అలవాటు చేసుకున్నాను..!
-సుజాత. పి.వి.ఎల్
అలవాటు చేసుకున్నాను
నన్ను నేనే బంధించుకోవడం 
మౌనంగానే దుఃఖించడం 
అలవాటు చేసుకున్నాను.
నన్ను నేనే శిక్షించుకోవడం
నిశ్శబ్దంగా గాయపరుచుకోవడం 
అలవాటు చేసుకున్నాను. 
నువ్వు లేవనే ధైర్యంతో నిరాశ
నాపై ఎక్కుపెడుతున్న శూలాలవల్ల
ఛిద్రమైన మనసు బాధని భరించడం 
అలవాటుచేసుకున్నాను.
కనికరం లేని కాలాన్ని నిందించుకుంటూ
మానసికంగా మరణించడం 
అలవాటు చేసుకున్నాను..!
****
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment