మువ్వన్నెల రెపరెపలు - అచ్చంగా తెలుగు

మువ్వన్నెల రెపరెపలు

Share This
మువ్వన్నెల రెపరెపలు
పోడూరి శ్రీనివాసరావు


ఎగరాలి… ఎగరాలి… ఎంతో ఎత్తుకు మన జెండా 
ఆనందంతో... ఉప్పొంగి గాలి ప్రతి పౌరుని హృది నిండా “ఎగరాలి”
నీలాకాశంలో మువ్వన్నెల జెండా 
విరాజిల్లుతోంది తన రెపరెపలతో 
పలకరిస్తోంది యావద్భారతాన్ని...
అఖండ భారత దేశాన్ని...
ఆసేతు హిమాచలాన్ని...
విజయ దరహాసంతో...
విశృంఖల కాశ్మీర ప్రజానీకంతో...
ప్రపంచమంతా విస్మయ దృక్కులతో... “ఎగరాలి”
ఎన్నాళ్ళకు చూస్తున్నాము 
ఆనంద వీచికలు -  కాశ్మీర బాలల్లో...
ఆప్యాయతలు, అనురాగ భావనలు 
భయకంపిత రాష్ట్ర ప్రజల్లో....
భూనభోంతరాళాలు దద్దరిల్లేలా 
స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న 
కాశ్మీర దేశప్రజల వదనారవిందల్లో 
ప్రస్ఫుటమౌతున్న ఆనందడోలికలు “ఎగరాలి”
ఆలకించండి పాక్ ప్రజల ఆర్తనాదాలు 
విశ్వలోకపు వ్యతిరేక విధానాలు 
వినిపించండి ప్రపంచ దేశాల శాంతి సందేశాలు 
వెలివేయండి ఉగ్రవాద సంఘ సాంప్రదాయాలు 
ఎగురుతున్నాయి శాంతికపోత సమూహాలు 
జెండా రెపరెపలులతో సమానంగా రెక్కల టపటపలు 
సమూహ ప్రజల ఆనందకేళి కలకలారావాలు 
మధురంగా మనోజ్ఞంగా వినిపిస్తున్న రవళులు “ఎగరాలి”
ఉప్పొంగిపోతుంది భరతమాత హృదయం 
ఒకే దేశం - ఒకే జెండా నినాదంతో 
యావద్భారత మంతా త్రివర్ణ పతాక రెపరెపలే....
ఎర్రకోటలో ఎగురుతున్న త్రివర్ణ పతాక హొయలు 
కవాతు చేస్తున్న వివిధ సాయుధ బలగాల కదం చప్పుళ్ళు 
వివిధ శాఖల,రాష్ట్రాల శకటాల వర్ణ శోభితాలు 
భారతదేశ అమ్ములపొదిలో చోటుచేసుకున్న క్షిపణులు 
వచ్చే సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చంద్రగ్రహ మండలంపై “ఎగరాలి”

  ***

No comments:

Post a Comment

Pages