బీరపొట్టు ఊరగాయ 
పెయ్యేటి శ్రీదేవి
కావలసిన పదార్థాలు: బీరతొక్కులు కొంచెం చెక్కులు తీసిన బీరకాయ ముక్కలు మామిడికాయ గాని, చింతపండు గాని ఎండు కొబ్బరిపొడి పచ్చిమిరపకాయలు ఉప్పు, కారం, పోపు దినుసులు
           మిక్సీలో బీరతొక్కులు, చిన్న బీరకాయ ముక్క, మామిడి ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చెయ్యాలి.మూకుడులో నూనె కొంచెం ఎక్కువ వేసి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేగాక, బీరతొక్కు వేసి, ఉప్పు, కారం వేసి కలపాలి.  ఎక్కువ వేగక్కర్లేదు.  కొంచెం ఎండు కొబ్బరిపొడి కలపాలి.  చెక్కుతీసి తరిగి పెట్టుకున్న పచ్చి బీరకాయముక్కలు, కొంచెం మామిడికాయ ముక్కలు వేసి కలపాలి.  మామిడికాయ బదులు చింతపండు గుజ్జుతో కూడా చెయ్యవచ్చు.  ఈ విధంగా చేసి చూడండి. 
********************
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment