సరిహద్దుల్లో సూర్యుడు
-డా॥ పోడూరి శ్రీనివాసరావు
9849422239.
సూర్యోదయమెంత అందంగా ఉంటుందో 
సూర్యోదయత్పూర్వమే దాన్ని దర్శించినవారికి, 
ఆ ఉదయభానుని నులివెచ్చని కిరణాలు 
ఆస్వాదించినవారికి మాత్రమే తెలుస్తుంది.
	మధాహ్నపు భానుడు చండప్రచండుడు 
	తనతీక్షణకిరణాల వాడితో 
	వేడినే కాదు... మంటలని పుట్టిస్తాడు
	మానసికానందం లేకుండా చేస్తాడు
అస్తమయ సూర్ముడి అందాలే వేరు!
గోధూళి వేళలో అరిణిమను 
ముఖమంతాపులుముకుని, రోజంతా 
కప్పపడ్డ శ్రామికునిలా దిగాలుగా.....
	దేశమంతా... వాడవాడలా..... 
	నగరాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో 
	సూర సొందర్యం వేరు..
	సరిహద్దులో పొద్దుపొడిచే సూర్యుడు వేరు. 
మిగిలిన దేశ భాగాల్లో సూర్య 
సౌందర్యం అనుభవిస్తాం.... 
ఆ దృశ్యాలకు ఎదురుచూస్తాం.... 
ఆ భగవానునికి పూజలు చేస్తాం!
	కాని... అసలు పూజలకు 
	అర్హులు వేరేవారున్నారు. 
	నిన్ను అనునిత్యం డేగ కళ్లతో కాపాడుతూ
	దేశమాతకంట కన్నీరు కారకుండా... 
అందరూ నిశ్చింతగా ఆనందంగా 
ప్రమోదభరితంగా జీవించడానికి 
కారకులు వారు.
అనునిత్యం, రాత్రనక పగలనక,
	తమకుటుంబాలకు అనేక వేల మైళ్ళ దూరంలో...
	నీకుటుంబం చల్లగా ఉండాలనే ధ్యేయంతో... 
	ఎముకలు కొరికే హిమవత్ నగాలలో
	నిద్రాహారాలను త్యజించి, నిత్యం నీ రక్షణకై 
కంకణం కట్టుకున్న భరతమాత 
ముద్దుబిడ్డలు వారు - సాయుధ 
రక్షణ మిలటరీ యోధులు వారు 
నీ రక్షణే - దేశరక్షణే - వారి ధ్యేయం !
	ఒకరాష్ట్రమనిలేదు - ఒక ప్రాంతమనిలేదు 
	మాతృ భూమి పరిరక్షణే వారి ముందున్న కర్తవ్యం 
	ప్రతీ ఒక్క సైనికుడు - ప్రచండ భానుడే!
	ముష్కరుల పాలిటి కాలయముడే! అరివీరభయంకరుడే! 
ఎదుట నిలిచున్న శత్రువు, ఎవరన్న భయంలేదు 
ఎందరున్నారన్న ఆలోచన లేదు – తక్షణ కర్తవ్యం 
వైరిని తుద ముట్టించడమే!
కొదమసింగంలా ఎగిరి దూకడమే!!
	అది పాకిస్తాను కుతంత్రమైనా -  చైనాదుశ్చర్య అయినా.., 
	రాజధానుల్లో సంధిమంత్రాలు జరుపుతూనే 
	సరిహద్దుల్లో బలగాలను మోహరించే
	ఆ దుష్టులు, దుర్మార్గుల వైఖరికి సరిఅయిన సమాధానం 
మనసైనికుల వీరోచిత పోరాటాలే  
ఈ పోరాటంలో ఎందరు అభిమన్యులు 
నేలకొరుగుతున్నారో - వీరమరణం పొందుతున్నారో! 
అయినా వారికది గర్వకారణం
	మాతృభూమికై ప్రాణాలొడ్డిన ఘనులుగా, 
	వీరఫుత్రులుగా చరిత్రలో స్థిరస్థాయులౌతారు. 
	మాతృభూమి దాస్య విముక్తికై
	అసువులు బాసిన అల్లూరిలా, భగత్ సింగ్ లా . . , 
జీవనదుర్భరమైన వాతావరణంలో...
ఎముకలు కొరికే శీతల పరిస్థితుల్లో.... 
కన్నుమూస్తే చాలు, ఏ ప్రక్కనుంచి  
ప్రమాద ఘంటికలు మ్రోగుతాయో అనిభయం ...
	అదాటున శత్రువుదాడి చేస్తాడని జాగరూకత...
	సరియైన సమయానికి పై అధికారులనుంచి స్పందన... 
	రావలసిన సహాయానికై, ఆతృతగా ఎదురుచూపులు...
	నలువైపుల నుండి నిరీక్షణగా సరిహద్దు సూర్యుని చూపులు!! 
ఎందరో వీరజవానులు జీవనపుషాన్ని 
భరతమాత పాదాలచెంతన సమర్పించిన 
మండే సూర్యులు - ప్రతీ ఒక్కరూ ప్రచండభానులే! 
మాతృదేశ రక్షణకై మరణాన్ని ముద్దాడిన, వీరకిశోరాలే!
	ఒక కల్నల్ సంతోష్ బాబని లేదు.... 
	ఒక హవల్దార్ పటాని, ఒక సిపాయి కుందన్, 
	ఒక సిపాయి కుందన్‌కుమార్, ఒకసుబేదార్ నందురామ్ 
	ఇలా ఎందరో... ఎందరోఅమరవీరులు...
సరిహద్దు రేఖలు చెరిపేస్తూ కొత్త రేఖలు నిర్వహిస్తూ
క్రొంగొత్త మ్యాపులు ముద్రిస్తూ, ప్రపంచాన్నే 
మోసగిస్తున్న కుల సంస్కృతి, వారిది... ముష్కరులది.
దేశరక్షణే పవిత్రకార్యంగా భావించేది మన భరతజాతి.
	1962లో చైనా దాడి చేసి కబళించాలని చూసినా...
	1970లో పాకిస్తాన్ జలాంతర్గాములతో దాడి చేసినా... 
	ఎంతో ఘనంగా తిప్పికొట్టి, విజయకేతనం ఎగరేసిన
	గొప్ప చరిత్ర...దేశవిదేశాలు ప్రస్తుతించిన ఘనచరిత్ర  
భరతమాత బిడ్డలం అంటూ గర్వంగా 
చెప్పుకొనేవీ, మన వీరజవానుల శౌర్యం, 
నింగి నుంచి నేల జారిన ప్రచండ భానులు 
మన వీరజవానులు. పరాక్రమంలో ఎవరికీ తీసిపోరు.
	మండుతున్న సూర్యుడిలా… 
	నేలమీద అరివీరభయంకరుడిలా... 
	రణ చాతుర్యంతో... అద్భుత సామర్ధ్యంతో 
	భరతమాత గౌరవాన్ని కాపాడిన 
	ఘనచరితులు - మన సరిహద్దు సూర్యుళ్లు 
వారికి కైమోడ్పు సమర్పిద్దాం! 
దేశరక్షణకై మనవంతు సాయమందిద్దాం! 
భరతమాత కీర్తిపతాకం ఎగరేద్దాం 
రెపరెపమంటూ ఆకశాన అద్భుతంగా.... 
విన్యాసభరితంగా, విహరిస్తుండగా... 
	జైభారత్! 
	జైజై భారత్ 
	వందేమాతరం - వందే భారతం 
	జై హింద్.... జైహింద్....
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment