చేదు మామిడి - అచ్చంగా తెలుగు

చేదు మామిడి

Share This
చేదు మామిడి 
సాగర్ లంకా  
                 

పరంధామయ్య పక్క పరుచుకుంటూ "ఏమోయ్,మంచినీళ్లు తగలెట్టావా."అన్నాడు అనే కంటే ఆ,రిచాడు.. రాగిచెంబునిండా మంచి తీర్ధం నింపి,మూత  పెట్టి పక్క ప్రక్కన పెడుతూ ' ఇంతోటిదానికి తగలేట్టటాలెందుకు,ఈ ఎండలకి  అవె  మరుగుతాయి,' మూతి విరుస్తూ అంది భార్య రుక్మిణమ్మ.'ఆ పెడసరం మాటలే వద్దన్నది,' పక్క ని పదోసారి దులుపుకుంటూ  అన్నాడు పరంధామయ్య. పక్కనుంటే పందిరిమంచంఎమేం కాదు.పది పాత  చీరలు,పంచెలూ కలిపి కుట్టిన బొంత.,దానిమీద ఒక ఉతికిన  పాత పంచె. ఇది పరంధామయ్య జీవితం.
పెద్దకొడుకు,రాధాకృష్ణ,  బెంగుళూరులో సా ఫ్ట్ వేరు  వుద్యోగం ,చిన్నకొడుకు ,సీతారాముడు,బొంబాయిలో ఒక కంపెనీలు సెక్రటరీవుద్యోగం చేస్తున్నా, తనుమాత్రం ఈ పెద్దలిచ్చిన ఈ పెంకుటింటి వరండాలో ఈ విధంగా పడుకోవడం మానలా .రోజూ తెల్లవారుఝామున 4.00కి లేవటం, కాలకృత్యాలు ముగించుకొని, చేదబావినీళ్ళతో స్నానం, సంధ్య, పార్ధీవలింగార్చన చేసి స్వయంగ వండిన పులగం నైవేద్యం పెట్టడంతో ఇంట్లోదినచర్య పూర్తవుతుంది.తర్వాత గుడిలో రాముడిపూజ పునస్కారాలు ముగించి వూళ్ళో పనులకు వెళ్తాడు.సాయంత్రమయ్యేసరికి ధావళి ధరించి సంధ్య ముగించి, ఉతికిన పంచె కట్టి, గ్లాసెడు మజ్జిగ తాగి పడుకోవటం ఈయన అలవాటు,రుక్మిణమ్మకి  పుల్లవిరుపు మాటలతో ఆయన్ని విసిగించటంరివాజు.పిల్లలు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా,పరంధామయ్య ,ఆ ఊరిని, ఆ ఊరి రాముణ్ణీ వదిలి వెళ్ళలేదు. వారసత్వముగా వచ్చిన రామాలయం  పూజారి పదవి,వూరి పౌరోహిత్వాన్ని నమ్ముకొని, వూళ్ళోవాళ్లకు మంచి చెడులు చెబుతూ ఇప్పటిదాకా 70 గడిపాడు.పెళ్లయ్యేనాటికి రుక్మిణమ్మకు 16 ఏళ్ళు ,పరందామయ్యకు20ఏళ్ళు.రేపొచ్చే ఉగాదికి వాళ్ళు50 ఏళ్ల వైవాహిక జీవితం  పూర్తి చేసుకుంటారు.ఎన్ని మాటలనుకున్న, అరుచుకున్న,వాళ్ళమధ్య ఆప్యాయతలు అభిమానాలు పెరిగాయి గాని తరగలేదు.గుడినుండివచ్చి బయటకు బయలుదేరబోతున్న పరంధామయ్య'పంతులుగారో!' అన్న ఆవూరి రెడ్డిగారి పాలేరు కేకతో,'ఏంట్రా?'అంటూ ఆగిపోయీడు.
'పంతులుగారూ,రెడ్డిగారు, ఈ సారి రామనవమికి, రాములోరి పెళ్ళి మిమ్మల్నె జరిపించుకోమని చెప్పమన్నారండి .ఆరికి కుదర్దని చెప్పమన్నారండి. 'అంటూ వార్త చెవినేసి వాడి పనైపోయిందన్నట్టుగా వెళ్ళిపోయీడు.
పరంధామయ్య గుండె గుభేల్మంది. శ్రీరామనవమి జరిపించటమంటే మాటలా, ఎంతఖర్చు, ఎంత శ్రమ.గుడిచుట్టూ తాటాకుపందిళ్ళ వేయించడం,ప్రసాదాలు చేయించడం,గుడికి వెల్ల వేయించడం, రాములవారికి పట్టుపంచలు, సీతమ్మవారికి పట్టుచీరలూ, తలంబ్రాలు, పానకాలు, వడపప్పు, తప్పెట్లు, తాళాలు, బాజాబజంత్రీలు, మైకులు, పాటలహోరు, సాయంత్రం సీతమ్మ జడకుప్పెల కోలాటాల పోటీలు, రాత్రికి హరికధలు నాటకాలు--అబ్బో ఇవన్నీ నిభాయించటమా!!తనవల్ల కాదు.దేముడిమాన్యం అంటూ ఇచ్చిన అరెకరం  భూమీ ఆ రాములోరి నైవేద్యాలకే సరిపోకపోతే, ఈ కార్యం తనవల్ల కానేకాదు. ఏం చెయ్యాలో పాలుబోక,'ఏమోయ్ ఒకసారిలా రా,',భార్యను కేకేశాడు.ఏం కొంపలు మునిగాయో ,ఈయన మళ్ళీ అగ్ని హోత్రావధాన్లులాగా అరుస్తున్నాడు అనుకుంటూ,'ఏమయిందండీ ,'అంటూ గబగబ వరండాలో కి వచ్చింది రుక్మిణమ్మ.'ఈమారు సీతారాముల కళ్యాణం మనం నిర్వహించాలిట.తనకు కుదర్దని రెడ్డిగారి కబురు,'తన అసక్తతను ఉక్రోషంతో వెలిబుచ్చాడు.కుదర్దంటే, మనకూ కుదర్దని చెప్పండీ.రెండ్రోజుల్లో ఉగాది. పిల్లల్లొస్తునన్నారా,  వాళ్ళేదో మన 50వ పెళ్ళిరోజు స్వర్ణోత్సవం చేస్తామంటే, వాళ్ళదొక్క పైసా వద్దంటూ వున్న నాలుగు పైసలూ వాళ్ళ కు బట్టలూ బంగారం అంటూస్వాహా చేసారా.ఇంకేంవుందని శ్రీ రామనవమి కళ్యాణం జరిపిస్తారు? మీరూ నేనూ పీటలమీద కూర్చొంటే, వశష్ఠులవారికి సంభావన ఇచ్చేదెవరు.?ఊరికే  ఇంత గొంతేసుకొని నామీదెగరడంకాదు,వెళ్ళీ, ఆ రెడ్డిగారి మీదెగరండి.'తన ఉక్రోషం వెళ్ళగక్కింది రుక్మిణమ్మ.'ఆ పుల్లవిరుపుమాటలే వద్దనేది. నాకేమన్నా భయమా! అన్నీ ఆయన్నే అడిగొస్తా,'అంటూ పైపంచ మీదేసుకొని బయలు దేరాడు పరంధామయ్య.'ఇదుగో మిమ్మల్నే',అంటూ పిలిచింది రుక్మిణమ్మ'.వెనక్కి పిలవొద్దని ఎన్నిసార్లు చెప్పాను,'విసుగుతో ఆగాడు. 'ఈ మాట వినండి బాబూ!,మన చిన్నవాడికిపెళ్ళిసంబంధాలు కుదరట్లేదనుకుంటన్నామా.ఒకసారి వాడిపేరుమీద రాములవారి కళ్యాణం చేయించమని మొన్నీమధ్య మా అన్నయ్య అన్నాడు గదా. అందుకే దేముడీ అవకాశం కల్పించాడేమో.పెళ్ళపండగ సంబారాలన్నీ రాములవారి పెళ్ళికి వాడేద్దాం. ఆ రోజే మన 50ఏళ్ళ పెళ్ళి పండగను కుందా.రామయ్య పెళ్ళిచేస్తే , మనకి సీతమ్మలాంటి కోడలొస్తుందేమో!'. ఈ సలహా బానేవుందనిపించింది'. కాని సీతారాములకళ్యాణం అంటే మాటలా, దానికి మనింట్లో వున్న సామానేమూలకి. ఈ పని నా వల్లకాదే.పైగా తెల్లారె సరికి పెద్దాడు కోడలు పిల్లలతో దిగుతాడా! చిన్నాడు ఏ టైముకొస్తాడో తెలీదా? మరిప్పుడిది శ్రీ రామనవమికి వాయిదా అంటే! ఏమో నాకేం పాలుబోవటంలేదు. వెళ్ళి ఆ రెడ్డిగార్నే అడుగుతా ఏం చెయ్యాలో.'అంటూ విసవిసా వెళ్ళాడు పరంధామయ్య. అయ్యో వచ్చిన ఈ అవకాశంగూడా జారిపోతుందేమోఅని దిగులుపడుతూ, లేటవుతున్న చిన్నకొడుకు పెళ్ళి గురించి ఆలోచిస్తూ కూర్చుంది రుక్మిణమ్మ.
               గేటుతీసుకొని లోపలికి వస్తున్న పరంధామయ్యను చూస్తూనే ,నోట్లో చుట్టను ప్రక్కనే పారేసి,'రండి పంతులుగారూ, రండి,'అంటూ ఎదురొచ్చారు రెడ్డిగారు. ఆయన్ను చూస్తూ బేలమొహం పెట్టి' ఇదేంటి రెడ్డిగారు.ఇలా చేశారు?నేనేంటో, నాతాహతేంటో తెలిసిగూడా....'ఇంకా చెప్పబోతుంటే,' పంతులుగారూ, ముందు కూచోండి. శ్రీ రామనవమేగా మీ బయానికి,కంగారుకూ కారణం.' 'అదికాదండీ, రేపు ఉగాది పండక్కి నా పిల్లలంతా..' ,'అదీ తెలుసు., మరి తెలిసిగూడా ఇలా ఎందుకు చేస్తున్నారంటారనేగా?. అదీ చెప్తా.మీ 50 పెళ్ళి పండగ రేపేనని, మీ పిల్లలంతా వస్తున్నారని,  తెలుసు. మీరొక్కళ్ళే పప్పనాలు తింటుంటే, మేమేం గావాలి. నేనూ ,మావూరూ మీ పిల్లలం గాదేంటండీ. ఇంతకాలం మాకు మంచి చెడు చెప్తూన్న మీరు  మాకు  పరాయివాళ్ళా, మేము మీకు పరాయి వాళ్ళమా. నేను కూర్చొని మీరు రాములోరి కళ్యాణం చేయించటం  బదులు మీరే పీటలమీద కూచొని, రాములోరి కళ్యాణం జరిపించి 50 ఏళ్ళ పెళ్ళి పండుగ గూడా చేసుకుంటే బాగుంటదని ఈ ఏర్పాటు అందరం ఆలోచించి చేశాము. ఆ రాములోరి పప్పన్నంతోబాటే మీ పెళ్ళి భోజన ం తిన్నట్టవుద్ది.అసలు మీ ఇంట్లో పండగ నేనే చేయిద్దామనుకున్నా. మీరొప్పుకోరని తెలుసు. అందుకే ఇట్లా జరిపిద్దాం. ఇహ ఖర్చంటారా, రాములోరి పెళ్ళిఖర్చు మాది, మీ పెళ్ళి ఖర్చు మీది.ఏమంటారు?'అడిగారు రెడ్డిగారు.పరంధామయ్య కు ఏంచెప్పాలో అర్ధంకాలా. అటు రుక్మిణమ్మ కోరిక తీరుతుందికదా అనే అనంద, రామనవమి బాధ్యత తప్పింది కదా అనే సంతోష. కాని రేపే పిల్లలొస్తున్నారే  ఏట్లాగు అనేమీమాంస.ఏ చేయాలో పాయలుబోక, సమస్యను.  రెడ్డి గారిముందు పెట్టాడు'.ఓస్ ఇంతేనా.ఇట్టా అని కబురెడతా, వాళ్ళే చూసుకుంటారు. మీరేం కంగారు పడకుండా వెళ్ళిరండి. అంతా నే చూసుకుంటాగా.'భరోసా ఇచ్చాడు  రెడ్డిగారు. ఆ మాటలకు పరంధామయ్య ఒకింత ఆశ్చర్యం, బోలెడంత సంతోషం ,మరింత సంభ్రమం ముప్పిరి గొనగా ఆనందభాష్పాలు గుండెను తడిపి,కళ్ళలో చిప్పిలగా ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తుండిపోయాడు.కళ్ళవెంట నీళ్ళుకారుతూ తనవైపే చూస్తున్న పరంధామయ్య తో,''ఏంటి పంతులుగారూ,అట్టా అయిపోయారు?కాసిని మజ్జిగ తెప్పించమంటారా. దాహం పుచ్చుకుందురుగాని, ఇదిగో అమ్మీ,పంతులుగారికి మజ్జిగ తీసుకురా.,'పురమాయించాడు.చల్లని చిక్కటి మజ్జిగ త్రాగి,'రెడ్డిగారూ, ఒక్కమాట. సీతమ్మ తాళిబొట్టు, రామయ్య భటువు,ఉత్తర జంధ్యాల మావేనండి.' 'ఈ చాదస్తంగూడానా. సరే. అట్టాగేలేండి. వెళ్ళి రేపటి పండగ పనులు చూసుకోండి,'అంటూ సాగనంపాడు రెడ్డిగారు.ఎంత తుడుచుకున్నా ఆగని కన్నీళ్ళతో కనులముందు కదలాడే సీతారాముల కమనీయ దర్శనాన్ని మరీ మరీ తలచుకుంటూ, 'శ్రీ రామా,పరంధామ,కళ్యాణ రామ, కమనీయసోమా,ఎంతదయనాయనా నామీద. నారుక్మిణి  కోరిక ఇలా తీర్చావా తండ్రి, అమ్మా !సీతమ్మ తల్లీ.నను బ్రోవమని చెప్పవే. సీతమ్మతల్లీ అని కోరకుండానే, మీచెరణాలను సేవిస్తూ,మీ నైవేద్యాలను భుజిస్తూ బ్రతికే మాకు, మీ కళ్యాణం జరిపించే మహద్భాగ్యాన్నిప్రసాదించారా!ఇంతకు మించి భాగ్యమేమున్నదమ్మా. ఈ ఋణం ఎలా తీర్చుకోవాలో, ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియని, నిస్సహా నిర్భాగ్య ప్రాణిని ఈ విధంగా కరుణించావా ప్రభూ. ధన్యుణి మాతా ధన్యుణి తండ్రీ,'ఎంత ఆపుకున్నా ఆగని ఆనందభాష్పలు తుడుచుకుంటూ తడబడుతు ఇంటికి చేరాడు పరంధామయ్య.'ఏమోయ్, నిన్నే , శుభవార్త. తొందరగారా!.అని బిగ్గరా అరుస్తూ లోపలికొ స్తున్న భర్తను ఆయన వాలకాన్ని చూస్తూనే రుక్మిణమ్మకంగారుగా,'ఏమయిందండీ. ఏంజరిగింది.ఆకన్నీళ్ళేంటి. ఆ రెడ్డిగారేమన్నారు'అంటూ ప్రశ్నలవర్షం కురుపించింది. పరంధామయ్య తమాయించు కొని, ముందు కాసిని మంచితీర్ధం, అంటుండగానే మంచినీళ్ళచేంబు చేతికిచ్చింది రుక్మిణమ్మ. గటగటా నీళ్ళుతాగి,నెమ్మదిగా కూర్చుంటూ'నీ కోరిక నెరవేరిందోయ్. నీవనుకున్నట్టే రాములవారి కళ్యాణం,తో పాటే మన పెళ్ళి పండగ, తనే జరుపుతా'నన్నారు రెడ్డిగారు ,అని జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాడు.రుక్మిణమ్మకు కూడా కళ్ళు చెమర్చినయ్. పరంధామయ్య ని చూస్తూంటే','చిన్నకొడుకు పెళ్ళి తొందరగా అయ్యేలా వేరే వ్రతాలు,పూజలు,జపాలు చేయమని ఎంతమంది చెప్పినా వినకుండా, నా శివుడే అన్నీ చూసుకుంటాడు అనే ఈ పెద్దమనిషేనా,ఇవాళ రామకళ్యణం గురించి ఇంత ఉత్సాహంగా చెబతున్నాడు.అమ్మవారికి అయ్యవారికి తాళిస డంటే, చిన్నకొడుకు పెళ్ళి గురించి ఎంత మధన పడుతున్నాడో.తన అన్న గౌరీనాధశాస్రి , సీతారాములకళ్యాణం మీరిద్దరూ కూర్చొని మీఖర్చుతో చేసుకోండి.  వాడిపెళ్ళి తొందరగా అవుతుందంటే,కుదురితేగా? ఊళ్ళో వాళ్ళకు చేయించడమేసరిపోయె. తమకేమో డబ్బు
(3) సమస్య.'వెండి జంధ్యాలు, బంగారు తాళిబొట్టు,భటువు మేమే చెచ్చుకుంటామని మహగొప్పగా చెప్పారుగదా, ఎక్కణ్ణించి తెద్దామనుకున్నారు, ఇన్నాళ్ళూ వాటికోసమేగా ఆగింది,'నిలదీసినట్లు అడిగింది రుక్మిణమ్మ.నా పెళ్ళికి పెట్టిన భటువు జంధ్యాలు వాడదాం.'అన్న పరంధామయ్య తో'ఆ భటువు తో చింతాకంత మంగళసూత్రాలొస్తాయి.భటువట్టాగే వుంచి  నామంగళ సూత్రాలు వాడదాం.''అప్పుడే అంత భారమయ్యానటోయ్.'మీ భారం మోస్తాలెండి, నాభారమే తీసి వాడేస్తా' 'ఇక్కడ నీదీ నాదీ ఏముంది,అంతా మనదేగా'సమాధానపరుస్తూ అన్నాడు పరంధామయ్య.'నా తంటాలేవో నే పడతాగాని మీరెళ్ళి రేపు ఉగాది పండగ ఏర్పాట్లేవో చూసుకోండి, నే కంసలబత్తుడిని పిలిచిమాట్లాడ్తా,'అని లేచింది రుక్మిణమ్మ.
   రోజూలాగే తెల్లారింది, అయితే ఆరోజు ఉగాదొచ్చింది. రోజవారీ ఇంట్లో కార్యక్రమాలు పూర్తి జేసుకొని, ఉగాదిపచ్చడితో రాములవారి గుడికి చేరాడు పరంధామయ్య. అప్పటికే గుడంతా ,,పచ్చని మామిడి తోరణాలతో, పూలదండ లతోనయనానందకరంగా అలంకరించబడింది.గుడి తలుపులు తెరిచి,రాములవారి కుటుంబానికి, అభిషేకాలు,   అలంకరణలు పూర్తిచేసి, థూపదీపనైవేద్యాలతో పూజార్చనలుచేసి, ఉగాదిపచ్చడితో సహా అవసర నైవేద్యాలు పెట్టి, ఒకసారి సీతారాములను తనివితీరా చూసి'రామా!!నాకు నీకళ్యాణం జరిపించడమే కాకుండా,నీతోబాటు మాకూ పెండ్లి పంగజరిపిస్తావాతండ్రీ. ఇది పిల్లలు జరిపే పండగ. నువ్వే జరిపిస్తావంటే నువ్వు..నువ్వు.. నా..నా..బిడ్డవా నాయనా. అం. త.. అదృష్టమూ వరంగా ప్రసాదించావా తండ్రీ.. కన్నీళ్ళు ధారాపాతంగా కారిపోతుంటే... బయట భక్తజన కోలాహలం తో సృహలోకొచ్చి ఉగాది పచ్చడి ప్రసాదం పంచడానికి బయటకు వచ్చాడు పరంధామయ్య. గుడికార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని భోజనానికి ఇంటికి చేరాడు పరంధామయ్య. భోజనానికి కూర్చొని, తనకుగూడా ఉగాది పచ్చడి పెట్టమన్నాడు.చేతిలో పెట్టిన షడ్రుచుల ఉగాది పచ్చడిని జుర్రుకుంటూ దాని రుచిని ఆస్వాదిస్తుంటే,ఆ రుచి ఎప్పటిలా అనిపించక'ఏమిటీ!ఈ మామిడి ముక్క ఇంత చేదుగావుంది. సరిగా చూడలేదా?'కోపంతో గట్టిగా అన్నాడు.'మామిడి చేదేమిటండీ.పిందె మరీ ఎక్కువ వగరుగా వుందేమో, దాంతోపాటే వేప్పువ్వు పంటికింద కొచ్చిందేమో!పండగనాడూరికే అరవక భోజనం చేయండి. మీ కన్నీ అనుమానాలే.'అంది రుక్మిణమ్మ. ఇహ మాట్లాడకుండా భోనంచేసి, కాసేపు విశ్రమించాడు.  సాయంత్రం పురాణ పఠనం ఇతర కార్యక్రమాలు పూర్తయ్యాక ఇంటికి చేరిన పరంధామయ్య,'అమ్మయ్య. పిల్లలు రాలేదు. రెడ్డిగారి కబురెళ్ళిందన్నమాట. శ్రీ రామనవమికి ఖచ్చితంగా వస్తారుఅనుకొంటూ నిశ్చింతగా నిద్రకుపక్రమించాడు. పరంధామయ్య దంపతులకు రోజులు వేగంగా దొర్లుసపోతున్నాయట్లుంది. అందుకు కారణం,వాళ్ళ మనసులునిశ్చింతతతొ, అనందంతో నిండిపోయనై.పరంధామయ్యైతే రోజూ రంగురంగు కలలతో ఆనందపరవసుడౌతున్నాడు.శ్రీరామనవమి ఇంకా రెండు రోజులే వుంది. పిల్లలింకా రాలేదు.సెలవులు లేని కారణంగా పండగరోజుకొస్తారని రెడ్డిగారు కబురెట్టారు.  తనకు  మొబైల్ లేదు వాడటం రాదు, పోస్టాఫీసు వుందిగదాని  ఇంట్లో పోను పెట్టించుకోలేదు.ఇతరులమీదే ఆధారం.వాళ్ళడబ్బు ముట్టని అహంకారం. రోజూ మాదిరిగానే పరంధామయ్య నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో రకరకాలకలలు. రామనవమి ఏర్పాట్లు అంగరంగవైభవంగా జరిగుతున్నట్లు, అంతలోనే  చిన్నకొడుక్కి మంచి సంబంధం కుదిరినట్లు,టైములేక మంచి మంచి ముహూర్త మని పెద్దకొడుకు కుటుంబ తను భార్య  వెళ్ళీపెళ్ళి జరిపించినట్లు, తెల్లవారి గృహప్రవేశం చేయాలని రాత్రికి రాత్రి కార్లలో తిరుగు ప్రయూణం చేస్తూండగా, దారిలో దొంగలు కర్లనాపిదోచుకుంటున్నట్టు,అడ్డుపోయిన తనను కొడుతున్నట్లు, అదెబ్బలకు తట్టుకోలేక తాను రామా, కృష్ణా, కాపాడండీ కాపాడండీ అని అరుస్తున్నట్టూ.......' ఏమండీ ఏమండీ ఏమైందండీ, ఎందుకట్టా కేకలు పెడ్తున్నారు,'అని తన్నెవరో కదిలిస్తుంటే   ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు పరంధామయ్య. వళ్ళంతా చెమట, మనిషి గజగజ వణికి పోతున్నాడు.  పిచ్చి చూపుల్తో తనని రెండు చేతులతో కదిపేస్తున్న రుక్మిణమ్మ ని చూస్తుంటే,'ఆమె ఏడుస్తూ ,'ముందు మంచి నీళ్ళు తాగండి అని పక్కనె వున్న చెంబునందింది. మంచినీళ్లు తాగి తెప్పరిల్లిన భర్తని ఏం జరిగిందండీ అని మళ్ళి అడిగింది. 'రాముడేడి, కృష్ణుడేడి అనడిగాడు. 'ఇంకా తెల్లారలేదా! ఏంజరిగిందంటే.'తనకల గురించి పూసగుచ్చినట్టు చెప్పాడు 'తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమవుతాయంటారుగదూ,' ఆయనభయం ఇంకా తగ్గలా. రుక్మిణమ్మ ఆయన ప్రక్కనే  కూర్చుని, వీపు నిమురుతూ,'ఊరికే కంగారు పడకండి. కలలోని చెడును కాదు, పెళ్ళనే మంచిని కూడా చూడండి. తెల్లవారుఝామున కల. అన్నీ సవ్యంగానే జరుగుతాయి.రాముణ్ణి తలుచుకుంటూ ధైర్యంగా పడుకోండి.'ఎంత సర్దుకుని పోదాం అనుకున్న అ కల పరంధామయ్యను వెంటాడుతూనేవుంది. అనుకున్న శ్రీ రామనవమి రానేవచ్చింది.
  రామాలయంలో సీతారాముల కల్యాణానికి కావలసిన ఏర్పాట్లు రెడ్డిగారే దగ్గరుండి అంగరంగవైభవంగా చేయించారు.గుడంతా నయనానందకరంగా అలంకరించారు. సీతారాముల కళ్యాణం చూతమురారండీ..శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండీ. ఈపాట ఆవూరి వీధుల్లో తెల్లవారుజామునుండి మోగుతూనేవుంది. మధ్యమధ్యలో ఊరి జనాన్ని ఆహ్వానిస్తూ, దానితోపాటే పరంధామయ్య గారి వివాహ స్వర్ణోత్సవం గురించి,వారి పూర్వీకులగురించీ ప్రకటనలు చేస్తున్నారు.పరంధామయ్య కు సహాయంగావచ్చిన ఆయన బావమరిది, రుక్మిణమ్మ సోదరుడు అయిన గౌరీపతి శాస్త్రికళ్యాణ ఏర్పాట్లు చూస్తున్నారు. పరంధామయ్య పెళ్లి నాటి జరీఅంచు పట్టుబట్టలు కట్టుకోగా, రుక్మిణమ్మ పెళ్ళి నాటి చిలకాకురంగు పట్టుచీర, బచ్చలపండు రంగు పట్టు రవిక కట్టింది. పరంధామయ్య మాటిమాటికి  పిల్లలింకా రాలేదేమా అనుకుంటూ గుమ్మం వైపు చూస్తున్నాడు. ఆ కల ఆయన్ను ఇంకా వెంటాడుతునేవుంది.రుక్మిణమ్మ పైకి గంభీరంగా వున్నా, లోపల గుబులు గావుంది. టైమప్పుడే 11:00గంటలు అవుతున్నది. 'పాలేరొచ్చి'అయ్యా!పంతులుగారూ.అయ్యగారు మిమ్మల్ని అందరినీ గుడికి రమ్మంటున్నారు. భద్రాచలం టైముకి మన రాములోరి పెళ్ళై పోవాలిగందా, అందుకని బేగిరమ్మన్నారు. మీఅబ్బాయిలు, కోడలమ్మ పిల్లలంతా గుడికాడికే సరాసరి వత్తారంట. ఆళ్ళొత్తున్న కార్లు మధ్యలో ఆగిపోతే,అయ్యగారి స్నేహితులు వేరేకార్లలో తీసుకత్తున్నారంట. మిమ్మల్ని ఏమీ కంగారు పడకుండా, బేగిరమ్మన్నారు. తొందరగా రండని చెప్పి వెళ్ళాడు. అప్పుడేవచ్చిన గౌరీనాధశాస్రి'పదబావ పద , పిల్లలొస్తున్నట్టు రెడ్డిగారికి పోనొచ్చింది. మీపెళ్ళిటైముకు వాళ్ళూ వస్తారు. కంగారు పడకుండా పదండి,'బయలుదేరదీసాడు. బక్కుబిక్కమని ఒకరినొకరు చూసుకుంటూ గుడికి చేరారు పరంధామయ్య దంపతులు. త్రోవపొడుగునా చేసి అంకరణమీదికి వాళ్ళ చూపులు పోలేదు. పిల్లలకై ఎదురుచూస్తు దిక్కులు చూస్తున్నారు . ఎదురుకుండా పెళ్ళిమంటపైన సర్వాలంకృత శోభితులై  చల్లని చిరునవ్వులు చిందిస్తూ తమ కళ్యాణం చూడవచ్చి వేదికచుట్టూ కూర్చున్న అశేష భక్తుల ఆశలు తీరుస్తామంటూ అభయహస్తాలుచూపుతున్న ఆ కళ్యాణ దంపతులను చూస్తూంటే పరంధామయ్య దంపతులకు దుఃఖం ఆగలేదు.ఆ వృద్ధ దంపతులు మనసారా నమస్కారాలు చేస్తూ'మము బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లీ, మాబిడ్డలనూ,'అని మొక్కుతూ నిలబడ్డారు. 'ఏంటమ్మా నువ్వు గూడా. రా, బావ కూర్చుని సంకల్పం చేయండి. అంటూకూచోబెట్టాడు గౌరీనాధశాస్రి. పరంధామయ్య దంపతులు గుండె దిటవు చేసుకొని, కార్యక్రమాలు ప్రారంభించారు.ఇంతలో కోలాహలం  కలకలం .గుడికి దూరంగా కార్లాగినయ్. పరంధామయ్య పిల్లలు కారుదిగి అమ్మానాన్నలకు తామొచ్చినసూచనగా చేతులు ఊపారు.వృద్ధ దంపతులు ఆనందంతో గుండెలనిండుగా గాలి పీల్చుకున్నారు. రుక్మిణమ్మ పిల్లల్ని ఇంటికెళ్ళి స్నానాలు చేసిరమ్మంది.
     గౌరీనాధశాస్రి వేదమంత్రాలు శ్రావ్యంగా పఠిస్తూ కళ్యాణం జరిపిస్తుంటే పరంధామయ్య హుషారు గా అతనితో గొంతుకలిపి చకచకా కార్యక్రమాలు ముందుకు నడిపించారు సరిగ్గా 12:00లకు జీలకర్ర,బెల్లం వధూవరులలకు పెట్టించగా, .మాంగల్యధారణ సుముహూర్తానికి పరంధామయ్య దంపతులు లేచి నుంచుని కొత్త తాళిబొట్లని భక్తజనులకు చూపారు.శ్రీ రామచంద్రమూర్తి కీ జై , జై శ్రీ రాం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జయజయధ్వానాలు చేస్తూ ఆ మంగళసూత్రాలను కళ్ళకద్దుకున్నారు.  మాంగల్యం తంతునా ....అనే వేదమంత్రాలతో మాంగల్య ధారణానంతర కార్యక్రమాలు పూర్తయినాయి.కొడుక్కు కల్యాణాక్షతలు వేద్దామని గుప్పెడు తీసుకొనడానికి వంగిన రక్మిణమ్మ మెడను చూసాడు పరంధామయ్య. తనమంగళసూత్రం ఒకటే కనిపించింది. రెండోదేదీ అని అడిగాడు.దానిప్రక్కనేకట్టివున్న పసుపు కొమ్మును చూపిస్తూ చిరునవ్వు నవ్వింది. ఇహ కొత్తగా వృధ్ధ దంపతుల దండలమార్పిడి కార్యక్రమం అని ప్రకటించాడు గౌరీనాధశాస్రి. పరంధామయ్య పిల్లలు రెండు పెద్ద పూలదండల తీసుకు వచ్చి తలిదండ్రులకిచ్చారు.కొడుకులు కోడలు, మనవుడు,మనవరాలు, రెడ్డిగారు,ఆయనభార్య ,కొడుకు, కూతురు ,ఊళ్ళోని ఇతర పెద్దలు,భక్తులు చుట్టూనిలబడగా ఆవృధ్ధ దంపతులు, కళ్ళలో ఆనందభాష్పాలు పొంగి పొర్లుతుండగా దండలు మార్చుకొని రెడ్డిగారి వైపు కృతజ్ఞతతో చూసారు.'"ఈ పరంధామయ్య దంపతుల తమ వివాహ సర్ణోతసవసందర్భంగా మన సీతారాములు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి వందేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లేటట్లు దీవించమని ప్రార్దిస్తూ ,''శతమానంభవతి శతాయుఃపురుషశ్శతేంద్రియే ఆయుష్శ్వేవేంద్రియే ప్రతి తిష్ఠతి అంటూ దీవించి కళ్యాణ ఆ దంపతులశిరస్సుల మీద చల్లాడు.రెడ్డి గారి దంపతులు కుటుంబ సమేతంగా వచ్చి పాదాలకు నమస్కరించారు. పరంధామయ్య దంపతులు వారందరినీ నిండుమనసుతో ఆశీర్వదించారు. తర్వాత పెద్దకొడుకు కోడలు, మనవడు, మనవరాలుని ఆశీర్వదించారు.ఆ తర్వాత చిన్నకొడుకొచ్చాడు. "నాన్నా ఆరాముడు ఇన్నాళ్ళకు నిన్ను అనుగ్రహించాడు.మా చేత కళ్యాణం జరిపించుకొని నిన్నాశీర్వదించమన్నాడు.అక్షింతలు వేయించుకో నాన్నా,'అంటూ వేయబోయింది.సీతారాముడు నెమ్మదిగా వంగుతూ వెనుతిరిగి చూసాడు. ఆ దంపతులు'శీఘ్రమేవ  కళ్యాన ప్రాప్తిరస్తూ' అక్షతలు  వేయబోతుండగా సీతారాముడి ప్రక్కనే ఒక యువతి  వచ్చి కూర్చుంది.'ఇద్దరూ ఒకే మమ్మల్ని ఆశీర్వదించండీ 'అంటూ పాదాలకు నమస్కరించారు.అప్పటికే ఆదంపతుల చేతిలోని కళ్యాణ అక్షతలు  ఆకొత్త దంపతుల తలల మీద పడటం జరిగి పోయింది.'రామా'అంటూ వణుకుతున్న గొంతుతో పిలుస్తున్న ఆ వృధ్ధ దంపతులు వైపు ఈ కొత్త దంపతులు తలెత్తి చూరారు. అంతే, ఆ ఇద్దరూ స్థాణులై పోయారు.తేలిపోతూ అరమోడ్పులౌతున్నకళ్ళతో ఎదురుగ చూసారు. మసగ మసగా  రెండుచేతులూ జోడించి చేతులెత్తి నమస్కరిస్తూ, 'మా అమ్మాయి, సీత' అంటున్న రెడ్డిగారి మాటలు నెమ్మదిగా చెవులకు వినీ విని పించనట్టు, ఆ ముసలి గుండెలు ఆగేలా... 
***

No comments:

Post a Comment

Pages