చక్కిలాలు
- ఉషారాణి నూతులపాటి
సంక్రాంతి పండుగ రాబోతోంది. కొత్త ధాన్యం ఇంటికివస్తుంది. ఈపండుగ పిండివంటలు  ముఖ్యంగా కొత్తదాన్యం  ఉపయోగించి చేసుకునేవే ..కొత్త బియ్యంతో అరిసెలూ , జ౦తికలూ, చక్కిలాలూ చేసుకుంటాం. కొత్తబెల్లం, నువ్వులూ కూడా విరివిగా వాడుతూ చేసుకునే పిండివంటలూ రుచికీ , ఆరోగ్యానికీ చాలా మంచివి. ఇప్పుడు స్వీట్ షాపులూ ,స్వగృహాలూ వచ్చి ,ఇంట్లో వండుకోవడం మానేసాం కానీ ..కొన్ని పిండివంటలు చేసుకోవడం చాలా తేలిక..  నిజానికి ఈరోజుల్లో గాస్ స్టవ్ లూ ,మిక్సీలూ ,పిండిమరలూ ..అందుబాటులో వున్నాయి మనకి. పూర్వంలా పిండి రోకళ్ళతోదంచడమో, విసుర్రాయితో విసరడమో చేసే శ్రమ లేదు. ఒక్కరోజు 2,3 గంటలు కష్టపడితే కనీసం 3 రకాల పిండివంటలు చేసేసుకోవచ్చు. నాణ్యమైన వంటనూనెలు వాడుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు .                             
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment