ప్రకృతి రక్షతి రక్షతః-ప్రతాప వెంకట సుబ్బారాయుడురేపటి జీవ నాశన పంటకుభూమ్మీద ప్లాస్టిక్ నారు వేశావు..కాలుష్యం నీరు పోశావు భవిష్యత్ తరాల తలరాతనుపచ్చని మొక్క కనిపించని..జీవజంతువు లేనినేడే బొగ్గు ముక్కతో లిఖించుతున్నావు సకల రోగ కారక..సూక్ష్మక్రిమి సహితరాక్షతత్వం..కిరాతకత్వం పెచ్చుమీరడమంటే..ఇదేప్రకృతిని కానుకగా అందించబోతున్నావు మానవత్వం అడుగంటి ఇప్పటికైనా బుద్ధిజీవివై..ఆశాదీపాన్ని కొడిగట్టనీకునిత్యావసరాలకై మృణ్మయ పాత్రలను..వెలుగు కిరణ శూలానివై.. ప్లాస్టిక్ మహమ్మారిని మట్టుబెట్టు.. కాలుష్యపు కోరలు పీకు జనపనార సంచులను ఉపయోగించుఅన్న భావన సర్వత్రా వ్యాపింపజేయిమనిషి, పర్యావరణ ప్రేమికుడు..స్నేహితుడని నిరూపించు..పంచభూతాలను పరిరక్షించు ప్రకృతి రక్షతి రక్షితః లోకాస్సమస్తా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతిః***
 
ప్రకృతి రక్షతి రక్షతః
Share This 
Tags
# feb2021
# కవితాఝరి
# ప్రతాప వెంకట సుబ్బారాయుడు
      
Share This 
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
Labels:
feb2021,
కవితాఝరి,
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
Subscribe to:
Post Comments (Atom)
 



 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment