
 
 
ధర్మసంస్థాపనార్ధం - పుట్టారంటారు ! 
త్రేతాయుగం లో 'శ్రీరాముడు' -
ద్వాపర యుగం లో  'శ్రీకృష్ణుడు' -
మరి...?ఈ యుగం లో- ఎవరున్నారు?
ఉన్నారున్నారు - కొందరున్నతులు!
స్వతంత్ర్యసంరక్షణార్ధం 'గాంధీజీ' లు,
సతీ  సహగమనాన్ని వ్యతిరేకవ్యక్తి  - 
రాజారామ్మోహన్ రాయ్ మహనీయుడు!
వితంతువుల స్థితిమార్చిన  కందుకూరి, 
స్త్రీ విద్యను,స్త్రీస్వంతంత్ర్య న్ని,
స్త్రీ కార్యదక్షతనూ  గుర్తించి,చాటిన -
మహిళామణి...'దుర్గాబాయ్' మేటి నారి !
ఇన్ని మారినా  'సంఘం' లో....  
'హింస'...'లంచగొండితనం'.... 
మిత్రద్రోహం,అవినీతి,దేశద్రోహం,
వీటిని మించిన ఆత్మద్రోహం - 
అతిసామాన్యాలు ఈనాడు!
'కలికాలమహిమ' అని కొందరు,
'వినాశకాలం' అని కొందరు, 
'పిదపకాలం' అని  కొందరు, 
కాలాన్ని ఆడిపోసుకునే వాళ్ళైతే....
సద్గుణసంపన్నులు, పరోపకారులు, 
స్వపరభేదం లేనివాళ్లు , ఆడితప్పనివాళ్ళు ,
మైత్రీసంస్కారులు - పరాధీనత ఒల్లనివారు -
కూడా ఈ  'సంఘం'  లోనే మసలుతున్నారు ! 
మంచి - చెడుల సంగమమే... 
పాత - క్రొత్తల కలయికయే.....
కఠిన - మృదు  సమ్మిళితమే -
మన జనజీవన సంకలనము !
వేదకాలమునాటినుండియూ...
ఈ ద్వంద్వాలన్నీ సామాన్యమేగదా ? !
మనిషి -  మనీషిగా   ఎదిగి , ద్వoద్వా తీతుడై -
సమర్థుడై , ప్రపంచ శాంతి  చేకూర్చే సరైన
మార్గగామి  కావాలి - అప్పుడు  కార్యసిద్ది అనివార్యం !!   
*** 
 
 
 
       
    
 
 
 
 
            
          
 
 
 
 
No comments:
Post a Comment