నా మనోవాంఛిత ‘ప్రకృతి స్వరూపం’  
 దినవహి సత్యవతి 
ఉషోదయాన  వీచే చల్లని పిల్లగాలులు 
పిల్లగాలులకు పరవశిస్తున్న రంగుల గులాబీలు 
గులాబీలనుండి వెలువడుతున్న సుగంధ పరిమళాలు 
పరిమళాలు నాసికాపుటములను త్రాకి మదిని మైమరపింపజేస్తుంటే.....  
ఎటు చూసినా పచ్చ పచ్చటి పంట చేలు 
చేలలో ఏపుగా ఎదిగి కోతకొచ్చిన పంట 
పంట కోస్తూ పడుచులు తీసే కూని రాగాలు     
కూని రాగాలు వీనుల విందుగా మనసును పరవసింపజేస్తుంటే.....
నీటితో నిండి కళ కళ లాడుతున్న నదులు , చెరువులు    
చెరువులలో ఉత్సాహంగా ఈత కొడుతూ  పిల్లలు కేరింతలు  
కేరింతల తాకిడికి  సున్నితంగా ప్రతిధ్వని
చేస్తున్న గిరులు  
గిరులనుండి వీస్తున్న మలయమారుతాలు తనువును ఆహ్లాదింపజేస్తుంటే.....
ఎచ్చోట కేగినా  విశాలమైన రహదారులు
రహదారులకు ఇరువైపులా నీడనిచ్చే తరువులు  
తరువులపై  నెలవులేర్పరుచుకుని
జీవిస్తున్న విహగములు   
విహగముల కిలకిలారావాలు కర్ణములను తాకి  మదిని మురిపింపజేస్తుంటే .....
చల్లని గాలులు, నీటితో నిండిన జలాశయాలు, పచ్చటి
పంటచేలు, 
నీడనిచ్చే పచ్చని తరువులు, విహగముల కిలకిలారావాలు మిళితమై 
అచ్చెరువుగొలిపే  సౌందర్యాలు  హృదయమును రంజింపజేస్తుంటే..... 
ఇంత సౌందర్యాన్ని నింపుకున్నదే  నా మనోవాంఛిత
...... ‘ప్రకృతి స్వరూపం’          
****
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment