నీ ప్రేమే నా శ్వాస 
   సుజాత. పి .వి. ఎల్. 
ఎప్పటికీ నువ్వు 
'నా ' అనే భ్రమలో 
బ్రతుకుతున్నా ..
నా గుండెల్లో నీకు గుడి కట్టి ,
నిత్యం ప్రణయ హారతులిస్తున్నా..
నీ ప్రేమనే 
నా శ్వాసగా మలచి 
శ్వాసిస్తున్నా. .
నిలకడలేని 
నీ మనసుని మార్చేందుకు 
నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నా ..
ఎప్పటికైనా నీలో 
మార్పు రాకపోదా?! అనే 
ఆశతో ఎదురుచూస్తున్నా!!
****
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment