అజరామర సూక్తి -- 2
- చెరుకు రామమోహనరావు
అజరామర సూక్తి -- 3
रोहते सायकैर्विद्धं वनं परशुना हतम् वाचा दुरुक्तं भीभत्सं न सम्रोहति वाक्क्षतम्
- महाभारत, उद्योगपर्व
రోహతే సాయకైర్విద్ధం వనం పరశునా హతం
వాచా దురుక్తం భీభత్సం న సం రోహతి వాక్క్షతం
- మహాభారతము, ఉద్యొగపర్వము
అలుగు (బాణపు మొన) చేత కలుగు గాయము కాలాంతరము లో మానుతుంది. గొడ్డలి వ్రేటుకు గురియైన చెట్టు కాలాంతరమున చిగురించుతుంది కానీ మనమున నాటిన మాటలు వెలికి తీయలేము కదా.
తెలుగు మహా భారతములోని ఉద్యోగ పర్వములోని విదుర నీతి లో ఈ భావము ఈ పద్యరూపములో వుంది:  తనువున విరిగిన యలుగుల  ననువుగ బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్  మనమున నాటిన మాటలు వినుమెన్ని నుపాయముల వెడలునె యధిపా
______________________________
అజరామర సూక్తి -- 4
आरभन्तेऽल्पमेवाज्ञाः कार्यं व्यग्रा भवन्ति च महारम्भाः कृतधियः तिष्ठन्ति च निराकुलाः- शिशुपालवध -- माघ कवि
ఆరభంతేల్పమేవాజ్ఞాః కార్యం వ్యగ్రా భవంతి చ
మహారంభాః కృతధియః తిష్ఠంతి చ నిరాకులాః
- శిశుపాలవధ -- కవి మాఘుడు
అల్పులు అతి చిన్న విషయమును చేయ చేపట్టినా అల్లరి , అతిశయము తప్ప, అన్యథా ఏమీ ఉండదు. 'ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై' అని భర్తృహరి మహాశయులు కూడా తమ సుభాషితాలు (నీతి శతకము ) లో మాట జ్ఞాపకము వస్తూవుంది ఈ సందర్భములో. ఆయనే ఇంకొక అడుగు ముందుకు వేసి 'ఆరంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్' అని అన్నారు. ఈ గుణాలు రెండింటిని మహాకవి మాఘుడు అల్పులకే అంటకట్టినాడు. ఇక విజ్ఞులు, ధీరులు , పరోపకారులు అయిన మహనీయులు 'విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యోన్నతోత్సాహులై ప్రారభ్దార్థము నుజ్జగించారు సుమీ ప్రాజ్ఞానిధుల్ కావునన్' అని అన్నారు భర్తృహరి గారు. మాఘ మహాకవి గారు కూడా అదే విషయాన్ని నొక్కి వాక్కాణించుచున్నారు. మహనీయుల మనసులలో కూడా ఎంత భావ సారూప్యము ఉంటుందో కదా !
 ___________________________
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment