తెలుగు సంవత్సరాలు - ప్రత్యేకత - అచ్చంగా తెలుగు

తెలుగు సంవత్సరాలు - ప్రత్యేకత

Share This
తెలుగు సంవత్సరాలు - ప్రత్యేకత
శారదాప్రసాద్ 


తెలుగువాళ్ల చాంద్రమానాన్ని అనుసరిస్తారు.కల్పంలో మహాయుగాలు, యుగాలు ఉన్నాయి. ప్రతీవాటికి ధర్మాలు మారుతూంటాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా సంవత్సరాల పేర్లనుబట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. తెలుగు సంవత్సరాలు 60. ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తయితే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ ప్రభవతో ప్రారంభమవుతుంది.ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలు ఉన్నాయి. ఒక ఐతిహ్యం ప్రకారం శ్రీకృష్ణుడికి 16100మంది భార్యలు. వారిలో సందీపని అనే రాజకుమారికి 60మంది సంతానం. వారిపేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారన్న మరో కథకూడా ప్రచారంలో ఉంది. దక్షప్రజాపతి కుమార్తెల పేర్లుకూడా ఇవేనని అంటారు.  అయితే హేతుబద్ధంగా ఆలోచిస్తే,అరవై సంవత్సరాలకొకసారి మనోధర్మాలతో పాటుగా మానవధర్మాలు మార్పు చెందుతూ ఉంటాయి.బుద్దిశక్తి కూడా 
మనకు అరవై సంవత్సరాల వరకు మాత్రమే చురుగ్గా ఉంటుంది.ఆ తరువాత క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.శరీరంలోని అవయవాలు పటుత్వాన్ని కోల్పోతాయి.
అరవై సంవత్సరాల లోపల మృత్యువు ఒకసారి తన ప్రభావం చూపిస్తుందట.అందుకే 59 వ ఏట ఉగ్రరధ శాంతిని జరుకుంటారు కొందరు.అంటే మృత్యువు ఉగ్రంగా దగ్గరకి వచ్చి పోతుందన్నమాట!ఆ  తరువాత ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి మృత్యువు ఒకసారి పలకరించి పోతూ ఉంటుంది అని చెబుతారు.అందుకే అరవై సంవత్సరాలకు షష్టి పూర్తి చేస్తారు. 

మన తెలుగు సంవత్సరాలు,తెలుగు - నెలలు, సంవత్సరాలు, అంకెలు
తెలుగు నెలలు : తెలుగు నెలలు పన్నెండు.
నెలకు ముప్పై రోజులు. పదిహేను రోజులు ఒక పక్షం. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి)తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. అందమైన తియ్యని భాష మన తెలుగు భాష సాధారణంగా ఎంతోమందికి తెలుగు సంవత్సరమంటే పైవిధంగా మాత్రమే తెలిసి ఉంటుంది. కాని తెలుగు సంవత్సరాలకు అరవై (60) పేర్లు ఉన్నాయని, ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారని కొందరికి మాత్రమే తెలిసి ఉంటుంది.మనం మర్చిపోయిన కొన్నిటిని గురించి తెలుసుకుందాం!ప్రభవ 'నామ' సంవత్సరంతో ప్రారంభమై 'అక్షయ నామ' సంవత్సరంతో అరవై సంవత్సరాలు ముగిసి మరల 'ప్రభవ' ప్రారంభమై నట్లుగానే మనిషి కి 60 పూర్తి అయిన తరువాత 'బాల్యావస్థ' మొదలవుతుంది.అంటే చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటారు.అకారణంగా అలగడం, అవీ ఇవీ తినాలని అడగడం. చిరుతిళ్ళకోసం చిరుదొంగతనాలు చేయడం.  చిన్నపిల్లల లాగ ఎక్కువ సేపు నిదుర పోవడం, చిన్న విషయాలకే ఆనందపడడం, కోపం తెచ్చుకోవడం.... ఈ విధంగా పిల్లలు ఎలా చేస్తారో అలాగే పెద్దలు కూడా చేయటం మనం గమనించాం.అరవై తరువాత తన బిడ్డకు తనే బిడ్డ అయి పోతారు తల్లి దండ్రులు.అందుకే అరవై సంవత్సరాలు నిండిన తల్లి దండ్రులను తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని చెబుతుంది ధర్మశాస్త్రం.మన తెలుగు సంవత్సారాలు అరవై వరకు మాత్రమే ఉండడంలో అంతరార్ధమిదే. 
తెలుగు నెలలు
1. చైత్రము 
2. వైశాఖము 
3. జ్యేష్ఠం 
4. ఆషాఢము
5. శ్రావణము
6. బాధ్రపదం 
7. ఆశ్వయుజము 
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము 
12. ఫాల్గుణము

తెలుగు సంవత్సరాలు
1. ప్రభవ 
2. విభవ 
3. శుక్ల 
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి 
6. అంగీరస 
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాది
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్థివ
20. వ్యయ
21. సర్వజిత్తు
22. సర్వధారి
23. విరోథి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవిళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృతు
37. శోభకృతు
38. క్రోథి
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృతు
46. పరీధావి
47. ప్రమాదిచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాళయుక్తి
53. సిద్ధార్థి
54. రౌద్ర
55. దుర్ముఖి
56. దుందుభి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ
***

No comments:

Post a Comment

Pages