బొడ్డుకోసిన మరునాడే
కేర్ సెంటర్లో కేర్ మన్నోడు.
తల్లి ఒంటి అనురాగమేం తెలుసు?
బంగారు చంచా నోటకరుచుక పుట్టినోడు
వేప పుల్ల చేదు మర్మమేం తెలుసు? 
తూర్పు విసిరిన సెంటుబుడ్డిలో మునిగినోడు
తొలకరి జల్లుల రేగే మట్టివాసనేం తెలుసు?
పదమూడు వయసులోనే రుచులన్నీ మరిగినోడికి
సంప్రదాయాల విలువలేం తెలుసు ?
ఇంటి సంబరాన్ని ఈవెంటోడు చెప్పినట్లు చేసెటోడికి 
చేయి చేయి కలిపి సంబురపడే
ఉమ్మడి బంధాలేం తెలుసు? 
కరెన్సీ కాగితాలనెరవేసి విలువలని కొనాలనే వాడిని
కార్పోరేట్ బాబాలెవరైనా ఉంటే చూపించండ్రా
కాస్తమనిషితనం నేర్పించండ్రా.
***
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
నా కవిత ప్రచురించి ప్రొత్సహించిన సంపాదకులకు
ReplyDeleteధన్యవాదాలు