే 
రోజు గడవదు కదా..!
విలువైన సమయాన్ని..
తన గుప్పిట్లో పెట్టుకుని..
బానిసలని చేసి ఆడిస్తుంది..
విజ్ఞానం కోసం కనిపెట్టింది
అజ్ఞానంగా ఉపయోగిస్తున్నామనే 
సందేహం కలుగుతున్నా..
తెలిసిచేసే తప్పుల్లో ఇదొక్కటని సమర్ధింపు భ్రమలో పడేసి..
సమవర్తిలా పరిహసిస్తుంది..
ప్రాణం పోయే సందర్భంలో కూడా..
సెల్ఫీలో ఊపిరి బంధించి..
బతుకునే హరించేస్తుంది..
సె(సొ)ల్లు కబుర్లు మితి మీరితే
రేడియేషన్ అధికమై..అనారోగ్య బారిన పడటం ఖాయం..
చరవాణి చేతుల్లో చిక్కుకున్న మన 
ఉసురు దీపాలు పూర్తిగా కొడిగట్టి కొండెక్కముందే..
పరిమిత వాడుకంతో..మనల్ని మనం పరిరక్షించుకోవాలి..
లేదండీ సెల్ వల్ల బాడీ లో 'సెల్స్'  
'లో బ్యాటరీ'లా బలహీనపడి 
పల్స్ స్విచ్ఛ్ ఆఫ్ అవడం ఖాయం!!
****
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment