శివం- 51 - అచ్చంగా తెలుగు
శివం - 51
రాజ కార్తీక్   

(కల్పన భారతి తన భర్త, కొడుకు ..మరణ వార్త విని ..అంతర్మధనంతో ఇంటికి బయలుదేరింది )
కాని ఏమి తెలియని ఒక పూలు అమ్మేవాడు , కల్పనమ్మ  ఎదురుయ్యిందని వర్షం కూడా పట్టించుకోకుండా ఇలా అన్నాడు, 
"అమ్మా, వ్రతం కదా అని పూజకి సరిపడా సామానులు అన్నిటికి రుసుం చెల్లించి ,ఇంటికి తెమ్మన్నావు  కదా ! ఇదిగో నీవే ఎదురుయ్యవు కదా, తీసుకువెళ్ళు "అన్నాడు ఎప్పటికిమల్లే.
వర్షంలో పెద్ద ఊరుము వల్ల, పిడుగుపాటి శబ్దం  వల్ల, బెదిరిన అతగాడు దాన్ని జారవిడిచాడు.
కాని కల్పన వైఖరి తెల్సిన అతడు ఏమి అంటుందోనని బెంబేలెత్తి, "ఇంటికి వచ్చి మళ్ళీ ఇస్తానమ్మా "అని చెప్పి తప్పుకోబోయాడు.
కల్పన భారతి భర్త, బిడ్డ మృత దేహాలు తెచ్చిన వారు మాత్రం, కల్పన కధను ఆ పూలు అమ్మేవాడికి చెప్పారు చూచాయిగా. అతగాడు వెళ్ళిపోయాడు. 
కల్పన భారతి అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తోంది ...తన అంతరంగం మాట్లాడ్తుంది.
"ఎంతోమందిని నేను నా మాటలతో .."అంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది.

తనకి వినపడుతున్న మాటలు "ఇతరలును కొడితే పుత్రులకు తగుల్తుంది " అన్నట్టు ఉన్నాయి.

తనుకు  ఓ మహిళ ఎదురుయ్యింది.

కల్పన అంతరంగం  ఆమెను చూసి "ఆమె ఒక విధవరాలు ..ఆమె ఎదురుస్తే అశుభం అని
తన కుటుంబంలో ఎవరో ఒకరు బయటకు పోతుంటే చెప్పేది. అది విని తన మనసు
నొచ్చుకునేది.‌ కానీ ఆమె మాత్రం తనది ఏమి తప్పు లేదని చెప్తూ, శాస్త్ర ప్రామాణికంగా చెప్పా అని వాదన చేసేది.
ఆమె మొహంలో మాత్రం నీకు నేనున్నానన్న చిన్న భరోసాతో ఉన్న నవ్వు. ఆమె కనుల సైగతో శ్రద్దాంజలి ఘటించింది.

ఆ సైగ కు అర్ధం "అందరు నీ లాగా ఉంటే ఆడదాని కి విలువ ఏముంది అని " తెలుస్తూనే ఉంది.‌

కల్పన భారతి కనులలో కన్నీటి నిలువ ఎక్కువ కావాలనేమో,తన పాదాలను  ముందుకు సాగిస్తూ  తన జ్ఞాపకాల ప్రయాణం చేస్తోంది.

తనకి ఎదురు అయ్యాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి కల్పన భారతిని, ఏదో చిన్న
మాట అని అనకుండా అన్నాడు అని, రక్షక భటులకు చెప్పి, అతన్ని రాజు గారి
సమక్షంలో కఠినంగా దండింప చేసింది.

వాడు గట్టిగా ఎవరితో అన్నట్లో, మద్యపు మత్తులో ఇలా‌ అన్నాడు,
"ఊరి బయట ఉండి వ్యభిచారం చేసే వాళ్ళకి అయనా విలువ ఇస్తాను గాని, ఇలా
మనుషలను అవమానించి ,మాటలతోనే తూట్లుపొడిచే దీనికి ఇవ్వను‌. అనవసరంగా నా తప్పు లేకుండా, నాకు చేసిన అవమానానికి
కొన్ని రెట్లు అనుభవిస్తుంది."

కల్పన భారతికి మాత్రమే తెల్సు అతను ఎవర్ని అన్నాడో. అవును నిజంగానే వాడ్ని తను అలా చేసి ఉండకూడదు.

ఒక కంటి నుండి తనను తిట్టిన తిట్లకు కన్నీరు, మరొక కంటి నుండి తన
పరిస్తితికి కన్నీరు.

మరొక మాట కల్పన చెవిన పడింది...

"ఆత్మాభిమానం అని అంటూ ఉండేది కదా ! మన పనులన్ని చేయకుండా ఎగొట్టి, తన పనులను మాత్రమే చేస్కొని, తలెత్తి బతేకేది కదా . ఇప్పుడు నిజమైన ఆత్మభిమానం ఉంటే, తన భర్త శవాన్ని కొడుకు శవాన్ని తను ఒక్కటే తీసుకువెళ్ళాలి .."

కల్పన మనసు "నిజమే కదా . ఏదో ఒక మంచి పని చేసినా, అది తను మంచి అనిపించుకోవటానికి తప్ప మనస్పూర్తిగా చేసింది కాదు " అనుకుంది.

"కల్పన భారతి నీది స్తిత ప్రజ్ఞత కాదు, అహంకారం. పాండిత్యం కాదు, పరాభవం
చేసే మనస్తత్వం .."మరొక గొంతు వినిపించింది.

కల్పన మనసు "ఈ లోకం సమయం చూస్కొని  కాకులు లాగా ప్రవర్తిస్తుంది .." అనుకుంది.

ఎవరో ఒక ముసలావిడ తనకు ఎదురుయ్యి "జాగ్రత్తగా ఉండు తల్లి ..మనసుని రాయి
చేసుకో "అని చెప్పి వెళ్ళింది దారిలోనే.

ఇప్పుడు గుర్తుకు వచ్చింది కల్పనకు ఆమె గురించి. మితిమీరిన కామ వాంఛతో
కల్పన తన భర్త ఎన్నో భ్రుణ హత్యలు చేసారు. దానికి ఔషదం ఇచచే ఆమె ఈమె. 
"చూడమ్మ , భ్రుణ హత్య మహా పాపం ..మనకి దేవుడు వివేకం ఆలోచన పెట్టాడు. బహుశా ఇది మీ దంపతుల విషయం, అయినా నేను పెద్దదానిగా చెప్పాలి కదా "అని
మంచి చెప్పింది.

కల్పన మాత్రం "మా ఇష్టం వచినట్టు మేము చేసుకుంటాము నువ్వు ఎవరివి? మందు ఇచ్చి
నీ రుసుం తీసుకొని పో." అంది.
ఆమె మాత్రం అలా చేయటం మహాపాపం. ఇప్పటికి నేను నాలుగు సార్లు చూసాను ,ఆ
పాపం ఊరికే పోదు. ప్రాణం తీసినందుకు శిక్ష పడ్తుంది ప్రక్రృతిలో. నువ్విచ్చే రుసుము నీ దగ్గరే ఉంచుకో . నిలాంటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే, మాకు కూడా పాపం. గతంలో నువ్వు ఇచ్చిన రుసుము కూడా నాకొద్దు.' అని తన దగ్గర ఉన్న డబ్బు కల్పన ముందు పెట్టి, దణ్ణం పెట్టి, మళ్ళీ నన్ను పిలవొద్దు,' అని
వెళ్ళిపోయింది.

కల్పన మనసు "ఇక  తనని నిజంగా పిలవాల్సిన పని లేదు .." అనుకుంది.

శిక్ష పడ్తుంది అనే మాట గుర్తు చేసుకొని ..'అవును తనకి విధి శిక్ష విధించింది,' అని అనుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడిచింది ఆమె.
(సశేషం)

No comments:

Post a Comment

Pages