శ్రీరామకర్ణామృతం - 41
 సిద్ధకవి
 డా.బల్లూరి ఉమాదేవి.
101.శ్లో:పటుతర జలవాహధ్వాన మాదాయ చాపం
       పవన జవన మేకం బాణమేకృష్య తూణాత్
      అభయవచన దాయీ సానుజ స్సర్వతోమే
     రణహత దనుజేంద్రో రామచంద్ర స్సహాయః.
భావము:మిక్కిలి పటుత్వము గల మేఘము యొక్క ధ్వనివంటి ధ్వనిగల ధనుస్సును పట్టుకొని వాయువేగము కల యొక బాణమునంబులపొదినుండి తీసి యుద్ధమందు కొట్టబడిన రాక్షసశ్రేష్ఠులు  కలిగినట్టియు నభయవాక్యము నిచ్చునట్టియు తమ్మునితో కూడిన రామచందఅరుడు నాకు సహాయుడు.
.
తెలుగు అనువాదపద్యము:
జలధిధ్వాన సమాన ఘోరనినద జ్యాయుక్త చాపంబునన్
జ్వలనాప్తోజ్జ్వల వేగబాణము వడిన్ సంధించి దృష్టించి దో
ర్బలు బౌలస్త్యు వధించి నిర్భయులుగా భక్తాళి గావించి దా
 పల సౌమిత్రి చెలంగ చెన్నగు రఘుస్వామే సహాయుండగున్.
102.శ్లో:కౌసల్యాలసదాలవాల జనిత స్సీతాలతాంగిత
      . స్సిక్తః పంక్తిరథేన సోదర మహాశాఖాభి రత్యున్నతః
        రక్తస్తీక్ష్ణ నిదాఘపాటన పటుచ్ఛాయాభిరానందయన్
       అస్మద్వాంచిత సతఫలాని ఫలతు శ్రీరామ కల్పద్రుమః
భావము:కౌసల్య యనెడు ప్రకాశించుచున్న కుదురునందు బుట్టినట్టియు సీత యనెడు తీగచే కౌగిలించ బడినట్టియు
దశరథునిచే తడుపబడినట్టియు తమ్ములనెడి గొప్ప కొమ్మలచే మిక్కిలి పొడవైనట్టియు రాక్షసులనెడి గొప్ప వేడిని పోగొట్టుట యందు సమర్థమైన నీడలచే నానందింప చేయుచున్నట్టియు రాముడనెడి కల్పవృక్షము మాచే కోరబడిన మంచి ఫలములను పండు గాక.
.
తెలుగు అనువాదపద్యము
శా:కౌసల్యాలసదాలవాలము ధరాకన్యాలతాయుక్తమున్
   దాసాసక్తము నాజిపోషితము సోదర్య ప్రశాఖంబు ర
  క్షస్సుత్రామ నిదాఘతప్త జనరక్షాదక్షణా క్షీణ ఛా
 యా సంపన్నము రామకల్పతరు విష్టార్థంబు మాకీవుతన్.
103.శ్లో:నిగమ శిఖరరత్నం నిత్యమాశాస్య రత్నం
         జననుత నృపరత్నం జానకీరూపరత్నమ్
        భువనవలయరత్నం భూభుజామేకరత్నం
        రఘుకులవర రత్నం పాతుమాం రామరత్నమ్.
భావము:
వేదాంతములకు రత్నమైనట్టియు నిత్యము కొనియాడదగిన వారిలో శ్రేష్ఠమైనట్టియు మనుష్యులచే పొగడబడిన రాజులలో నుత్కృష్టమైనట్టియు సీత యొక్క రూపమునకు మాణిక్యమైనట్జియు లోకసమూహములలో శ్రేష్ఠమైనట్టియు రాజులలో ముఖ్యమైనట్టియు రవికుల శ్రేష్ఠులలో శ్రేష్ఠమైన రామరూపరత్నము నన్ను రక్షించు గాక.
.
తెలుగు అనువాదపద్యము:
మ.నిగమాంతోజ్జ్వల రత్న మార్యనుత మాణిక్యంబు సీతాసతీ 
     సుగుణ ప్రాచిత రత్న మర్కకుల భాస్వద్దివ్య సద్రత్నమున్ 
    జగదత్యద్భుత రత్నమున్ సకల రాజాస్థాన రత్నంబు స
    ర్వగతంబౌ రఘురామ రత్నము ననున్  రక్షించు నశ్రాంతమున్.
104.శ్లో:విశాల నేత్రం పరిపూర్ణ గాత్రం 
         సీతా కవిత్రయం సురవైరి జైత్రమ్
         కారుణ్య పాత్రం జగతః పవిత్రం
        శ్రీరామరాజ్యం ప్రణతోస్మి నిత్యమ్.
భావము: విశాలమైన కన్నులు కల్గినట్టియు నిండైన దేహము కలిగినట్టియు సీతాదేవి భార్య కలిగినట్టియు రాక్షసులను జయించు నట్టియు దయకు స్థానమైనట్టియు జగత్తును పవిత్రము చేయు నట్టియు శ్రీరామ రత్నము  నెల్లప్పుడు నమస్కరించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
చ: వికసిత పుండరీక దళ విశ్రుత నేత్ర సురారి జైత్రు సే
   వ కనుతి పాత్రు నీల ఘన వాసవ రత్న వీరాజి గార్లు దా
    రేకు కమలా కళ్లు ద్రిపుర ప్రకటాసుర జైత్రమిత్రునిన్
     సకల జగత్తును విత్తు రఘుసత్తమ రత్నము నాశ్రయించెదన్.
105.శ్లో:శ్రీరామచంద్రః శ్రితపారిజాతః
          సమస్తకల్యాణగుణాభిరామః
         సీతాముఖాంభోరుహ చంచరీకో
        నిరంతరం మంగళం మాతనోతు.
శ్లో:ఇందీవరదళ శ్యామః పుండరీకనిభేక్షణః
      ధృతకోదండ తూణీరో రామ ఏవగతిర్మమ.
భావము: ఆశ్రితులకు పారిజాత వృక్షమైన వాడును ఎల్ల శుభ గుణములచే మనోహరుడును సీత యొక్క ముఖపద్మము నకు తుమ్మెద యైనవాడును అగు శ్రీరామచంద్రుడు ఎడతెగని శుభమును జేయు గాక. నల్ల కలువరేకుల వలె నల్లనైన వాడును తెల్లని తామరలతో సమానములగు నేత్రములు కలిగినవాడును ధరించే బడిన ధనుస్సు ను అంబులపొదులును కలవాడగు రాముడు నాకు గతియు.
.
తెలుగు అనువాదపద్యము:
మీ: సరిత మంధరుడు సర్వ శోభన గుణ శ్రీరామ డా నందు డం
చిత సీతా వదనాబ్జ షట్పదము రాజీవాయతాక్షుండు మా
నితిన్ తూణీర ధనుర్ధరండు వరుడున్ నీలోత్పలాంభోద షో
భితుడౌ రాముడు మాకు చిక్కాయి శుభంబేనిచ్చలిచ్చుం గృపన్.
106.శ్లో:ఇచ్ఛామో హి మహాబాహుం రఘువీరం మహాబలమ్
         గజేన మహతా యాంతం రామం ఛత్రావృతాసనమ్.
భావము:
గొప్ప భుజములు కలిగి నట్టియు రఘువీరుడై నట్టియు గొప్ప బలము కలిగినట్టియు ఏనుగు నెక్కి వచ్చుచున్నట్టి యు  గొడుగు చేత ఆవరించబడిన మోముగల రాముని చూడ నిచ్చగించుచున్నాము.
.
తెలుగు అనువాదపద్యము:
మ:అనయంబుం గతి నీవె యంచు మతిమోహభ్రఅతి నొందించు నా
   ఘనబాహాబలు పుండరీక ధరు మేఘశ్యాము నాజాను బా
  హు నగాత్యున్నత నాగరాడ్గమను సర్వోత్కృష్టు రామున్ సనం
దన గమ్యున్ రఘువీరు నేనెదుట సందర్శింతు హర్షంబునన్.
107.శ్లో:రామో నామ బభూవ హుంతదబలా సీతేతి హుంతౌ పితు
         ర్వచా పంచవటీవనే విహరతస్తా మాహరద్రావణః
       నిద్రార్థం జననీకథామితి హరేర్హుంకారతః శృణ్వతః
         సౌమిత్రే క్వధనుర్ధరనురితి వ్యగ్రాగిరః పాంతు వః..
భావము:రాముడని ప్రసిద్ధుడుగలడు.ఊఁఅతని భార్య సీత యని గలదు.ఊఁవారు తండ్రియైన  దశరథుని మాటచే పంచవటీ స్థలమందు విహరించుచుండిరి.ఆమెను రావణుడెత్తుకొని పోయెను.ఇట్లు నిద్రబోవుటకై తల్లి చెప్పుకథను హుంకారముచే రినుచున్న హరి పలికిన ‘లక్ష్మణా యెక్కడ నుంటివి?ధనుస్సు తే ధనుస్సు తే అను తొందరమాటలు మిమ్ము రక్షించుగాక.(ఇది కృష్ణావతారమందు యశోద చెప్పు కథను నిద్రబట్టక కృష్ణుడు వినుచు పూర్వావతార చరిత్ర యౌటచే తొందర మాటలు చెప్పునట్లు తెలుపు శ్లోకము.ఇది కృష్ణకర్ణామృతంలోనిది కావచ్చును.కవితా శైలి కూడా అట్లే యున్నది.)
.
తెలుగు అనువాదపద్యము:
మ:తనయున్ నిద్దుర పుచ్చి తల్లిపలికెన్ ధాత్రీస్థలిన్ రాఘవుం
  డన జెన్నొందిసభార్యుగా దశరథుండంపన్ వనిం జేర సీ
 తను గొంపోయె దశాస్యుడన్న వినినంతన్ వ్యగ్రుడై లక్ష్మణా ధనువు తెమ్మను బాలరాముని కటూక్తంబుల్ ననుం బ్రోవుతన్.
108.శ్లో:శ్రీరామచంద్ర వరదేతి దయాపరేతి
            భక్తప్రియేతి భవబంధనమోచనేతి
              నాథేతి నాగశయనేతి సదా స్తువంతం
            మాంపాహి భీత మనిశం కృపణం కృపాళో.
భావము:శ్రీరామచంద్రాయని వరమిచ్చువాడా అని దయాసక్తుడా యని భక్తులు ఇష్టులుగలవాడా యని నాథా యని శేషశయనుడా  యెల్లపుడు స్తోత్రము చేయుచున్నట్టి భయపడుచున్నట్టి దీనుడనైన నన్ను ఓదయాస్వభావుడా రక్షింపుము.
.
తెలుగు అనువాదపద్యము:
చ:హరి రఘురామ చంద్రుడు దయాపరు డాశ్రిత వత్సలుండు దు
సఅతర భవబంధ మోచనుడు సర్పశయానుడు విశ్వనాథుండం
చరసి నిరంతరంబు హృదయంబున నెంచగ నెంతవాడ ము
ష్కరుడను లుబ్ధుడం దురితకర్ముడ బ్రోవుము రామ రాఘవా.
109.శ్లో:రామచంద్ర చరితామృత పానం 
          సోమపాన శతకోటి సమానమ్
           సోమపాన శతకోటి భిరీయా
            జ్జన్మనైతి రఘునాయక నామ్నా.
భావము:
రామచంద్రుని చరితామృతమును ద్రాగుట బహుసోమ పానములతో సమానము.మనుష్యుడు బహుసోమపానములచే జన్మమును బొందుము.శ్రీరామనామముచే జన్మమును బొందడు.
.
తెలుగు అనువాదపద్యము:
చ:అరయగ శరామచంద్ర చరితామృత పానసమానమై తగున్
 గురుతర సోమ పాన శతకోటులు తద్విధ సోమపాన ని
ర్భరులకు జన్మముల్ గలవు రామసమాఖ్య నిరంతరంబు సు
స్థిరత జపించు వారలకు జేకుర నేరవు జన్మకర్మముల్.
110.శ్లో:రామరామ దయాసింధో రావణారే జగత్పతే
         త్వత్పాద కమలాసక్తిర్భవే జ్జన్మని జన్మని.
భావము:ఓ రామా !రామా !దయాసముద్రుడా నీపాదపద్మములయందాసక్తి ప్రతిజన్మమందు కల్గుగాక.
.
తెలుగు అనువాదపద్యము:
హరిహరి రామరామ కరుణాంబునిధీ జగదేకనాథ దా
శరథి దశాననాద్రి కులిశాయుధ నాదగు విన్నపంబు సా
  దరమున జిత్తగింపు క్రమతన్ భువి జన్మములెన్ని  గల్గినన్
 సరసభవత్పదాంబుజ రజఃకణసేవ యొనర్చునట్టుగాన్.
111.శ్లో:శ్రీరాఘవం రామచంద్రం రావణారిం రమాపతిమ్
          రాజీవ లోచనం రామం తం వందే రఘునాయకమ్.
భావము:శ్రీరాఘవుని రామచంద్రుని రావణ శత్రుని లక్ష్మీనాథుని పద్మములవంటి నేత్రములు కలవానిని రఘునాయకుని  ఆరాముని నమస్కరించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
ఉ:శ్రీరఘురామ చంద్రునకు శ్రీకర మూర్తికి రావణారికిన్ 
శ్రీరమణీమణీపతికి సేవితయోగిహృదబ్జ వాసికిన్ 
సారసపత్రనేత్రునకు సన్నుతమౌని సుపర్వకోటికిన్
శౌరికి రాఘవేంద్రునకు సంతతమేను నమస్కరించెదన్.
112.శ్లో:యత్పాదపంకజరజః శ్రుతిభిర్విమగ్నం
          యన్నాభిపంకజభవః కమలాసనఃస్యాత్
            యన్నామ సారరసికో భగవాన్ పురారి
             స్తం రామచంద్ర మనిశం హృది భావయామి.
భావము:ఏరాముని పాదపద్మములయందలి ధూళి వేదములచే తెలియ శక్యముకాదో బ్రహ్మ యెవ్వని నాభిపద్మమందు పుట్టెనో భగవంతుడైన శివు డెవ్వని నామసారరసమెరిగినవాడో యట్టి రామచంద్రు నెల్లప్పుడు హృదయము నందు ధ్యానించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
ఉ:ఎవ్వని పాదపద్మరజమెల్ల శ్రుతుల్ వెదుకంగ నేరకుం
డెవ్వని నాభికంజమున నేర్పడ సంభవమొందె గీర్వరుం
డెవ్వని నామసారము భజించి బుధాగ్రణి యయ్యె శంకరుం
డవ్విభు రామభూధవు నహర్నిశమున్ మది సంస్మరించెదన్.
113.శ్లో:యస్యావతార చరితాని విరించిలోకే
       గాయంతి నారదముఖా భవపద్మజాద్యా
         ఆనందజాశ్రు పరిషిక్త కుచాగ్ర సీమా
          వాగీశ్వరీ చ తమహం శరణం ప్రపద్యే.
భావము:ఏ రాముని యవతారచరిత్రములను బ్రహ్మలోకమునందు నారదుడు మొదలగు వారును శివుడు బ్రహ్మ మొదలగు వారును ఆనంద బాష్పములచే తడుపబడిన స్తనాగ్రప్రదేశముగల సరస్వతియు గానము చేయుదురో అట్టి రాముని నేను శరణము పొందుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:ప్రకటంబైన విరించి లోకమున నేభవ్యాత్ము దివ్యావతా
   రకథల్ కీర్తన జేతురబ్జభవ శర్వాణీశ ముఖ్యామర 
  ప్రకరంబార్యులు నారదాదులును గీర్భామా మహానందబా
  ష్ప కణార్ద్రస్తనయై స్మరించు నెపుడా క్ష్మాజేశు సేవించెదన్.
114.శ్లో:జాతిభ్రష్టో తిపాపి పరధనపరదారేషు నిత్యోద్యతోవా
     స్తోయీ బ్రహ్మఘ్న మాతాపితృ వధనిరతో యోగిబృందాపకారీ
      ధ్యేయం కర్ణామృతం యః పఠతి హిసతతం రామచంద్రస్య భక్తో
        యోగీంద్రైరప్యశభ్యం పదమపి లభతే సర్వదేవైశ్చ సేవ్యం.
భావము:కులభ్రష్టుడైనను పాపాత్ముడైనను ఇతరుల సొమ్మునందితరులభార్యలందాసక్తుడైనను   దొంగయైనను బ్రహ్మహత్య చేసినవాడును తల్లిదండ్రులను గొట్టుటయందాసక్తుడైనవాడును మునిసమూహమునకపకారము జేయువాడైనను ఏభక్తుడు ధ్యానింపదగిన రాముని కర్ణామృతమును ఎల్లపుడు చదువుచున్నాడో అట్టివాడు యోగీశ్వరులకుసైతము బొంద శక్యముగానట్టి యెల్ల దేవతలచే సేవింపదగిన స్థానమును బొందుచున్నాడు.
.
తెలుగు అనువాదపద్యము:
మ:పరభామా పరవిత్త సంగ్రహుడు  విప్రఘ్నుండు చోరుండు దు
     స్తర పాపాత్ముడు మాతృపిత్రహడువంశభ్రష్టు డార్యోత్తమో 
       త్కర నిందాస్పదుడైన బో నియతుడై కర్ణామృతంబుంబఠిం
  ప రహిన్ యోగులకందరాని పదముం బ్రాపించు గాఢంబుగాన్.
మ:శివసామ్యుండగు నాదిశంకరులు మున్ శ్రీరామకర్ణామృతం
  బవనిన్ సంస్కృతమేర్పరించె నిదిమోక్షాపేక్ష చేకూరు వం
   శవరాబ్ధీందు ప్రసిద్ధసిద్ధకవి  నేశ్రద్ధం దెనింగించి రా
 ఘవ పూదండగ నిచ్చినాడ గొనుమా కల్పంబుగా సత్కృపన్.
మాలిని  :వనదనిభ శరీర వర్ణితామర్త్యహారా
            కనకశిఖరిధీరా కంధిగర్వాపహారా 
          దనుజ ఘన సమీరా ధాత్రిజాచిత్తచోరా
          మునిజనసువిచారా మోక్షలక్ష్మీ విహారా
మ   :ఇది శ్రీరామ పదారవింద మకరందేచ్ఛాతి సన్మత్త ష
       ట్పద విజ్ఞాన పదాబ్జ రేణు పటల ప్రాపోత్తమాంగోల్ల స
      న్ముదితాంతఃకరణుండు సిద్ధకవి మాన్యుడైన రామావనీ 
       శ దయాలోకన జెప్పె మూడవగు నాశ్వాసంబభీష్టాప్తికిన్.
     శ్రీరామ కర్ణామృతంలోని మూడవ ఆశ్వాసం సంపూర్ణం.
చిరునామా. 
Dr.B.UMADEVI 
2--106,Nandagokula 
KAMAVARAM POST 
KOWTHALAM mandalam 
A A S College post 
PIN:518302. 
KURNOOL (DIST) 
A.P
ph:9493846984.
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment