"రామ స్తుతి"
ఆటవెలది
ఆండ్ర లలిత.
మదిన పూజ చేయ మనసున పూనితీ
నాదు హృదయవీణ నాదములను
పలుకనీయ వయ్య పావన గుణరామ
రామ జపమె మాకు రామ రక్ష॥
రామ నామ పలుకరారె నోరారగ పాడితినినె సరళ పదము రామ నీదు పాదమేను నిత్య శరణ్యంబు రామ పదమె మాకు రామరక్ష॥
రామ కథను పాడె రమణులు చక్కగా తనువు పులకరించి తహతహలతొ రామ పిలచి రంత రమ్య కీర్తన తోడ రామ జపము మాకు రామ రక్ష॥
కోమలాంగులంత కోరిక మీరను సీత రామ పెండ్లి సేసిరమ్మ సాల సక్కగాను సేరి భక్తితొసేసె రామ పలుకు మాకు రామ రక్ష॥
రామ నామ మునతొ రావు కష్టాలుగ నీదు జపము తోనె ఈదితినిగ ఒడ్డు సేరి నపుడు కొండంత సుఖములు రామ జపము మాకు రామ రక్ష॥
సీత మనసు సల్ల శీతాంచలమొలెను సంతతి మది యెరిగి సంతసించు తల్లి మనసు కరుగు తలచినంతనుగద రామ చెలిమి మాకు రామ రక్ష॥
సూడ సక్క సుక్క సుందరి మా సీత సక్కనైన రామ సల్లగేలు చూచి పొగడ జనులు ఉత్కంఠమందాలు రామ దయయె మాకు రామ రక్ష॥
మమ్ము యేలుకోవ మా దాశరథి రామ రాముడంత వాడు రాజ్యమేల ధర్మ పాలనందు ధర్మము శోభిల్లు రామ దయయె మాకు రామ రక్ష॥
జనుల నేలువాడు జానకి రాముడు జనని సీతనేలు జనుల మనసు మాత పితృలు ఏలు మమ్మును మనసార రామ పదము మాకు రామ రక్ష॥
మాత పితృలు యిచ్చు మమతలు ముమ్మారు కంటి రెప్పలాగ కాపడెదరు ఎంత చల్లనోయి ఇంతుల భాగ్యము రామ పలుకె మాకు రామ రక్ష॥
రామ రామ యనిన రమ్యముగుండును పదము పలికినంత పొందె సుఖము రామ నామమేను రక్షణ మనలకు రామ పలుకె మాకు రామ రక్ష॥
***
 
 
       
    
 
 
 
 
            
          
 
 
 
 
No comments:
Post a Comment