భార్య విలువ - అచ్చంగా తెలుగు
భార్య విలువ
డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
(అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో  రెండవ బహుమతి  పొందిన కధ )


బెదురు చూపులతో వీరభద్రయ్యఇంటిలోకి అడుగు పెట్టిందిశారద. తెల్లని గుండ్రపు ముఖం,తిండి కొరతని సూచించే సన్నని శరీరం, లేడి కన్నుల్లాగ భయాన్ని ప్రతిబింబించే కళ్ళు, శుభ్రమైన ముతక బట్టలు, చేతులకి చెరో నాలుగు గాజు గాజులు, సన్నటిమెడలో సన్నపాటి పూసల దండ, ఆమె కుటుంబపు ఆర్థిక పరిస్థితిని చెప్పకనే చెప్పాయి. తండ్రి, నారాయణ తోడు రాగా, ఆమెతలదించుకుని, గోడకిఅనుకుని నిలుచుంది. 
      శ్రుతి, రాగవాళ్ళ‘కొత్త అమ్మ’నిరెప్పార్పకుండా చూస్తూ ఉండిపోయారు. వీరభద్రయ్యఆమెనుతేరిపారజూసి, ఆమెకు లేని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నందుకుమనసులోనేసంతోషించాడు. ఆమెఇంత మంది ముందు నిలబడడానికిసిగ్గు పడుతోందని గమనించి, పిల్లలతో, “కొత్త అమ్మనిలోపలికి తీసుకుని వెళ్ళండి”, అన్నాడువీరభద్రయ్య. 
          ఆమెతో మాటలాడే అవకాశం దొరకబోతున్నందుకు సంతోషించి, వాళ్ళువెంటనే వచ్చిశారదనిచెరోచేయీ పట్టుకుని, సాదరంగా లోపలికి తీసుకుని వెళ్ళారు. “అమ్మా, నీ పేరేంటమ్మా?” అడిగిందిరాగ. “ష్..ష్..ఈమె మనకి అక్కలాగా ఉంది”, అంది శ్రుతి. ఆ మాట వినగానే శారద కళ్ళమ్మట కన్నీళ్ళు ముత్యాల్లా జాలువారాయి. “అమ్మా, అరెరే, నిన్నుమేమేమీ అనలేదు కదా! ఎందుకు బాధపడుతావు?” బిత్తరపోయి అడిగిందిశ్రుతి. ఆమె చెంగంచుతో కళ్ళు తుడుచుకుని, “ఏమీ లేదమ్మా... ఇన్నాళ్ళూ నేను మా నాన్నగారింట్లో ఉండేదాన్ని కదా! కొత్త ఇంటికి వస్తే...”, అని నసిగింది. 
రాగ, “మాఅక్క అన్నది నిజమే... నువ్వు పెద్దక్కలా వున్నావు. నిన్ను‘అక్క’ అని పిలవాలా, ‘అమ్మ’ అని పిలవాలా?” అడిగిందిరాగ. “మీకుఇష్టం వచ్చినట్టు పిలవండి... లేదా, నా పేరుతో, అంటే ‘శారద’ అని పిలవండి.. ఇంతకీ, మీ పేర్లు చెప్పలేదేమిటి?” అడిగిందిశారద. “శ్రుతి”, “రాగ”,అని ఇద్దరూ పరిచయం చేసుకున్నారు. “మంచి పేర్లు”, అందిశారద. మళ్ళీ తనే, “వెళ్ళి మీ నాన్న గారి దగ్గరి నుంచి మీ తమ్ముణ్ణి తీసుకుని రండి, పడుక్కోబెడదాం”, అని వాళ్ళకి పని పురమాయించింది. 
చరణ్పేరెత్తగానే వాళ్ళు మొహాలు మాడ్చుకున్నారన్న విషయం ఆమె గమనించింది. “పాపంతమ్ము కి జ్వరం వచ్చింది కదా... పైగా, ముగ్... ఇద్దరు అక్కలకి ఒకే తమ్ముడు కదా! వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాలి... జాగ్రత్తగా తెచ్చెయ్యండి, పిల్లలూ!”అంది. వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్న ఒడిలో పడుక్కున్న చరణ్ని జాగ్రత్తగా తీసుకుని వచ్చారు. ఆమె అతణ్ణి మంచంపై పడుక్కోబెట్టి, శ్రావ్యంగా జోలపాట పాడింది. ఆ పాట విన్నవీరభద్రయ్యధర్మయ్య,నారాయణతో మాటలు మానేసి తన్మయత్వంలో తేలిపోయాడు. తన పిల్లలకి పెట్టిన పేర్లని మొదటి భార్య సార్థకం చేయకపోయినా, ఈమైనా తన ఇంటిని సంగీతమయం చేస్తుందని ఆశించాడు. నారాయణకార్యసిద్ధి జరిగిందని సంతోషించాడు. ధర్మయ్య తన కూతురు తిండికి మొహం వాచకుండా బ్రతుకుతుందని ఆశించాడు. 
చరణ్ నిద్రపోగానే,ఆడపిల్లలు, “కొత్తమ్మా, మా కోసం కూడా పాటలుపడవా, ప్లీజ్”, అని అర్థించారు. ఆమెసరేనన్నట్టుగా తలూపింది. 
***
            వీరభద్రయ్యకి భార్య పోయి, ఏడాది కావస్తోంది. పున్నామ నరకం నుండి కాపాడుకోవడం కోసం, భార్య, డాక్టర్- ఇద్దరూ వద్దన్నా, మూడవ సారి ప్రయత్నించాడు. మూడవ సారి కాన్పు కష్టమై, ఆమె మంచాన పడింది. అయినా, పురుషాహంకారం మెండుగా ఉన్న వీరభద్రయ్య, వ్యాపార విషయాలు చూసుకుంటూ ఆమెను పట్టించుకోలేదు. 
            ఉన్ననీరసానికిమనోవేదన తోడై, ఆమెకొడుక్కిరెండేళ్ళ వయసొచ్చే సమయానికి కన్ను మూసింది. తనకి వారసుడున్నాడు కదా, ఇంక భార్య పైకిపోతేనేమని వీరభద్రయ్య పెద్దగా బాధ పడలేదు. ఒక వంట మనిషిని ఏర్పాటు చేసి, తను వ్యాపార వ్యవహారాల్లోమునిగిపోయాడు. కానీ పిల్లల్ని సాకడం తన వల్లకాలేదు. పెద్ద పిల్లలు చదువు చెప్పమంటే విసుక్కుని ఇంటికొచ్చాక చరణ్ పైనే దృష్టి నిలిపేవాడు. అర్థం చేసుకునే వయసు కాదు కనుక ఆడపిల్లలకది ఈర్ష్యాకారకమయింది. 
          ఈ లోగా పిల్లాడికి టైఫాయిడ్ సోకింది. రాత్రింబవళ్ళు వాడి సేవలో కాలం వెళ్ళబుచ్చాడు వీరభద్రయ్య. తమపై ప్రేమ చూపించని తండ్రికింకా దూరమయ్యారు శ్రుతి, రాగ. వ్యాపారంలో అపారమైన నష్టం వాటిల్లింది. అయినా, మళ్ళీ పెళ్ళికి అతను సిద్ధపడలేదు. వచ్చే అమ్మాయి, తనకు భార్య మాత్రమే కాగలుగుతుందని, పిల్లలకి తల్లి కాబోదని నమ్మాడు వీరభద్రయ్య. 
పిల్లలు చెయ్యిదాటిపోతారేమోనన్న బాధ అతడీ విషయాన్ని స్నేహితుడైన నారాయణతో ప్రస్తావించేటట్టు చేసింది. అతడిదే మంచి అవకాశమనుకుని, రెండవపెళ్ళి చేసుకోమని శతపోరాడు. ఇంకా, సవతి తల్లి ఆరళ్ళకి అగచాట్లు పడుతున్న శారద గురించి చెప్పి, “నీకు ధర్మయ్య విషయం తెలుసు కదా! మొదటి భార్య కూతుర్నిచిన్న పెళ్ళాం రాచిరంపానపెడుతున్నా నోరెత్తలేని చవట. ఆ అమ్మాయికో ఇరవై ఏళ్ళుంటాయి. వాళ్ళ నాన్న మంచి సంబంధం తేగలడా? తెచ్చినా ఆ రెండో పెళ్ళాం పడనిస్తుందా? అసలు మీ ఇంటి అవసరాలకి పనికొస్తుందో, లేదో చూసుకో..... ఒక నెల రోజులపాటు చరణ్ ని, ఆడపిల్లల్నీ సాకనీ!” అని నచ్చజెప్పాడు. 
“వయసులో ఉన్న పిల్లని ఇలా పంపిస్తారా ఎవరైనా?’ అనుమానం వ్యక్తం చేశాడు వీరభద్రయ్య. “అవసరం... ఏ పనైనాచేయిస్తుంది. కానీ, ధర్మయ్యతో నిజం చెప్పి, వాళ్ళావిడతో మా ఇంటిలో వంట సాయం, మనిషి సాయం కావాలని చెప్తాను. సరేనా? తిండి ఖర్చు కలిసొస్తుందని అవిడెలాగూ ఒప్పుకుంటుందిలే”, అన్నాడు నారాయణ. “మరి, మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా సంగతేమిటి?” అని అడిగాడు వీరభద్రయ్య. 
“శుభం పలకరా మంకన్నా అంటే...”, అని కోపంగా విసుగ్గా చూసి, “ఇంక నీ మనసులో ఉన్న అనుమానాలనిపడుక్కోబెట్టు”, అనేసి వెళ్ళిపోయాడు. కాకతాళీయంగా ఆ రోజు రాత్రి ఆడపిల్లలు, ‘అమ్మా, అమ్మా’, అని కలవరించడం వీరభద్రయ్య చెవిని పడింది. వాళ్ళ మనసులని ఊరడించడానికి ‘కొత్త అమ్మ’ త్వరలో వస్తుందని చెప్పాడు. శారద వచ్చింది. 

***
శారద వంటింట్లోకెళ్ళి, వంట చేసే ఆవిడ పద్ధతి గమనించి, భోజనం మరింత రుచికరంగా ఉండేందుకు చిట్కాలు చెప్పింది. ఇవన్నీ దూరం నుండి గమనిస్తున్నవీరభద్రయ్య ఆనందంగా, ‘పనిమంతురాలే’, అని మనసులో అనుకున్నాడు. మళ్ళీ, ‘పాపం ఆ సవతి తల్లెన్ని కష్టాలు పెట్టి వుంటుందో’, అని తలచుకుని, బాధ పడ్డాడు. ఈమె రాక సందిగ్ధంలో ఉన్న తన జీవితానికి ఒక దారి చూపిస్తుందేమోనన్న ఆశ చిగురించింది.
ఆడపిల్లలకిఅందంగా ముస్తాబు చేసి, బడికి పంపేదిశారద. భోజనం చేసేటప్పుడు, వాళ్ళకిప్రేమగా,కొసరి కొసరి వడ్డించేది. చరణ్ కి ఇవ్వవలసిన పథ్యం ఒప్పిగ్గా ఇచ్చేది. సరైనఆదరణలేక అల్లాడిన ఆ పసిమనసు, ఊరట దొరికిన కొద్ది రోజుల్లోనే కోలుకున్నాడు. పిల్లలూ, శారద పాలూ-పంచదారలా కలిసిపోయినా, శారద మాత్రం తన వంక కన్నెత్తి కూడా చూడకపోవడం, మాటలాడకపోవడం వీరభద్రయ్యను కించిత్ నొప్పించేవి. పద్ధతైన పిల్ల, కష్టాలు పడ్డ పిల్ల చొరవ తీసుకోక పోవడంలో ఆశ్చర్యమేమీ లేదని సరిపెట్టుకున్నాడతడు. 
            ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు,వీరభద్రయ్యకి రెండు ఆలోచనలొచ్చి, ఇబ్బంది పెట్టాయి. ఒకటి, తను ఎప్పుడూ భార్య చేసే పనులు, సేవ గమనించనే లేదు. ఇంటి చాకిరీ ఆమె బాధ్యతనుకుని, చిన్న చిన్న విషయాలలో కీచులాడి, ఆమెను శాపనార్థాలు కూడా పెట్టాడు. ఏ తథాస్తు దేవతలు విని దీవించారో, ఆమె తనకు దూరమయ్యింది, తను సుడిగుండంలోనికి నెట్టబడ్డాడు. ఆమెను లోకువగా చూడకుండా తన అర్థాంగిగా గౌరవించి ఉంటే, పిల్లల లింగ నిర్ధారణకి తనే కారణమని గుర్తించి, నీరసంగా ఉన్న ఆమెను  మూడోసారిగర్భవతినిచేయకుండా ఉండేవాడేమో! ఆమె ఆరోగ్యం మెరుగుపడి ఉండేదేమో! చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభమనుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. 
            రెండవది, తను తన బేసిక్ ఇన్స్టింక్ట్ నిచంపుకోలేక గత ఆరు నెలల్లో అప్పుడప్పుడూఎవరకీ చెప్పకుండాసానివాడలని ఆశ్రయించడం తనను గుచ్చి బాధపెట్టింది. పోయిన భార్య ఎలాగూ పోయింది. ఇప్పుడుతలెత్తి కూడా చూడని మహాసాధ్వి, శారదకి పెళ్ళి చేసుకునే లోపే అన్యాయంచేశాడనే బాధ అతణ్ణి కలచివేసింది. 
***
నెల రోజులు గడిచిపోయాయి. ఆ రోజు ముహూర్తాన్ని నిర్ణయించడానికినారాయణ,ధర్మయ్యపంతులు గారినివెంటబెట్టుకుని వచ్చారు. పంతులు పంచాంగాన్ని ముందుకీ, వెనక్కీ తిరగేసి, లగ్న పత్రిక వ్రాస్తూ, తనదైన శైలిలో, “స్వస్తిశ్రీ చాంద్రమాన విలంబి నామ సంవత్సరచైత్ర శుక్ల దశమీసోమవారము నాడు అనగా, 24-03-2018 నాడు ఉదయం 11గంటల 57 నిమిషములకుపునర్వసు నక్షత్రయుక్త లగ్నము నందు అయ్యామీ పేరు చెప్పండి”, అనిధర్మయ్యదంపతుల పేర్లు, ఆ తరువాత,శారద పేరూ కనుక్కుని,వీరభద్రయ్య పూర్తి పేరు చెప్పమన్నాడు. 
“మనూరి బళ్ళో లెక్కల మాస్టారి పేరేమిటండీధర్మయ్య గారూ?” అనడిగాడువీరభద్రయ్య. “రామాయణంలో పిడకల వేటలా ఇదేవిఁటీ?” అన్నాడునారాయణ. “నేను స్పృహలో ఉండే మాటలాడుతున్నాను.ధర్మయ్య గారూ, మీ ఆవిడ మాట జవదాటలేకపోయారు. పోనీ, మీ అమ్మాయి మనసులో ఏముందో కూడా తెలుసుకోలేక పోవడం ఏమీ బాలేదు”, అన్నాడువీరభద్రయ్య. “దానికి వాడిపై మోజుందని నాకు తెలుసు. ఎంత గతిలేకపోతే మటుక్కు, ఖర్మ కాలి కులాంతర వివాహం చేసుకుంటామా, హవ్వ!” అన్నాడుధర్మయ్య. 
“అవునండీ, గతిలేక ఇంచుమించు మీ వయసున్న నాబోటి ముసలాడికిస్తారు గాని ప్రేమించిన వాడికి కట్టబెట్టరు. నాకూఆమెకీవయసులోపదిహేడేళ్ళతేడాఉంది. అంటే ఒక యౌవనపు తేడా. ఆమెనుఇష్టపడినా ఎక్కడో  తప్పుచేస్తున్నాననే భావన నన్నువేధించేది. పిల్లలు కూడా ‘అక్క’ అనోసారి, ‘అమ్మ’ అనోసారి పిలుస్తుంటే, తేలు కుట్టిన దొంగలాఫీల్అయ్యేవాణ్ణి. ఇప్పుడాసందిగ్ధం లేదు. నేను ఆమెను అడిగాను. మీఅమ్మాయినిలెక్కల మాస్టారు గోవింద రావుకిచ్చి చేయండి. 
              “అతని గురించి వాకబుచేశాను. మంచి వాడు, లెక్కల్లోనిష్ణాతుడు, డబ్బులుకుదరకపైచదువులుచదువుకోలేకపోయాడట. నా దగ్గర డబ్బులున్నాయి కదా! వాటితో వ్యాపారశాస్త్రం చదివించి, నాబిజినెస్ అప్పజెప్తాను. అమ్మాయీ, అల్లుడూకళ్ళెదురుగా ఉంటారు. నాకు కావలసింది నాపిల్లలకితల్లి. ఆకొరతని శారదవాళ్ళకొక అక్కగాతీర్చింది. గోవింద రావుకూడా పిల్లల్ని ఒక తండ్రిలా చూసుకోవడానికి ఒప్పుకున్నాడు. అంతకన్నా ఉభయతారకమైన పరిష్కారం మరేముంది?
             “నారాయణా, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఇలాంటి పరిష్కారాలు సబబు కావచ్చు గానీ, ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇలానూరిపోస్తే ఎలారా? పేదరికాన్ని ఆసరాగా తీసుకుని, ఒక ఆడపిల్ల గొంతు కోయమని ఎలా చెప్పావురా? అవునులే, మనమిద్దరం పురుషాహంకారులంకదా!కాలం మారినా పురుషాహంకారులు మారరు కదా!శారద మెత్తటి స్వభావం చూసి, ఏదోతప్పు చేస్తున్నానని నా అంతరాత్మ హెచ్చరించబట్టి సరిపోయింది గానీ, నేనూ నా వయసులో సగమున్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను కదా! పోనీ,ఆమె రాక నా కళ్ళు తెరిపించడానికి అని అనుకుంటాను. వ్యాపారంలో వచ్చే లాభాల్లో పావు వంతు పేదింటి పిల్లలు స్వావలంబనతో జీవితం వెళ్ళబుచ్చడానికికావలసిన వృత్తి విద్యలు నేర్పించడానికి ఉపయోగించే ఏర్పాటు చేస్తాను. పంతులుగారూ, శారదకి, గోవింద రావుల పెళ్ళికో మంచిముహూర్తం  పెట్టండి”, అన్నాడు వీరభద్రయ్య. 
            “అది కాదురా... నీ మేలు కోరి.... పోనీ సెలెబ్రిటీలను చూడు... ఎంత ఏజ్ గ్యాప్ తో పెళ్ళి చేసుకుంటారో”, అని సమర్థించుకోబోయాడు నారాయణ. “మనస్సాక్షి అంగీకరించని దానికి మిగతా వాళ్ళతో పోలికలెందుకురా! వాళ్ళ జీవితం వాళ్ళది, నా జీవితం నాది. నా చింత అంతా పిల్లల గురించే! వాళ్ళ జీవితాలు గాడిలో పడ్డాకనేను పెళ్ళి చేసుకోవక్కరలేదు. నాజీవన సహచారిణి దేవుడి దగ్గరకి వెళ్ళిపోయింది. 
“ఇక నా సంగతంటారా, నా భార్యని బతికుండగా లెక్క చేయని పాపానికి ప్రాయశ్చిత్తంగా ఊరూరూ తిరుగుతూ, భార్య విలువ తెలుసుకునేలా భర్తలకి నచ్చజెపపుకుంటూ బతికేస్తాను”, అనివీరభద్రయ్య ముగించాడు. 
అప్పుడుతను ఆమెనుచూసిన దగ్గరనుండీ మొట్టమొదటి సారి,శారదతలెత్తి మనసారానవ్వింది. 
***

No comments:

Post a Comment

Pages