తెలుగుతల్లి-అమరావతి
 బండ్లమూడి పూర్ణానందం 
9440143670

అమరావతినగర అపురూపవల్లీ
అమరభాషవల్లి మా తెలుగు తల్లి

మన రాజధానికి మధ్య భాగమున
కిరణాల వెలుగులో మురిసేటి తల్లి
 బంగారు కిరణాల కాంతి వెదజల్లు
తెలుగుబిడ్డల తల్లి మా కల్పవల్లి           అమరావతి..

కళలకూ కాణాచి ఈ తెలుగునేల
కూచిపూడి నాట్య సౌందర్యహేల
నన్నయ్య తిక్కన్న మెట్టినా భూమి
అష్టదిగ్గజ కవుల భావాలు నిండే           అమరావతి..

రమణీయమైనది రసరమ్యమైనదీ
కృష్ణవేణీ తల్లి చెంగటా నిలిచీ
కొండపై నిండుగా కనకదుర్గంబ
పానకములస్వామి నరసింహరాయ       అమరావతి..

ప్రముఖమైన బౌద్ధ క్షేత్రాల నడుమ
సొగసుగా నిలిచింది మా తెలుగుతల్లి
జైన మతగురువుల భావాల సన్నిధి
కొలువుదీరి రాజ్యలక్ష్మిగా నుండే...        అమరావతి..

***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top