శ్రీధరమాధురి -61 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -61

Share This
శ్రీధరమాధురి -61
(తామే నిర్దిష్టంగా ఉన్నామన్న భ్రమతో ఇతరులను నిందిస్తూ జీవితం గడిపేస్తూ ఉంటారు కొందరు. ఈ విషయంలో పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


‘నిర్దిష్టమైన జీవనం గడపడడం’ అనే భ్రమకు చికిత్స చెయ్యడం అనేది అసాధ్యం. అలా ఆలోచించేవారు అజ్ఞానంలో ఉంటారు. నిజానికి వీరు లోతైన కోమా స్థితిలో ఉంటారు. ఉత్తమమైన జీవితం సంపూర్ణంగా ఉంటుంది. నిర్దిష్టత, అనిర్దిష్టత అనేవి ఒకదాన్ని ఒకటి ఆశ్రయిస్తూ ఉంటాయి. అవి కలిసే ఉంటాయి. ఒకటి లేకుండా మరొకటి మనలేదు. నిజానికి నిర్దిష్టంగా ఉన్నామని అనుకునేవారు ఒక గాఢమైన కోమాలో ఉన్నారు. జ్ఞానము కల వ్యక్తికి ఈ నిజం తెలుసు, అందుకే తాను నిర్దిష్టంగా ఉన్నానని ఏ నాడూ వారు గొప్పలు కొట్టుకోరు. ఎవ్వరూ పూర్తి చెయ్యడం అసాధ్యం. లోపాలతో కూడా ఉండరు. నిర్దిష్టంగా ఉన్నామన్న అపోహ వల్ల జనించే అపవిత్రతకు చికిత్స చెయ్యడం అసాధ్యం.
నాకు తారసపడ్డ నిర్దిష్టమైన వ్యక్తులు మానసిక రోగులు. వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు. ప్రకృతి పధకంలో పరిపూర్ణత మాత్రమే విజయం సాధిస్తుంది.


మీరు సర్వదా స్వచ్చమైనవారు. కొన్నిసార్లు ఇది మార్చిపోతారు,అంతే. అలామర్చిపోయినప్పుడు అనుసంధానం తెగిపోతుంది. ఒక రకమైన సందిగ్ధం
ఆస్వాదించడు, ఎవరినీ సంతోషంగా ఉండనివ్వడు. నిర్దిష్టత అనేదే ఒక భ్రమ.

మీకన్నీ తెలుసని మీరు అనుకున్న రోజున మీరు జీవచ్చవంతో సమానం. ఇక ఆశ్చర్యపోయేందుకు ఏమీ ఉండదు. ఆనందాన్ని పొందేందుకు ఏమీ ఉండదు. మీకు ఏ విధమైన నిగూఢత అక్కర్లేదని, ఈ సృష్టి యొక్క రహస్యాలను అన్నింటినీ మీరు తెలుసుకున్నారని, మీరు అనుకున్న రోజున, జీవితం ఆత్మహత్యాసదృశంగా తయారౌతుంది. మీరు మానసిక రోగులు అవుతారు. అసలు అన్నీ మీకు తెలుసన్న ఆలోచనే అనుచితమైనది, మూర్ఖమైనది.
అప్పుడు మీకు మళ్ళీ స్పష్టత వస్తుంది. కాబట్టి, ఎప్పుడైనా సందిగ్ధం ఏర్పడినప్పుడు, గురువు మీ సమీపానికి వచ్చి, మీ స్వచ్చతను గుర్తు చేస్తారు. మీకు స్పష్టత ఉన్నప్పుడు, బాహ్యంలో గురువు కనిపించరు, ఆయన మీలోనే కలిసిపోయి ఉంటారు.
మీరు దేన్నైనా ఖండించినప్పుడు, అది ఇతరులకు జనరంజకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదే మానవ మెదడుకున్న ఆశ్చర్యకరమైన ప్రవృత్తి.
ఆనందం, దుఃఖం అనేవి అజ్ఞానం నుంచి పుడతాయి. మీరు కోరుకున్న విధంగా అన్నీ జరిగినప్పుడు, మీరు ఆనందంగా ఉంటారు, దీనికి విరుద్ధంగా జరిగినప్పుడు బాధపడతారు. రెండు భావనలకు ఆశించినవి జరగడం లేక జరగకపోవడమే కారణం.అందుకే అవి అజ్ఞానం నుంచి జనిస్తాయి. ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి, జీవితంలోని ప్రతి విషయాన్ని సమత్వ భావనతో చూస్తారు. ఆయన నడతలో ఒక సంయమనం ఉంటుంది. ఆయన ఎన్నడూ అత్యుత్సాహంతో గాని, నిరాశతో గాని ఉండరు. ఆయన ఒక శాంతమైన స్థితిలో ఉంటారు. ఆయన పూర్తి ప్రశాంతతతో ఉంటారు. అందుకే ఆయన ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఆయన అన్నింటినీ అంగీకరిస్తారు, ఏమీ ఆశించరు.

మీరు లోపాలతో ఉన్నారు కనుకనే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను కూడా అనిర్దిష్టమైన వ్యక్తినే. మీరు ఎలా ఉన్నా నేను అర్ధం చేసుకోగలను. మీరు లోపాలతో ఉంటే మార్పుకు అవకాశం ఉంటుంది. వృద్ధికి అవకాశం ఉంటుంది. నా దృష్టిలో తాము నిర్దిష్టంగా ఉన్నామని గొప్పలు కొట్టేవారు చనిపోయిన వారితో సమానం. నాతో అనుబంధం కలిగి ఉండాలంటే, మీరు లోపాలున్న వ్యక్తులే కావాలి. మీరు ఖచ్చితంగా ఉన్నారని మీకు అనిపిస్తే, నాతో అనుబంధం తెంచుకోవడం మంచిది. ఎందుకంటే నేను అనిర్దిష్టతకు ప్రతిరూపాన్ని. ఎవరైనా వింటున్నారా?


***

No comments:

Post a Comment

Pages